అతనిలో విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్‌ స్థాయికి వెళ్లే సత్తా ఉంది... రాబిన్ ఊతప్ప కామెంట్స్...

Published : May 19, 2023, 12:02 PM IST

2023 ఏడాది శుబ్‌మన్ గిల్‌కి బాగా కలిసి వస్తోంది. ఈ ఏడాది వన్డేల్లో డబుల్ సెంచరీ అందుకున్న శుబ్‌మన్ గిల్, టీ20ల్లో సెంచరీ బాదాడు. టెస్టుల్లోనూ సెంచరీ చేసి మూడు ఫార్మాట్లలో ప్లేస్ ఫిక్స్ చేసుకున్నాడు...

PREV
18
అతనిలో విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్‌ స్థాయికి వెళ్లే సత్తా ఉంది... రాబిన్ ఊతప్ప కామెంట్స్...

ఐపీఎల్ 2023 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై సెంచరీ బాదిన శుబ్‌మన్ గిల్, టెస్టు, వన్డే,టీ20లతో పాటు ఐపీఎల్‌లో సెంచరీ చేసిన అతికొద్ది మంది ప్లేయర్ల జాబితాలో చోటు దక్కించుకున్నాడు...
 

28

‘శుబ్‌మన్ గిల్‌ని చూస్తుంటే మరో విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్ స్థాయికి వెళ్లే సత్తా ఉన్నోడిలా కనిపిస్తున్నాడు. అతనిలో అంత మ్యాటర్ ఉంది. ఫామ్‌తో సంబంధం లేకుండా మూడు ఫార్మాట్లలో అదరగొడుతున్నాడు...

38
Image credit: PTI

శుబ్‌మన్ గిల్‌తో పాటు యశస్వి జైస్వాల్ కూడా సంచలన ప్రదర్శన ఇస్తున్నారు. నాకు ఈ ఇద్దరూ భారత క్రికెట్‌లో ఫ్యూచర్ స్టార్స్ అనిపిస్తోంది...

48

అతని ఆటలో ఎలాంటి మార్పు రాలేదు. రోహిత్‌కి ఎప్పుడు ఎలా ఆడాలో బాగా తెలుసు. ఐపీఎల్‌లో బాగా ఆడకపోయినా, అంతర్జాతీయ క్రికెట్‌లో ఆ ప్రభావం పడకుండా చూసుకోగలడు...

58

రోహిత్ శర్మ, టీమిండియా కెప్టెన్ అయ్యాక స్లో అయ్యాడని చాలా మంది అంటున్నారు. అయితే అతను ఎప్పుడూ ఒకేలా ఆడుతున్నాడని నాకు అనిపిస్తోంది. అతను ఎప్పుడూ కొత్తగా ట్రై చేసి సక్సెస్ అవ్వాలని అనుకుంటాడు..

 

68

రోహిత్ శర్మకు బ్రేక్ అవసరం అని నేనైతే అనుకోవడం లేదు. అతని మైండ్‌సెట్ అటు నుంచి ఇటు మారడానికి ఒక్క మ్యాచ్ చాలు. ఐసీసీ వన్డే వరల్డ్ కప్‌ ముందుంది కాబట్టి ఇప్పటికిప్పుడు భారత జట్టులో సమూల మార్పులు చేయాల్సిన అవసరం లేదు...

 

78

కొత్త కుర్రాళ్లకు చోటు ఇవ్వాలి అయితే సీనియర్లను కూడా కొనసాగించాలి. ఎవరిని ఏ ప్లేస్‌లో ఆడిస్తే బాగుంటుందే రోహిత్ శర్మకు బాగా తెలుసు. కొన్ని మార్పులు కావాలి, కానీ మొత్తంగా మార్చేస్తే మొదటికే మోసం రావచ్చు..

88
rohit sharma

ఇప్పటికే జస్ప్రిత్ బుమ్రా, కెఎల్ రాహుల్, రిషబ్ పంత్ ఇంకా కొందరు టీమ్‌కి దూరమయ్యారు. కాబట్టి కొత్త ప్లేయర్లను టీమ్‌లోకి తీసుకురావడానికి స్పేస్ ఉంది. దాన్ని వాడుకుంటే చాలు, వరల్డ్ కప్ గెలవడం కష్టమేమీ కాదు...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప.. 

Read more Photos on
click me!

Recommended Stories