జోఫ్రా ఆర్చర్ వేలానికి వచ్చే సమయానికి మిగిలిన ఫ్రాంఛైజీల దగ్గర పర్సు మొత్తం ఖాళీ అయిపోయింది. దీంతో రూ.8 కోట్లు పెట్టు జోఫ్రా ఆర్చర్‌ని కొనుగోలు చేసింది ముంబై ఇండియన్స్..
28
Image credit: Mumbai Indians/Facebook
గాయం కారణంగా 2022 సీజన్‌కి అందుబాటులో ఉండకపోయినా జోఫ్రా ఆర్చర్, మెగా వేలంలో పేరు రిజిస్టర్ చేసుకోవడం, ముంబై ఇండియన్స్ ఓ సీజన్ ముందుగానే అడ్వాన్స్‌గా కొనుగోలు చేయడం జరిగిపోయాయి.
38
Jofra Archer
అయితే ఏ ముహుర్తాన జోఫ్రా ఆర్చర్, టీమ్‌లోకి వచ్చాడో కానీ ఫైవ్ టైం టైటిల్ విన్నర్ ముంబై ఇండియన్స్, 2022 సీజన్‌లో ఆఖరి స్థానంలో నిలిచింది. ఈ సీజన్‌లో కూడా మొదటి 8 మ్యాచుల్లో నాలుగే విజయాలు అందుకుంది..
48
బుమ్రా లేకపోయినా ఆర్చర్ వస్తాడు, అదరగొడతాడు అనుకుంది ముంబై ఇండియన్స్. అయితే వారి ఆశలు నెరవేరలేదు. గాయం కారణంగా ఐదు మ్యాచులు ఆడని జోఫ్రా ఆర్చర్, 3 మ్యాచులు ఆడి 2 వికెట్లు మాత్రమే తీయగలిగాడు..
58
Image credit: Getty
పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 ఓవర్లలో 56 పరుగులు సమర్పించేశాడు జోఫ్రా ఆర్చర్. ఏ మాత్రం అంతర్జాతీయ అనుభవం లేని అర్షద్ ఖాన్, కుమార కార్తికేయ.. జోఫ్రా ఆర్చర్ కంటే బెటర్ ఎకానమీతో బౌలింగ్ చేశారు..
68
PTI Photo) (PTI04_25_2023_000273B)
ఇంకా చెప్పాలంటే రూ.30 లక్షలకు కొనుగోలు చేసిన అర్జున్ టెండూల్కర్, 4 మ్యాచుల్లో 3 వికెట్లు తీసి ఆర్చర్ కంటే బెటర్ పర్ఫామెన్స్ ఇచ్చాడు. ఆర్చర్ బౌలింగ్ ఎకానమీ 9.17గా ఉంటే అర్జున్ టెండూల్కర్ బౌలింగ్ ఎకానమీ 9.3గా ఉంది..
78
గాయం కారణంగా దాదాపు ఏడాదిన్నర క్రికెట్‌కి దూరంగా ఉన్న జోఫ్రా ఆర్చర్, పూర్తిగా కోలుకుని మునుపటి రేంజ్‌లో బౌలింగ్ వేగాన్ని, ఆ రిథమ్‌ని అందుకోలేకపోతున్నాడు..
88
ఒకవేళ జస్ప్రిత్ బుమ్రా కూడా గాయం నుంచి కోలుకున్న తర్వాత కూడా జోఫ్రా ఆర్చర్‌లానే రిథమ్ కోల్పోతే, ముంబై ఇండియన్స్ కష్టాలు రెట్టింపు అవుతాయి. 2022 మెగా వేలంలో స్టార్ బౌలర్లను కొనకుండా చేసిన తప్పిదానికి భారీ మూల్యం చెల్లించుకున్నట్టు అవుతుంది..