వచ్చామా, సిక్సర్లు కొట్టామా! వెళ్లమా.. ఈ వయసులో పరుగెత్తడం కష్టం! - మహేంద్ర సింగ్ ధోనీ...

First Published May 11, 2023, 9:54 AM IST

ఐపీఎల్ 2023 సీజన్‌‌‌లో ఎక్కువ చర్చకు వస్తున్న పేరు మహేంద్ర సింగ్ ధోనీ. ఈ సీజన్‌తో ధోనీ, ఐపీఎల్ నుంచి రిటైర్ అవుతాడనే వార్తలతో డిస్కర్షన్ అంతా మాహీ చుట్టే తిరుగుతోంది. ధోనీ కూడా రిటైర్మెంట్ గురించి ఒక్కోసారి ఒక్కోలా స్పందిస్తున్నాడు...
 

Chennai: Chennai Super Kings captain MS Dhoni before the start of the IPL 2023 cricket match between Chennai Super Kings and Delhi Capitals, at M. A. Chidambaram Stadium in Chennai, Wednesday, May 10, 2023. (PTI PhotoR Senthil Kumar) (PTI05_10_2023_000236B)

తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 9 బంతుల్లో ఓ ఫోర్, 2 సిక్సర్లతో 20 పరుగులు చేసి అవుట్ అయ్యాడు మహేంద్ర సింగ్ ధోనీ. 8వ స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన ధోనీ బ్యాటుతో మెరుపులు మెరిపించి, ఆఖరి ఓవర్‌ ఐదో బంతికి అవుట్ అయ్యాడు...

ఐపీఎల్‌లో డెత్ ఓవర్లలో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్‌గా ధోనీ టాప్‌ ప్లేస్‌లో ఉన్నాడు. ఐపీఎల్‌లో 17-20 ఓవర్లలో ధోనీ  162 సిక్సర్లు బాదితే, కిరన్ పోలార్డ్ 127 సిక్సర్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఏబీ డివిల్లియర్స్ 112 సిక్సర్లతో మూడో స్థానంలో ఉన్నాడు...

Latest Videos


PTI PhotoSwapan Mahapatra)(PTI04_23_2023_000413B)


‘సెకండాఫ్‌లో చెపాక్ పిచ్ స్పిన్నర్లకు చక్కగా అనుకూలిస్తోంది. ఇక్కడ ఎంత స్కోరు చేస్తే గెలవగలమని అంచనా వేయలేకపోయాం. అయితే 160-170 మంచి స్కోరు అవుతుందని అనుకున్నా.. 
 

అయితే మాకున్న బ్యాటింగ్ యూనిట్‌కి ఇంకా ఎక్కువే పరుగులు చేయొచ్చు. మొయిన్ ఆలీ, జడేజాలకు బ్యాటింగ్ వచ్చింది. ఐపీఎల్ చివరి క్వార్టర్‌లోకి అడుగుపెడుతున్నప్పుడు టీమ్‌లో అందరికీ బ్యాటింగ్ రావడం చాలా అవసరం..
 

Image credit: PTI

రుతురాజ్ గైక్వాడ్ చాలా చక్కగా బ్యాటింగ్ చేస్తున్నాడు. అతనికి గేమ్‌ని అర్థం చేసుకునే లక్షణం బాగా అలవడింది. పరిస్థితులకు తగ్గట్టుగా తన ఆటతీరును మార్చుకోగలుగుతున్నాడు..

ఈ వయసులో బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుకు వచ్చి సింగిల్స్, డబుల్స్ తీయడం నా వల్ల కాదు. ఇన్నింగ్స్ ఆఖర్లో వచ్చి సిక్సర్లు, బౌండరీలు బాదడమే నేను చేయగలిగింది.

వచ్చామా, సిక్సర్లు కొట్టామా, వెళ్లామా.. ఇదే నా జాబ్. నాతో పరుగెత్తించకండి...’ అంటూ కామెంట్ చేశాడు మహేంద్ర సింగ్ ధోనీ..

MS Dhoni

భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కూడా ధోనీ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు. ‘ధోనీ వికెట్ల మధ్య పరుగెత్తడానికి ఇబ్బందిపడుతుంటే చూడడానికి చాలా కష్టంగా ఉంది. అతను ఇంతకుముందు వికెట్ల మధ్య చిరుతలా ఉరికేవాడు...’ అంటూ ట్వీట్ చేశాడు ఇర్ఫాన్ పఠాన్..

click me!