మమ్మల్ని ముంచింది అతనే! స్కిల్స్ ఎన్ని ఉంటే ఏం లాభం... పృథ్వీ షాపై షేన్ వాట్సన్ కామెంట్స్..

Published : May 20, 2023, 04:13 PM IST

ఐపీఎల్ 2023 సీజన్ ఆరంభానికి ముందు మావోడు ఈసారి ఆరెంజ్ క్యాప్ గెలుస్తాడని పృథ్వీ షా ఫామ్ గురించి నమ్మకంగా చెప్పాడు ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్. అయితే ఐపీఎల్ 2023 సీజన్‌లో అట్టర్ ఫ్లాప్ అయిన ఓపెనర్‌గా నిలిచాడు పృథ్వీ షా...

PREV
16
మమ్మల్ని ముంచింది అతనే! స్కిల్స్ ఎన్ని ఉంటే ఏం లాభం... పృథ్వీ షాపై షేన్ వాట్సన్ కామెంట్స్..

ఐపీఎల్ 2023 సీజన్‌లో ఆడిన మొదటి 6 మ్యాచుల్లో కలిపి 47 పరుగులే చేశాడు పృథ్వీ షా. ఇందులో రెండు డకౌట్లు కూడా ఉన్నాయి. వరుసగా ఫ్లాప్ అవుతుండడంతో అతన్ని తుది జట్టు నుంచి తప్పించింది ఢిల్లీ క్యాపిటల్స్...
 

26

ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్న తర్వాత తిరిగి రీఎంట్రీ ఇచ్చిన పృథ్వీ షా, పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 38 బంతుల్లో 7 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 54 పరుగులు చేసి హాఫ్ సెంచరీ అందుకున్నాడు...

36

‘ఈ సీజన్‌లో మమ్మల్ని బాగా డిస్సాప్పాయింట్ చేసింది పృథ్వీ షా. మమ్మల్ని నిలువునా ముంచింది అతనే! అతను వరల్డ్‌లో ఉన్న మోస్ట్ బ్యూటీఫుల్ బ్యాటర్లలో ఒకడు. బెస్ట్ బౌలర్లను కూడా చీల్చి చెండాడగల టాలెంట్ అతని సొంతం...

46

అందుకే అతను వరుసగా విఫలమవుతున్నా అవకాశాలు ఇస్తూ వచ్చాం. అయితే అది మా టీమ్‌ని తీవ్రంగా దెబ్బ తీసింది. ఇప్పుడే కాదు, గత కొన్నేళ్లుగా పృథ్వీ షా ఇలాగే నిలకడలేమితో ఆడుతున్నాడు. కొన్ని మ్యాచులు పక్కనబెట్టాక అతనికి సీరియస్‌నెస్ వచ్చింది..

56
PTI Photo/Vijay Verma)(PTI04_01_2023_000337B)

ఎక్కడ తప్పు జరుగుతుందో ఆలోచించాడు, దాన్ని సరిదిద్దుకున్నాడు. అతనికి ఎంతో బ్యాటింగ్ టాలెంట్ ఉంది. దాన్ని సరిగ్గా వాడుకుంటే ప్రపంచ క్రికెట్‌ని శాసించగలడు. అయితే నిలకడ రావడానికి కాస్త సమయం పడుతుంది. దానికి అతనిలో కాస్త కసి రేగాలి...

66

సత్తా ఎంత ఉన్నా, బాగా ఆడాలి? పరుగులు చేయాలనే కసి లేకపోతే నిర్లక్ష్యంగా ఆడి వికెట్ పారేసుకుంటూ ఉంటారు. పృథ్వీ షా విషయంలో జరుగుతోంది అదే. అతనికి పరుగులు చేయాలనే ఆకలి లేదు... ’ అంటూ కామెంట్ చేశాడు ఢిల్లీ క్యాపిటల్స్ అసిస్టెంట్ కోచ్ షేన్ వాట్సన్.. 

click me!

Recommended Stories