రెండు వందలా.. అది మాకు చాలా చిన్న విషయం.. ‘ఉఫ్’మని ఊదేస్తాం..

Published : May 04, 2023, 10:02 AM IST

IPL 2023: ఐపీఎల్ లో  ఒక టీమ్ ఆడేది ఇన్నింగ్స్ లో  20 ఓవర్లే. కానీ  200 కు పైగా టార్గెట్ పెట్టినా ‘ఉఫ్’మని ఊదేస్తామంటున్నాయి కొన్ని జట్లు.. 

PREV
16
రెండు వందలా.. అది మాకు చాలా చిన్న విషయం.. ‘ఉఫ్’మని ఊదేస్తాం..
Image credit: PTI

టీ20 ఫార్మాట్ క్రికెట్ లో   పెను మార్పులకు కారణమవుతున్నది. ‘బాదుడే లక్ష్యం.. దూకుడే  మార్గం’ అన్న  సూత్రాన్ని  తూచా తప్పకుండా పాటిస్తున్న టీమ్స్..  120 బంతుల్లో  డబుల్ హండ్రెడ్ టార్గెట్ ను కూడా  ఉఫ్‌మని ఊదేస్తున్నాయి. 

26

పంజాబ్ - ముంబై మధ్య నిన్న మొహాలీ వేదికగా  జరిగిన ఐపీఎల్ -16..  46వ లీగ్ మ్యాచ్ లో భాగంగా  పంజాబ్ నిర్దేశించిన  215 పరుగుల లక్ష్యాన్ని ముంబై మరో ఏడు బంతులు మిగిలుండగానే ఛేదించింది.  తద్వారా  ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది.  ఐపీఎల్ లో హయ్యస్ట్ టార్గెట్స్ ఛేజ్ చేసిన జట్ల గురించి ఇక్కడ చూద్దాం. 

36
Image credit: PTI

ఐపీఎల్ లో  అత్యధిక ఛేదన చేసిన జట్టు రాజస్తాన్ రాయల్స్. 2020లో షార్జా వేదికగా ముగిసిన  ఓ మ్యాచ్ లో  రాజస్తాన్.. పంజాబ్ నిర్దేశించిన  224  పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. 

46

2021లో ముంబై ఇండియన్స్ - చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన చెన్నై.. 20 ఓవర్లలో  218 పరుగులు చేసింది. ఛేదనలో ముంబై.. ఆఖరి బంతికి విజయం సాధించింది.  ఈ మ్యాచ్ లో కీరన్ పొలార్డ్.. 34 బంతుల్లోనే  87 పరుగులు చేశాడు. 

56

2008 సీజన్ లో  డెక్కన్ ఛార్జర్స్ నిర్దేశించిన  215 పరుగుల లక్ష్య ఛేదనను రాజస్తాన్.. 19.5 ఓవర్లలో  ఏడు వికెట్లు కోల్పోయి ఛేదించింది.  ఈ మ్యాచ్ లో డెక్కన్ ఛార్జర్స్ ఆటగాడు ఆండ్రూ సైమండ్స్ సెంచరీ చేశాడు.  

66

ఈ లీగ్ లో 200 ప్లస్ టార్గెట్ ను ఛేదించడం ముంబైకి ఇది రెండో సారి.  కొద్దిరోజుల క్రితమే ముంబై.. రాజస్తాన్ పై  213 పరుగుల టార్గెట్ ను ఛేదించగా  నిన్న మళ్లీ పంజాబ్ పై ఇదే ఫీట్ నమోదు చేసింది.  కాగా  ఈ సీజన్ లో 200 ప్లస్ టార్గెట్ ను ఛేదించడం ఇది ఐదో సారి. 

click me!

Recommended Stories