అస్సాం ట్రైన్ ఎక్కేసిన ఢిల్లీ క్యాపిటల్స్... నెక్ట్స్ బెర్త్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌‌దేనా? లేక...

Published : May 11, 2023, 09:29 AM IST

ఐపీఎల్ 2023 సీజన్‌లో వరుసగా మొదటి ఐదు మ్యాచుల్లో ఓడిన ఢిల్లీ క్యాపిటల్స్, ఆ తర్వాత అన్యూహ్యాంగా ఐదింట్లో నాలుగు మ్యాచులు గెలిచి ఊహించని కమ్‌బ్యాక్ ఇచ్చింది. అయితే చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో ఓటమితో ఢిల్లీ క్యాపటల్స్ ప్లేఆఫ్స్ అవకాశాలు దాదాపు ఆఫ్ అయిపోయాయి...

PREV
110
అస్సాం ట్రైన్ ఎక్కేసిన ఢిల్లీ క్యాపిటల్స్... నెక్ట్స్ బెర్త్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌‌దేనా? లేక...
PTI Photo/Ravi Choudhary) (PTI05_06_2023_000457B)

తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 167 పరుగులే చేయడంతో ఢిల్లీ క్యాపిటల్స్ ఈ మ్యాచ్‌లో కూడా గెలిచి, ఐపీఎల్ 2023 సీజన్ ప్లేఆఫ్స్ రేసుని మరింత ఇంట్రెస్టింగ్‌గా మారుస్తుందని అనుకున్నారు చాలామంది...

210

ఆర్‌సీబీతో మ్యాచ్‌లో 181 పరుగుల భారీ టార్గెట్‌ని ఊదేసిన ఢిల్లీ క్యాపిటల్స్, అంతకుముందు సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో 188 పరుగులు చేసింది. అయితే చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మాత్రం ఢిల్లీ పూర్తిగా తేలిపోయింది..
 

310
Image credit: PTI

168 పరుగుల లక్ష్యఛేదనలో 140 పరుగులకే పరిమితమై 27 పరుగుల తేడాతో ఓడింది. చెపాక్ స్టేడియంలో సీఎస్‌కే చేతుల్లో ఓడిపోవడం వరుసగా ఏడోసారి. చివరిగా 2011లో సీఎస్‌కేపై ఇక్కడ విజయాన్ని అందుకుంది ఢిల్లీ టీమ్...

410

ఈ ఓటమితో ఈ సీజన్‌లో ఏడో ఓటమి అందుకున్న ఢిల్లీ క్యాపిటల్స్, మిగిలిన 3 మ్యాచుల్లో గెలిచినా ప్లేఆఫ్స్ చేరే ఛాన్సులు 1 శాతం మాత్రమే. ఆఖరి పొజిషన్‌లో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్, టాప్ 4లోకి రావాలంటే అద్భుతం, అత్యద్భుతం ఏదో జరగాలి...

510
PTI Photo/Kamal Kishore) (PTI04_29_2023_000324B)

ఢిల్లీ తర్వాత అస్సాం ట్రైన్ ఎక్కేందుకు సిద్ధంగా ఉన్న టీమ్ సన్‌రైజర్స్ హైదరాబాద్. 10 మ్యాచుల్లో ఆరింట్లో ఓడిన ఆరెంజ్ ఆర్మీ, ప్రస్తుతం 9వ స్థానంలో ఉంది. శనివారం లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్ ఆడనుంది ఎస్‌ఆర్‌హెచ్..
 

610

ఆ తర్వాత గుజరాత్ టైటాన్స్, ఆర్‌సీబీ, ముంబై ఇండియన్స్‌తో మ్యాచులు ఉన్నాయి. వీటిల్లో ఏ ఒక్క మ్యాచ్ ఓడినా సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి అస్సాం ట్రైన్‌లో సీన్లు కన్ఫార్మ్ అయిపోతాయి..
 

710

8వ స్థానంలో ఉన్న పంజాబ్ కింగ్స్, 7వ స్థానంలో ఉన్న ఆర్‌సీబీ, ఆరో స్థానంలో ఉన్న కేకేఆర్, ఐదో స్థానంలో ఉన్న రాజస్థాన్ రాయల్స్... 11 మ్యాచుల్లో ఐదేసి విజయాలతో ఉన్నాయి. ఈ టీమ్స్‌కి ఇకపై జరిగే ప్రతీ మ్యాచ్ డూ ఆర్ డై మ్యాచుల్లాంటివే...
 

810

వర్షం కారణంగా అదనంగా ఓ పాయింట్ అదనంగా రావడం లక్నో సూపర్ జెయింట్స్‌కి కలిసి వచ్చేలా ఉంది. అయితే ప్రస్తుతం టాప్ 4లో ఉన్న లక్నో, సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్, కేకేఆర్‌లతో మ్యాచులు ఆడనుంది...

910

ఇటు లక్నోతో పాటు అటు ఆ మూడు టీమ్స్‌కి కూడా ఈ మ్యాచులు కీలకం కావడంతో కృనాల్ పాండ్యా టీమ్ ప్లేఆఫ్స్ చేరాలంటే కనీసం రెండింట్లో అయినా ఘన విజయాలు అందుకోవాల్సి ఉంటుంది.. 

1010

ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్నా, ప్లేఆఫ్స్ వెళ్లే టీమ్స్‌ని డిసైడ్ చేయడంలో కీలక పాత్ర పోషించనుంది ఆ టీమ్. మొదటి 5 మ్యాచుల్లో 4 విజయాలు అందుకుని, ఆ తర్వాత 6 మ్యాచుల్లో ఒకే విజయం అందుకున్న రాజస్థాన్ రాయల్స్... నేటి మ్యాచ్‌లో కేకేఆర్ చేతుల్లో ఓడి ప్లేఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంటుంది.. 

click me!

Recommended Stories