ఉమ్రాన్ మాలిక్‌ని ఎందుకు ఆడించడం లేదో నాక్కూడా తెలీదు... - సన్‌రైజర్స్ కెప్టెన్ అయిడిన్ మార్క్‌రమ్...

Published : May 19, 2023, 11:23 AM IST

ఐపీఎల్‌లో మోస్ట్ వరల్డ్ టీమ్ మేనేజ్‌మెంట్ అంటే ముందుగా గుర్తుకు వచ్చేది సన్‌రైజర్స్ హైదరాబాదే. డేవిడ్ వార్నర్‌ని అన్ని విధాలుగా అవమానించిన ఆరెంజ్ ఆర్మీ, కేన్ విలియంసన్, రషీద్ ఖాన్ వంటి మ్యాచ్ విన్నర్లను కూడా సాగనంపింది...

PREV
18
ఉమ్రాన్ మాలిక్‌ని ఎందుకు ఆడించడం లేదో నాక్కూడా తెలీదు... - సన్‌రైజర్స్ కెప్టెన్ అయిడిన్ మార్క్‌రమ్...
umran malik

ఐపీఎల్ 2021 సీజన్‌లో మనీశ్ పాండేని తుది జట్టు నుంచి తప్పించడంపై అప్పటి సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ కారణంగానే అతన్ని కెప్టెన్సీ నుంచి తప్పించి, టీమ్‌కే దూరం చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ మేనేజ్‌మెంట్..

28

తాజాగా సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రస్తుత కెప్టెన్ అయిడిన్ మార్క్‌రమ్‌ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశాడు. ఉమ్రాన్ మాలిక్‌ని ఎందుకు ఆడించడం లేదో తనకు కూడా అర్థం కావడం లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు..
 

38
PTI Photo)(PTI04_23_2023_000291B)

‘నిజం చెప్పాలంటే నాక్కూడా ఉమ్రాన్ మాలిక్‌ ఎందుకు ఆడం లేదో తెలీదు. అతను 150 కి.మీ.ల వేగంతో బౌలింగ్ చేస్తాడు, అతను టీమ్‌కి ఎక్స్ ఫ్యాక్టర్ అవుతాడు. అయితే అతన్ని ఎందుకని పక్కకి తప్పించారో, దాని వెనక కారణమేంటో నాక్కూడా తెలీదు...’ అంటూ వ్యాఖ్యానించాడు అయిడిన్ మార్క్‌రమ్...

48
Image credit: PTI

ఐపీఎల్ 2022 సీజన్‌లో 14 మ్యాచులు ఆడిన ఉమ్రాన్ మాలిక్, 22 వికెట్లు తీసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ తరుపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. అయితే ఈ సీజన్‌లో అతను కేవలం 7 మ్యాచులు మాత్రమే ఆడాడు. వీటిల్లో 5 వికెట్లు తీశాడు...
 

58

‘లాస్ట్ సీజన్‌లో ఉమ్రాన్ మాలిక్ చాలా అద్భుతంగా ఆడాడు. అతని బౌలింగ్‌కి సన్‌రైజర్స్ హైదరాబాద్ మేనేజ్‌మెంట్ క్రెడిట్ తీసుకుంది. ఇప్పుడు అతనికి మీ సపోర్ట్ కావాలి. కానీ మీరు అతన్ని సరిగ్గా వాడుకోవడం లేదు...

68

అతను యంగ్ బౌలర్, టీమిండియా ఫ్యూచర్. ఇండియా తరుపున కూడా బాగా ఆడాడు. కానీ 2023 సీజన్‌లో అతనికి సరైన అవకాశాలు రాలేదు. ఇది అతని అంతర్జాతీయ కెరీర్‌ని ప్రభావితం చేయొచ్చు...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ యూసఫ్ పఠాన్...
 

78

‘ఉమ్రాన్ మాలిక్ లాంటి బౌలర్‌ని టీమ్‌లో పెట్టుకుని, అతన్ని ఎలా వాడాలో ఈ ఫ్రాంఛైజీకి తెలియడం లేదు. అతని విషయంలో సన్‌రైజర్స్ వ్యవహరిస్తున్న విధానం సరైనది కాదు. 
 

88

యంగ్ సీమర్లకు కావాల్సిన సహకారం అందిస్తూ ప్రోత్సహించాల్సిన బాధ్యత టీమ్ మేనేజ్‌మెంట్‌కి ఉంటుంది... అయితే ఇది సన్‌రైజర్స్‌లో కనిపించడం లేదు. అందుకే ఉమ్రాన్ మాలిక్ ఈ సీజన్‌లో ఎక్కువగా కనిపించడం లేదు..’ అంటూ అసంతృప్తి వ్యక్తం చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్.. 

click me!

Recommended Stories