15 సీజన్లుగా ఐపీఎల్ టైటల్ గెలవడం లేదని అందరూ ఆర్‌సీబీని టార్గెట్ చేయడం వల్ల తెలియడం లేదు కానీ పంజాబ్ కింగ్స్ రూటే సెపరేటు... ఐపీఎల్‌లో ఎక్కువ మంది కెప్టెన్లను వాడిన టీమ్ పంజాబ్ కింగ్స్. వాడడం అంటే అలా ఇలా కాదు, సగటున ప్రతీ సీజన్‌కి ఓ కొత్త కెప్టెన్‌ని మార్చింది పంజాబ్ కింగ్స్...
ఇప్పటిదాకా 15 సీజన్లు జరిగితే 14 మంది కెప్టెన్లను మార్చింది పంజాబ్ కింగ్స్ టీమ్ మేనేజ్‌మెంట్. 2023 సీజన్‌లోనూ కొత్త కెప్టెన్‌తో బరిలో దిగిన పంజాబ్ కింగ్స్, వచ్చే సీజన్‌లో కెప్టెన్ ఎవరనే విషయంపై కూడా హింట్ ఇచ్చేసింది...
లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో శిఖర్ ధావన్ అనారోగ్యంతో బాధపడుతుండడంతో అతని స్థానంలో ఇంగ్లాండ్ కుర్ర ఆల్‌రౌండర్ సామ్ కుర్రాన్, తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించాడు. వరుసగా రెండు మ్యాచుల్లో ఓడిన పంజాబ్‌కి మంచి కమ్‌బ్యాక్ విజయాన్ని అందించాడు..
37
గత మూడు సీజన్లుగా వస్తున్న ఆనవాయితీ, ఈసారి కూడా కొనసాగితే పంజాబ్ కింగ్స్ నెక్ట్స్ కెప్టెన్ సామ్ కుర్రానే. ఎందుకంటే 2021 సీజన్‌లో కెఎల్ రాహుల్ కడుపు నొప్పితో బాధపడుతూ ఆసుపత్రిలో చేరడంతో ఓ మ్యాచ్‌కి మయాంక్ అగర్వాల్ కెప్టెన్‌గా వ్యవహరించాడు..
47
ఆ మ్యాచ్‌లో మయాంక్ అగర్వాల్ 99 పరుగులు చేసి అదరగొట్టాడు. దీంతో కెఎల్ రాహుల్, లక్నోకి వెళ్లిపోవడంతో వన్ నైట్ స్టాండ్ ఇన్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్‌కి పంజాబ్ కింగ్స్ కెప్టెన్సీ పగ్గాలు అప్పజెప్పింది టీమ్ మేనేజ్‌మెంట్..
57
(PTI Photo) (PTI04_09_2023_000374B)
2022 సీజన్‌లో మయాంక్ అగర్వాల్ బ్యాటర్‌గా అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. ఓ మ్యాచ్‌లో గాయం కారణంగా మయాంక్ అగర్వాల్ బరిలో దిగకపోవడంతో అతని స్థానంలో శిఖర్ ధావన్ తాత్కాలిక సారథిగా వ్యవహరించాడు... 2023 సీజన్‌లో మయాంక్ అగర్వాల్‌ని బయటికి పంపించి, శిఖర్ ధావన్‌కి కెప్టెన్సీ అప్పగించింది పంజాబ్ కింగ్స్...
67
Sam Curran
వరుసగా మూడు సీజన్లలో కెప్టెన్ గాయపడడం, ఆ మ్యాచ్‌కి కెప్టెన్ చేసిన టెంపరరీ కెప్టెన్, ఆ తర్వాతి సీజన్‌లో పూర్తి స్థాయి కెప్టెన్‌గా మారడం జరుగుతూ వస్తోంది. ఆ లెక్కన పంజాబ్ కింగ్స్ తర్వాతి కెప్టెన్ సామ్ కుర్రానేనని ఫిక్స్ అయిపోతున్నారు ఐపీఎల్ ఫ్యాన్స్...
77
2019లో రవిచంద్రన్ అశ్విన్ కెప్టెన్‌గా ఉన్నప్పటి నుంచి వరుసగా ఆరో స్థానంలోనే కొనసాగుతూ ఐపీఎల్‌లో అత్యంత నిలకడైన ప్రదర్శన చూపిస్తోంది పంజాబ్ కింగ్స్. అశ్విన్, కెఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్... ఇలా కెప్టెన్లు మారినా పంజాబ్ కింగ్స్ పొజిషన్ మాత్రం మారలేదు. మరి శిఖర్ ధావన్, పంజాబ్ రాతను మారుస్తాడో లేదో చూడాలి..