టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఉంది! అందుకే ఫ్యాన్సీ షాట్లు ఆడడం నచ్చదు... - విరాట్ కోహ్లీ...

Published : May 19, 2023, 11:02 AM IST

మూడేళ్ల పాటు సెంచరీ చేయలేక తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న విరాట్ కోహ్లీ... 2022 ఆగస్టు నుంచి మళ్లీ పూర్తి స్వింగ్‌లో కనిపిస్తున్నాడు. 10 నెలల కాలంలో విరాట్ కోహ్లీ బ్యాటు నుంచి 6 సెంచరీలు రావడం విశేషం... 

PREV
18
టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఉంది! అందుకే ఫ్యాన్సీ షాట్లు ఆడడం నచ్చదు... - విరాట్ కోహ్లీ...
Image credit: PTI

ఆసియా కప్ 2022 టోర్నీలో 1021 రోజుల తర్వాత అంతర్జాతీయ సెంచరీ బాదిన విరాట్ కోహ్లీ, 1214 రోజుల తర్వాత వన్డేల్లో సెంచరీ నమోదు చేశాడు. 1205 రోజుల తర్వాత టెస్టుల్లో సెంచరీ అందుకున్నాడు. తాజాగా 1490 రోజుల తర్వాత ఐపీఎల్ సెంచరీ నమోదు చేశాడు విరాట్ కోహ్లీ...
 

28

ఆసియా కప్ 2022 టోర్నీలో ఆఫ్గాన్‌పై వచ్చిన టీ20 సెంచరీతో పాటు వన్డేల్లో వచ్చిన రీఎంట్రీ సెంచరీ, ఐపీఎల్‌లో వచ్చిన తాజా సెంచరీ కూడా సిక్సర్లతోనే సాధించాడు విరాట్ కోహ్లీ... 

38

‘ఐపీఎల్ సెంచరీ ఎప్పుడూ నాకు ప్రత్యేకమే. సన్‌రైజర్స్ మంచి స్కోరు చేసింది. బాల్ గ్రిప్ అవుతోంది కూడా. మంచి ఆరంభం దొరికితే ఈ లక్ష్యాన్ని ఛేదించగలం అనుకున్నాం. అయితే 172 పరుగుల భారీ భాగస్వామ్యం వస్తుందని మాత్రం అనుకోలేదు...
 

48
Image credit: PTI

ఫాఫ్ వేరే లెవెల్‌లో ఆడుతున్నాడు. మొదటి బంతి నుంచి బౌలర్లపై ఒత్తిడి పెంచాలని అనుకున్నా. కానీ సీజన్ మధ్యలో కాస్త పట్టు కోల్పోయా. ఈ మ్యాచ్‌కి సన్‌రైజర్స్‌పై రెండు సార్లు డకౌట్ అయ్యా. వాటిని పట్టించుకోకుండా ఆడాలని ఫిక్స్ అయి వచ్చా...

58
Image credit: PTI

బయటి వ్యక్తులు ఏమనుకుంటున్నారో నేను పట్టించుకోను, అది వాళ్ల అభిప్రాయం. నాకు ఫ్యాన్సీ షాట్లు ఆడడం నచ్చదు. నేను ఎప్పుడూ అలా ఆడింది కూడా లేదు. ఏడాదికి 12 నెలల పాటు మ్యాచులు ఆడాలి..
 

68
Image credit: PTI

ఫ్యాన్సీ షాట్లు ఆడి వికెట్ పారేసుకోవడం కంటే, మ్యాచులు గెలిపించడం ముఖ్యం. అదీకాకుండా ఐపీఎల్ తర్వాత వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఆడబోతున్నాం. అప్పటిదాకా నా రిథమ్ కాపాడుకుంటూ టెక్నిక్‌ని మెరుగుదిద్దుకోవడం ముఖ్యం... 
 

78
Image credit: PTI

తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఇంపాక్ట్ చూపిస్తే, నా ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది. నేను, ఫాఫ్ డుప్లిసిస్ కలిసి ఈ సీజన్‌లో దాదాపు 900 పరుగులు జోడించాం. ఇంతకుముందు ఏబీ డివిల్లియర్స్‌తో ఇలాగే చేశాను.. 

88

అంతర్జాతీయ స్థాయిలో కెప్టెన్సీ చేసిన ఫాఫ్ లాంటి కెప్టెన్ దొరకడం, ఆర్‌సీబీ అదృష్టం. హైదరాబాద్‌లో ఉన్నా, హోం గ్రౌండ్‌లో ఆడుతున్నట్టే ఉంది. ఇంత అభిమానం అస్సలు ఊహించలేదు...’ అంటూ కామెంట్ చేశాడు విరాట్ కోహ్లీ.. 

Read more Photos on
click me!

Recommended Stories