డుప్లెసిస్ మరో ఘనత.. ఐపీఎల్‌లో నిలకడకు నిలువుటద్దం ఆర్సీబీ కెప్టెన్

Published : May 14, 2023, 06:28 PM IST

IPL 2023: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు  (ఆర్సీబీ)  సారథి   ఫాఫ్ డుప్లెసిస్  ఐపీఎల్‌లో మరో ఘనత అందుకున్నాడు.  

PREV
16
డుప్లెసిస్ మరో ఘనత.. ఐపీఎల్‌లో నిలకడకు నిలువుటద్దం ఆర్సీబీ కెప్టెన్
Image credit: PTI

గడిచిన  దశాబ్దకాలంగా ఐపీఎల్  ఆడుతున్న  దక్షిణాఫ్రికా దిగ్గజం  ఫాఫ్ డుప్లెసిస్ ఈ లీగ్ లో  మరో ఘనత సాధించాడు.   రాజస్తాన్ రాయల్స్ తో జరుగుతున్న  మ్యాచ్ లో..  44 బంతుల్లో  3 బౌండరీలు,  2 సిక్సర్ల సాయంతో  55 పరుగులు చేశాడు.  తద్వారా ఈ లీగ్ లో  నాలుగు వేల పరుగులు పూర్తి చేశాడు. 

26

ఈ సీజన్ ఆరంభం నుంచి నిలకడగా ఆడుతున్న డుప్లెసిస్..  ఇప్పటికే ఏడు అర్థ సెంచరీలు సాధించాడు.  ఐపీఎల్ - 16  లో మరే బ్యాటర్ కూడా ఈ స్థాయి నిలకడగా ఆడటం లేదు.   సీజన్ ఆరంభంలో జరిగిన  ఫస్ట్  మ్యాచ్ ముంబై  నుంచి  నేటి రాజస్తాన్ వరకూ  టీమ్ లో చాలా మంది ఆటగాళ్లు విఫలమైనా  డుప్లెసిస్  మాత్రం నిలకడగా ఆడుతున్నాడు. 

36
Image credit: PTI

ఐపీఎల్ - 16 లో డుప్లెసిస్   ప్రదర్శనలు చూస్తే.. 73, 23, 79 నాటౌట్, 22,  62, 84, 62, 17, 44, 45, 65, 55 తో మొత్తంగా ఇప్పటివరకూ  12 మ్యాచ్ లలో  631 పరుగులు చేశాడు. ఈ క్రమంలో అతడి సగటు  57.38 గా ఉండగా స్ట్రైక్ రేట్ కూడా  154.28 గా నమోదైంది.  ఈ సీజన్ లో  600 రన్స్ చేసిన  ఫస్ట్ బ్యాటర్ కూడా   డుప్లెసిసే కావడం గమనార్హం. 

46
Image credit: PTI

కాగా నేటి మ్యాచ్ లో అర్థ సెంచరీ చేయడం ద్వారా డుప్లెసిస్.. ఐపీఎల్ లో  4 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు.  ఐపీఎల్ లో  4 వేల పరుగులు పూర్తి చేసుకున్న  15వ  బ్యాటర్  డుప్లెసిస్.   

56
Image credit: PTI

విదేశీ బ్యాటర్లలో 4 వేల పరుగులు పూర్తి చేసిన నాలుగో బ్యాటర్  డుప్లెసిస్.   అతడి కంటే ముందు  డేవిడ్ వార్నర్  (6,600), ఏబీ డివిలియర్స్ (5,162), క్రిస్ గేల్ (4,965)  తర్వాత డుప్లెసిస్  (4,034)  నాలుగో స్థానంలో నిలిచాడు. 

66

2012లో ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చిన   డుప్లెసిస్..  2019 నుంచి  ప్రతీ సీజన్ లో  350 ప్లస్ రన్స్ స్కోరు చేశాడు.  2019 లో 396  పరుగులు చేసిన డుప్లెసిస్..  ఆ తర్వాత వరుసగా  449, 633, 468 చేశాడు. ఈ సీజన్ లో ఇప్పటికే  631 రన్స్ పూర్తి చేసుకున్నాడు. 

click me!

Recommended Stories