ఇన్నింగ్స్ 13వ ఓవర్‌లో వరుస బంతుల్లో అయిడిన్ మార్క్‌రమ్, గ్లెన్ ఫిలిప్స్‌లను అవుట్ చేశాడు కృనాల్ పాండ్యా. అయితే హెన్రీచ్ క్లాసిన్, అబ్దుల్ సమద్ కలిసి ఆరో వికెట్‌కి 58 పరుగుల భాగస్వామ్యం జోడించారు. ఈ ఇద్దరూ బౌండరీలు బాదుతూ దూకుడుగా ఆడుతుండడంతో హైదరాబాద్ స్కోరు 200 దాటేలా కనిపించింది..