సుయాశ్ ఓ సాధారణ లెగ్ స్పిన్నర్! కానీ వాళ్లే ఆడలేకపోయారు... కేకేఆర్ కెప్టెన్ నితీశ్ రాణా కామెంట్స్...

Published : Apr 07, 2023, 04:43 PM IST

ఐపీఎల్ 2023 సీజన్‌లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకుంది ఆర్‌సీబీ. మరోవైపు కేకేఆర్, పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో చిత్తుగా ఓడింది.  కేకేఆర్‌తో మ్యాచ్‌లో ఆర్‌సీబీ సునాయాసంగా గెలుస్తుందని అనుకున్నారంతా...

PREV
17
సుయాశ్ ఓ సాధారణ లెగ్ స్పిన్నర్! కానీ వాళ్లే ఆడలేకపోయారు... కేకేఆర్ కెప్టెన్ నితీశ్ రాణా కామెంట్స్...
(Source: PTI)

దశాబ్దాలుగా సాగుతున్నట్టుగానే ఆరంభంలో అదరగొట్టిన ఆర్‌సీబీ బౌలర్లు, 89 పరుగులకే 5 వికెట్లు పడగొట్టాడు. డేంజరస్ బ్యాట్స్‌మెన్ ఆండ్రే రస్సెల్ డకౌట్ అయ్యాడు. కేకేఆర్ మహా అయితే 150 పరుగులు చేస్తుందని, ఆర్‌సీబీ వరుసగా రెండో మ్యాచ్‌లో ఘన విజయం అందుకోవడం ఖాయమని ఫ్యాన్స్ ఫుల్లు ఖుషీ అయిపోయారు... 

27
Image credit: PTI

అయితే ఇక్కడే మ్యాచ్ మలుపు తిప్పింది. రస్సెల్‌ని డకౌట్ చేశామని సంతోషించేలోపు శార్దూల్ ఠాకూర్, అతనికంటే డేంజరస్ బ్యాటర్‌లా తయారయ్యాడు. వచ్చిన బంతిని వచ్చినట్టు బౌండరీకి పంపించాడు. దెబ్బకు ఆర్‌సీబీ బౌలర్లు మళ్లీ డెత్ ఓవర్లలో ‘డెత్’ బౌలింగ్ చేశాడు. ఫలితంగా 150 దాటడమే కష్టమనుకున్న కేకేఆర్ స్కోరు 200 దాటేసింది...
 
37

47
Image credit: PTI

ఈ లక్ష్యఛేదనలో స్పిన్ బౌలర్లను ఆడలేక ‘క్లీన్ బౌల్డ్’ అయ్యాడు ఆర్‌సీబీ బ్యాటర్లు. కేకేఆర్ స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి 4 వికెట్లు తీస్తే, సునీల్ నరైన్ 2 వికెట్లు తీశాడు. ఒక్క దేశవాళీ మ్యాచ్ కానీ, ఫస్ట్ క్లాస్ మ్యాచ్ కానీ ఆడిన అనుభవం లేని 19 ఏళ్ల కుర్రాడు సుయాశ్.. 3 వికెట్లు తీసి ఆర్‌సీబీని ఆలౌట్ చేసేశాడు..
 
57
Image credit: PTI

‘సుయాశ్‌ని చాలామంది మిస్టరీ స్పిన్నర్‌ అనుకుంటున్నారు. అతను ఓ సాధారణ లెగ్ స్పిన్నర్ అంతే. అయితే ఆర్‌సీబీ బ్యాటర్లు అతని బౌలింగ్‌ని అర్థం చేసుకోలేకపోయారు. అతని మణికట్టు వేగం, భిన్నమైన బౌలింగ్ యాక్షన్ కారణంగా ఎక్స్ ఫ్యాక్టర్‌గా మారాడు...

67

సుయాశ్ బౌలింగ్‌లో ఆడేటప్పుడు కొద్దిగా తడబడినా వికెట్ పడిపోవడం ఖాయం. అతనికి ఇంకా 19 ఏళ్లు, మున్ముందు తన బౌలింగ్ మరింత పదును అవుతుంది.. సుయాశ్ బాగా బౌలింగ్ చేస్తాడని తెలుసు, అయితే పవర్ ప్లేలో సునీల్ నరైన్‌ని బౌలింగ్ తేవాలని ముందుగానే అనుకున్నా...
 
77

వరుణ్ చక్రవర్తి గత సీజన్‌లో ఫెయిల్ అయ్యాడు. అతని కమ్‌బ్యాక్‌ మాకు చాలా ముఖ్యం. శార్దూల్ ఠాకూర్ బ్యాటింగ్ సామర్థ్యంపై మాకు పూర్తి నమ్మకం ఉంది. అయితే ఈరోజు అతను ఆడిన ఇన్నింగ్స్ మాత్రం అస్సలు ఊహించలేదు. శార్దూల్ ఇలా ఆడితే, ఏ కెప్టెన్‌కైనా ఇంకేం కావాలి...’ అంటూ కామెంట్ చేశాడు కేకేఆర్ కెప్టెన్ నితీశ్ రాణా..
 
click me!

Recommended Stories