ఆ ఒక్క ఓవర్‌ అర్జున్ టెండూల్కర్‌కి ఇవ్వకుంటే బాగుండేది... ముంబై ఇండియన్స్ కోచ్ షాకింగ్ కామెంట్స్!

Published : Apr 23, 2023, 04:56 PM IST

ఐపీఎల్ 2023 సీజన్‌లో వరుసగా మూడు మ్యాచుల్లో గెలిచిన తర్వాత పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 13 పరుగుల తేడాతో ఓడింది ముంబై ఇండియన్స్. రోహిత్ టాస్ గెలవగానే ముంబై విజయం ఖాయమనుకున్నారంతా... 15 ఓవర్ల వరకూ ముంబై మ్యాచ్‌లానే కనిపించింది. అయితే ఆ తర్వాతే సీన్ మారిపోయింది..

PREV
110
ఆ ఒక్క ఓవర్‌ అర్జున్ టెండూల్కర్‌కి ఇవ్వకుంటే బాగుండేది... ముంబై ఇండియన్స్ కోచ్ షాకింగ్ కామెంట్స్!
PTI Photo/Kunal Patil)(PTI04_22_2023_000465B)

గత రెండు మ్యాచుల్లో ముంబై ఇండియన్స్ తరుపున ఓపెనింగ్ వేసిన అర్జున్ టెండూల్కర్, పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ తొలి ఓవర్ వేశాడు. 9.4 ఓవర్లలో 83 పరుగులు చేసి 4 వికెట్లు కోల్పోయిన పంజాబ్ కింగ్స్, 15 ఓవర్లు ముగిసే సమయానికి 118 పరుగులే చేయగలిగింది...
 

210
Arjun Tendulkar

మిగిలిన ఆఖరి 5 ఓవర్లలో మహా అయితే 50-60 పరుగులు చేసినా 170 పరుగుల టార్గెట్ ఉండేది. కానీ 16వ ఓవర్ వేసిన అర్జున్ టెండూల్కర్ ఏకంగా 31 పరుగులు సమర్పించాడు. తన తొలి 2 ఓవర్లలో 17 పరుగులే ఇచ్చి ఓ వికెట్ కూడా తీసిన అర్జున్, 16వ ఓవర్‌లో పూర్తిగా లైన్ మిస్ అయ్యాడు...

310

అర్జున్ టెండూల్కర్ బౌలింగ్‌లో మొదటి బాల్‌కే సిక్సర్ బాదిన సామ్ కుర్రాన్, ఆ తర్వాత ఫోర్ బాది, సింగిల్ తీసి స్ట్రైయిక్ రొటేట్ చేశాడు. హర్‌ప్రీత్ భాటియా వరుసగా 4, 6, 4, 4 బాది ఏకంగా 18 పరుగులు రాబట్టాడు. ఓ నో బాల్, ఓ వైడ్‌తో కలిపి ఏకంగా 31 పరుగులు, పంజాబ్ కింగ్స్ ఖాతాలో చేరిపోయాయి..
 

410
Arjun Tendulkar-Sachin Tendulkar

ఈ ఓవర్, రిథమ్‌ని పంజాబ్ కింగ్స్‌ వైపు మళ్లించింది. అదే ఊపుని ఆఖరి ఓవర్ దాకా కొనసాగించిన పంజాబ్ కింగ్స్, చివరి 5 ఓవర్లలో ఏకంగా 96 పరుగులు రాబట్టింది. లక్ష్యఛేదనలో కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, రోహిత్ శర్మ పోరాడినా 13 పరుగుల దూరంలో నిలిచిపోయింది ముంబై ఇండియన్స్...

510
Image credit: PTI

ముంబై ఇండియన్స్ తరుపున ఒకే ఓవర్‌లో అత్యధిక పరుగులు సమర్పించిన బౌలర్‌గా అర్జున్ టెండూల్కర్ రెండో స్థానంలో నిలిచాడు. ఇంతకుముందు 2022లో డానియల్ సామ్స్, కేకేఆర్‌పై 35 పరుగులు సమర్పించగా అర్జున్ టెండూల్కర్ 31 పరుగులు ఇచ్చాడు. ఈ ఇద్దరికీ ముందు ముంబై బౌలర్లు ఎవ్వరూ కూడా ఒకే ఓవర్‌లో 30కి పైగా పరుగులు ఇచ్చింది లేదు...
 

610
Image credit: PTI

‘వాళ్లు భారీ స్కోరు చేసినా మేం ఆఖరి దాకా గెలుస్తామనే అనుకున్నాం. సూర్య వికెట్ పడకపోతే మ్యాచ్ రిజల్ట్ మారిపోయి ఉండేది. రెండు సెంటిమీటర్లు పైకి వెళ్లి ఉంటే అది బౌండరీ వెళ్లి ఉండేది. మేం బాగా ఆడాం కానీ పంజాబ్ కింగ్స్ ఎక్కువ పరుగులు చేసింది..

710

15 ఓవర్లు ముగిసిన తర్వాత మ్యాచ్‌ మా కంట్రోల్‌లో నుంచి వెళ్లిపోయింది. రోహిత్‌కి ఎంతో అనుభవం ఉంది. అర్జున్ టెండూల్కర్‌తో 14 లేదా 15వ ఓవర్ వేయించాలని అనుకున్నాడు. అయితే డెత్ ఓవర్లలో వేయిస్తే బ్యాటర్లు ఒత్తిడికి లోనవుతాడని అనుకున్నాడు. 

810

అయితే అనుకున్న ప్లాన్స్ అన్ని వేళలా వర్కవుట్ కాకపోవచ్చు. మొదటి రెండు బంతుల్లో బౌండరీలు వెళ్లడంతో అర్జున్ తీవ్ర ఒత్తిడికి గురయ్యాడు. అయితే అతనికి ఇది మూడో మ్యాచ్ మాత్రమే. మున్ముందు నేర్చుకుంటాడు.. 
 

910

అతనికి మా సపోర్ట్ పూర్తిగా ఉంటుంది. సూర్య ఫామ్‌లో రావడం సంతోషంగా ఉంది. అతను నెట్స్‌లో బాగా బ్యాటింగ్ చేస్తున్నాడు. అందుకే అతను త్వరగా అవుటైనా మేం పెద్దగా కంగారు పడలేదు. అతను ఏం చేయగలడో మాకు తెలుసు...’ అంటూ కామెంట్ చేశాడు ముంబై ఇండియన్స్ కోచ్ మార్క్ బ్రౌచర్...

1010

3 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసిన అర్జున్ టెండూల్కర్ 48 పరుగులు సమర్పించగా జాసన్ బెహ్రాడ్రాఫ్ 3 ఓవర్లలో 41 పరుగులు, కామెరూన్ గ్రీన్ 4 ఓవర్లలో 41 పరుగులు, జోఫ్రా ఆర్చర్ 4 ఓవర్లలో 42 పరుగులు సమర్పించారు. పియూష్ చావ్లా 3 ఓవర్లలో 15 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీసి ముంబై తరుపున బెస్ట్ బౌలర్‌గా నిలిచాడు. 

click me!

Recommended Stories