Rashid Khan: రషీద్ ఖాన్ ఊచకోతకు రికార్డుల గులాం..

Published : May 13, 2023, 05:45 PM IST

IPL 2023: ఐపీఎల్ -16 లో భాగంగా నిన్న వాంఖెడే వేదికగా ముంబై ఇండియన్స్  - గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన   మ్యాచ్ లో  గుజరాత్ కు అవమానకర ఓటమిని తప్పించి దాదాపు గెలిపించినంత  పనిచేశాడు రషీద్ ఖాన్. రషీద్ మెరుపులతో గుజరాత్ ఓటమి అంతరం భారీగా తగ్గింది. 

PREV
16
Rashid Khan: రషీద్ ఖాన్ ఊచకోతకు రికార్డుల గులాం..

సాహా,  శుభ్‌మన్ గిల్,  హార్ధిక్ పాండ్యా, డేవిడ్ మిల్లర్, విజయ్ శంకర్, అభినవ్ మనోహర్ వంటి  ఆటగాళ్లు విఫలమైనా  8వ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన   రషీద్..  32 బంతుల్లో   79 పరుగులు చేశాడు.  ఇందులో 3 బౌండరీలు, 10 భారీ సిక్సర్లున్నాయి.  ఈ క్రమంలో రషీద్  పలు రికార్డులను బ్రేక్ చేశాడు. 

26

8వ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన రషీద్ ఖాన్  79 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.   ఈ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చి అత్యధిక పరుగులు చేసిన వారిలో  ఇదివరకు  రికార్డు  కేకేఆర్ బ్యాటర్  పాట్ కమిన్స్ పేరిట ఉండేది.  కమిన్స్ ఐపీఎల్ 2021లో  సీఎస్కేపై  66 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.  రషీద్ ఇప్పుడు ఆ రికార్డును బద్దలుకొట్టాడు. 

36

ఒక మ్యాచ్ లో   బౌలింగ్ లో నాలుగు వికెట్లు తీసి  హాఫ్ సెంచరీకి పైగా పరుగులు చేసిన వారి జాబితాలో  రషీద్ ఖాన్ మూడో ఆటగాడు.  ఇంతకుముందు  యువరాజ్ సింగ్...  ఆర్సీబీ, పూణె వారియర్స్ తరఫున ఆడిన క్రమంలో  బౌలింగ్ లో నాలుగు వికెట్లు తీయడమే గాక  బ్యాటింగ్ లో అర్థ  సెంచరీకి పైగా చేశాడు. 

46

ఈ జాబితాలో యువీ తర్వాత ఇదే సీజన్ లో  ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు మిచెల్ మార్ష్  కూడా  సన్ రైజర్స్ హైదరాబాద్ తో మ్యాచ్ లో    నాలుగు వికెట్లు పడగొట్టి బ్యాటింగ్ లో కూడా  హాఫ్ సెంచరీకి పైగా పరుగులు చేశాడు.   యువీ, మార్ష్  తర్వాత ఇప్పుడు  రషీద్  కూడా ఆ జాబితాలో చేరాడు.

56

ఈ మ్యాచ్ లో రషీద్ ఖాన్ 10 సిక్సర్లు బాదాడు.  తద్వారా  గుజరాత్ తరఫున  ఒక ఇన్నింగ్స్ లో అత్యధిక సిక్సర్లు బాదిన  ఆటగాడిగా నిలిచాడు. లక్ష్య ఛేదనలో అత్యధిక సిక్సర్లు కొట్టిన  ఆటగాళ్లలో రషీద్ రెండోవాడు. ఇంతకుముందు సనత్ జయసూర్య (ముంబై)  2008 సీజన్ లో  చెన్నైపై ఆడుతూ  టార్గెట్ ను ఛేజ్ చేసే క్రమంలో 11 సిక్సర్లు బాదాడు. 

66

తొమ్మిదో వికెట్ కు  అల్జారీ  జోసెఫ్ తో కలిసి  రషీద్  88 పరుగులు జోడించాడు.  ఐపీఎల్ లో 9వ వికెట్ కు ఇదే అత్యధిక భాగస్వామ్యం . మెన్స్ టీ20 క్రికెట్ చరిత్రలో  ఇది సెకండ్  హయ్యస్ట్ పార్ట్‌నర్‌షిప్. బెల్జియం ఆటగాళ్లు సబేర్ జకీల్ - సక్లయిన్  అలిలు  2021లో ఆస్ట్రియాపై  132  పరుగులు  జోడించి ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు.

click me!

Recommended Stories