ధోనీ చేయలేకపోయాడు, అబ్దుల్ సమద్ చేసి చూపించాడు... సందీప్ శర్మ నో బాల్‌పై ఫిక్సింగ్ ఆరోపణలు..

First Published May 8, 2023, 10:10 AM IST

ఐపీఎల్‌ 2023 సీజన్‌లో నాటకీయ పరిణామాలు, హై ఎండ్ డ్రామా ఫినిషింగ్ మ్యాచులు పుషల్కంగా ఉంటున్నాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌ కూడా పూర్తిగా 40 ఓవర్ల పాటు సాగి, ఆఖరి బంతికి ఆరెంజ్ ఆర్మీ విజయాన్ని అందుకుంది...

Rinku Singh

ఐపీఎల్‌లో ఆఖరి ఓవర్‌లో 29 పరుగులు కొట్టడం అంటే అసాధ్యం అనుకున్నారంతా. అయితే గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో రింకూ సింగ్, వరుసగా ఐదు సిక్సర్లు బాది, అద్వితీయ ముగింపుని అందించాడు...

31 పరుగులు వచ్చిన 2023 సీజన్‌లో, ఆఖరి ఓవర్‌లో 5 పరుగులు చేసేందుకు లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ వంటి టీమ్స్ అష్టకష్టాలు పడ్డాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ అయితే స్పిన్ బౌలర్ బౌలింగ్‌లో ఆఖర్ ఓవర్‌లో 9 పరుగులు కొట్టలేక 5 పరుగుల తేడాతో ఓడింది..
 

Latest Videos


రాజస్థాన్ రాయల్స్‌, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్‌లో చివరి ఓవర్‌లో 21 పరుగులు చేయలేక 3 పరుగుల తేడాతో ఓడింది సీఎస్‌కే. క్రీజులో రవీంద్ర జడేజా, మహేంద్ర సింగ్ ధోనీ వంటి ఫినిషర్లు ఉన్నా, చివరి 3 బంతుల్లో 7 పరుగులు చేయలేకపోయారు..

ఆఖరి బంతికి సీఎస్‌కే విజయానికి 5 పరుగులు కావాల్సి రాగా సందీప్ శర్మ వేసిన  యార్కర్‌కి ధోనీ సింగిల్ మాత్రమే రాబట్టగలిగాడు. అయితే సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో ఇదే సందీప్ శర్మ, చివరి ఓవర్‌లో 17 పరుగులు సమర్పించి, విమర్శలు ఎదుర్కోవడం విశేషం.. 

Sandeep Sharma No Ball

సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయానికి చివరి ఓవర్‌లో 17 పరుగులు కావాల్సి వచ్చాయి. మొదటి బతికి 2 పరుగులు రాగా, ఆ తర్వాతి బంతికి సిక్సర్ బాదిన అబ్దుల్ సమద్, ఆ తర్వాత వరుసగా 2, 1,1 పరుగులు రాబట్టారు. చివరి బంతికి 6 పరుగులు కావాలి...

Sanju Samson

అయితే ఈ సమయంలో సందీప్ శర్మ, గీత దాటి భారీ నో బాల్ వేశాడు. ఫ్రీ హిట్ బంతిని బౌండరీ అవతల పడేసిన అబ్దుల్ సమద్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి అత్యవసర విజయాన్ని అందించాడు. కీలక సమయంలో నో బాల్ వేసిన సందీప్ శర్మపై ఫిక్సింగ్ ఆరోపణలు చేస్తున్నారు ఫ్యాన్స్..

సీఎస్‌కేతో మ్యాచ్‌లో ధోనీ వరుసగా రెండు సిక్సర్లు కొట్టిన తర్వాత కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి, చివరి 3 బంతుల్లో 3 పరుగులే ఇచ్చిన సందీప్ శర్మ, సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో ఆఖరి బంతికి నో బాల్ వేయడం, అదీ గీత మొత్తం దాటడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు..
 

ప్లేఆఫ్స్ బెర్తుల విషయంలో ఇప్పుడే ఓ క్లారిటీ వస్తే, మిగిలిన మ్యాచులపై ఉత్కంఠ తగ్గిపోతుంది. అందుకే ఆఖరి లీగ్ మ్యాచ్ వరకూ ఐపీఎల్ ఉత్కంఠభరితంగా సాగేలా స్క్రిప్టు రూపొందించిన బీసీసీఐ, దాని ప్రకారం మ్యాచ్‌లను నిర్వహిస్తోందని అంటున్నవాళ్లు చాలామందే ఉన్నారు..  

అబ్దుల్ సమద్‌ని ఈజీగా రనౌట్ చేసే ఛాన్స్ దొరికినా సంజూ శాంసన్ దాన్ని జారవిరచడం కూడా స్క్రిప్టు ప్రకారమే మ్యాచులు సాగుతున్నాయనే ప్రచారానికి ఊతం అందిస్తున్నాయి. 

click me!