అట్లర్ ఫ్లాప్ సీజన్ తర్వాత అదిరిపోయే ప్లాన్... ఆఖరి లీగ్ మ్యాచ్ దాకా ప్లేఆఫ్స్‌పైన సస్పెన్స్...

Published : May 15, 2023, 09:21 AM IST

ఐపీఎల్ 2022 సీజన్‌పై బీసీసీఐ భారీ అంచనాలు పెట్టుకుంది. అయితే ‘RRR’, ‘KGF 2’ సినిమాల ఎఫెక్ట్‌తో పాటు చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకోవడంతో ఐపీఎల్ 2022 సీజన్ అట్టర్ ఫ్లాప్ అయ్యింది...

PREV
18
అట్లర్ ఫ్లాప్ సీజన్ తర్వాత అదిరిపోయే ప్లాన్... ఆఖరి లీగ్ మ్యాచ్ దాకా ప్లేఆఫ్స్‌పైన సస్పెన్స్...

పెద్దగా ఫ్యాన్ ఫాలోయింగ్ లేని రాజస్థాన్ రాయల్స్‌తో పాటు కొత్త టీమ్స్ గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ టీమ్స్ ప్లేఆఫ్స్‌కి వెళ్లాయి. గత సీజన్‌లో ప్లేఆఫ్స్ ఆడిన టీమ్స్‌లో ఆర్‌సీబీ మాత్రమే క్రేజ్ ఉన్న టీమ్...
 

28

అదీకాకుండా ముంబై ఇండియన్స్ వరుసగా 8 మ్యాచుల్లో ఓడిపోవడం, చెన్నై సూపర్ కింగ్స్ కూడా వరుస పరాజయాలతో ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకోవడంతో 2022 సీజన్ చప్పగా సాగింది. ఇది వ్యూయర్‌షిప్, టీఆర్పీలను దెబ్బ తీసింది..

38

అట్టర్ ఫ్లాప్ సీజన్ తర్వాత 2023 సీజన్‌ సస్పెన్స్ థ్రిల్లర్‌కి మొగుడిలా సాగుతోంది. ఇప్పటిదాకా 61 మ్యాచులు జరగగా ఒక్క ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రమే అధికారికంగా ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకుంది...
 

48
Image credit: PTI

9వ స్థానంలో ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్స్ భవిష్యత్తు, గుజరాత్ టైటాన్స్‌తో జరగనున్న భవిష్యత్తుతో తేలిపోనుంది. ఈ మ్యాచ్ ఓడితే ఆరెంజ్ ఆర్మీ కూడా ఢిల్లీతో జాయిన్ అవుతుంది. లేదంటే సన్‌రైజర్స్ ప్లేఆఫ్స్ ఛాన్సులు సజీవంగా ఉంటాయి...

58
Image credit: PTI

16 పాయింట్లతో టాప్‌లో ఉన్న గుజరాత్ టైటాన్స్‌తో పాటు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్న సీఎస్‌కే, ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్ బెర్తులు కూడా ఇంకా అధికారికంగా కన్ఫార్మ్ కాలేదు. మిగిలిన రెండు మ్యాచుల్లో చిత్తుగా ఓడితే టైటాన్స్ కూడా టాప్ 4 నుంచి కిందకి పడిపోవచ్చు... 

68

రాజస్థాన్ రాయల్స్, ఆర్‌సీబీపై గెలిచి... చెన్నై సూపర్ కింగ్స్ చేతుల్లో కేకేఆర్ ఓడి ఉంటే ఈ రెండు జట్లు ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకునేవి. అయితే అన్యూహ్యంగా ఈ రెండు టాప్ టీమ్స్ ఓటములు ఎదుర్కొని, ఐపీఎల్ 2023 సీజన్‌ని మరింత ఆసక్తికరంగా మార్చేశాయి. 

78

ఆర్‌సీబీతో పాటు రాజస్థాన్ రాయల్స్, కోల్‌కత్తా నైట్‌ రైడర్స్, పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు ప్లేఆఫ్స్ రేసులో పోటీపడుతున్నాయి. నేటి మ్యాచ్‌లో గెలిస్తే సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా ఈ రేసులో నిలుస్తుంది... 

88

దీంతో లీగ్ స్టేజీలో ముంబై ఇండియన్స్ - సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు- గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగే ఆఖరి మ్యాచుల్లో ఫలితం తేలేదాకా 2023 ప్లేఆఫ్స్ బెర్త్‌లపై సస్పెన్స్ కొనసాగనుంది..

click me!

Recommended Stories