ఐపీఎల్ 2023 సీజన్‌లో టైటిల్ ఫెవరెట్ టీమ్స్‌లో ఒకటిగా కనిపించింది రాజస్థాన్ రాయల్స్. అంచనాలకు తగ్గట్టే మొదటి 5 మ్యాచుల్లో నాలుగు విజయాలు అందుకుని టేబుల్ టాపర్‌గా కనిపించింది. అయితే ఆ తర్వాతే రాయల్స్ కథ మారింది..
ఆ తర్వాత 8 మ్యాచుల్లో రెండే విజయాలు అందుకున్న రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో 59 పరుగులకు ఆలౌట్ అయ్యి, 112 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది..
28
Jos Buttler
ఐపీఎల్ చరిత్రలో ఇది మూడో అత్యల్ప స్కోరు. రాజస్థాన్ రాయల్స్‌కి రెండో లోయెస్ట్ స్కోరు. ఇంతకుముందు ఆర్‌సీబీపైనే 2009 సీజన్‌లో 58 పరుగులకి ఆలౌట్ అయ్యింది రాజస్థాన్ రాయల్స్...
38
Image credit: PTI
2008లో మొట్టమొదటిసారి ఫైనల్ చేరిన రాజస్థాన్ రాయల్స్, 2009లో ఆర్‌సీబీ చేతుల్లో 58 పరుగులకి ఆలౌట్ అయితే, 2022లో రెండోసారి ఫైనల్ చేరిన రాజస్థాన్ రాయల్స్, ఆ తర్వాతి ఏడాది ఆర్‌సీబీ చేతుల్లోనే 59 పరుగులకి ఆలౌట్ అయ్యింది..
48
Jos Buttler
2022 సీజన్‌లో నాలుగు సెంచరీలు చేసి 800+ పరుగులతో ఆరెంజ్ క్యాప్ గెలిచిన జోస్ బట్లర్, ఈ సీజన్‌లో నాలుగు సార్లు డకౌట్ అయ్యాడు..
58
2009లో కేవిన్ పీటర్సన్ మొదటిసారి ఐపీఎల్‌లో బ్యాటింగ్‌కి వచ్చిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 58 పరుగులకి ఆలౌట్ అయ్యింది. 14 సీజన్ల తర్వాత ఇంగ్లాండ్ మాజీ టెస్టు కెప్టెన్ జో రూట్ మొదటిసారి బ్యాటింగ్‌కి వచ్చిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 59 పరుగులకు చాపచుట్టేసింది..
68
100కి పైగా పరుగుల మార్జిన్‌తో విజయాన్ని అందుకోవడం ఆర్‌సీబీకి ఇది నాలుగోసారి. ముంబై ఇండియన్స్ రెండుసార్లు ఈ ఫీట్ సాధించి రెండో స్థానంలో ఉంది...
78
Image credit: PTI
ప్రత్యర్థి జట్టుని 100 పరుగుల లోపు ఆలౌట్ చేయడం ఆర్‌సీబీకి ఇది ఏడో సారి. ముంబై ఇండియన్స్ కూడా ఏడు సార్లు ఈ ఫీట్ సాధించి టాప్‌లో ఉంది. కేకేఆర్ 6 సార్లు, సీఎస్‌కే 5 సార్లు, సన్‌రైజర్స్ 4 సార్లు ఈ ఫీట్ సాధించాయి..
88
KM Asif vs RCB
ఈ మ్యాచ్‌కి ముందు -0.345గా ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, నెట్ రన్ రేట్ ఈ మ్యాచ్ తర్వాత +0.166కి మారింది. ఈ మ్యాచ్‌కి ముందు 0.633 రన్‌రేట్‌తో ఐదో స్థానంలో ఉన్న రాజస్థాన్ రాయల్స్, 0.14 రన్‌రేట్‌తో ఆరో స్థానానికి పడిపోయింది.