సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న శుబ్‌మన్ గిల్... స్పైడర్ మ్యాన్ మూవీకే డబ్బింగ్ చెబుతూ...

Published : May 08, 2023, 02:11 PM IST

2023 ఏడాది శుబ్‌మన్ గిల్‌కి బాగా కలిసి వస్తున్నట్టు ఉంది. ఇప్పటికే మూడు ఫార్మాట్లలో సెంచరీలు సాధించిన శుబ్‌మన్ గిల్, వన్డేల్లో డబుల్ సెంచరీ బాది అత్యంత అరుదైన క్రికెటర్ల జాబితాలో చేరాడు... త్వరలో సినీ రంగ ప్రవేశం చేయబోతున్నాడు.

PREV
15
సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న శుబ్‌మన్ గిల్...  స్పైడర్ మ్యాన్ మూవీకే డబ్బింగ్ చెబుతూ...
Virat Kohli-Shubman Gill

ఐపీఎల్ 2022 సీజన్‌లో టైటిల్ గెలిచిన గుజరాత్ టైటాన్స్‌లో కీ ప్లేయర్‌గా ఉన్న శుబ్‌మన్ గిల్, 2023 సీజన్‌లో కూడా అదరగొడుతూ, ఆరెంజ్ క్యాప్ రేసులో దూసుకుపోతున్నాడు...

25
PTI Photo/Manvender Vashist Lav)(PTI04_13_2023_000394B)

శుబ్‌మన్ గిల్, త్వరలో సినిమాల్లోకి రాబతున్నాడు. క్రికెట్‌లో కొనసాగుతూ సినిమాల్లో నటించాలంటే అయ్యే పని కాదు. చిన్న చిన్న గెస్ట్ రోల్స్ అయితే పర్లేదు కానీ హీరోగా చేయడం అయ్యేది కాదు...

35

ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న ‘స్పైడర్ మ్యాన్: అక్రాస్ ది స్పైడర్-వర్స్’ సినిమాలో స్పైడర్ మ్యాన్‌కి డబ్బింగ్ చెప్పబోతున్నాడు శుబ్‌మన్ గిల్. ఈసారి భారతీయ స్పైడర్ మ్యాన్ పవిత్ర్ ప్రభాకర్, వెండి తెరపై కనిపించబోతున్నాడు..

45
Spider-Man Across the Spider-Verse

ఈ పాత్రకి హిందీ, పంజాబీ భాషల్లో డబ్బింగ్ చెప్పేందుకు శుబ్‌మన్ గిల్ అంగీకరించడం, ఇప్పటికే డబ్బింగ్ పనులు కూడా మొదలెట్టేయడం జరిగిపోయాయి. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఇండియన్ స్పైడర్ మ్యాన్ పాత్రకు డబ్బింగ్ చెప్పబోతున్నట్టు తెలియచేశాడు శుబ్‌మన్ గిల్.. 

55

మార్వెల్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో పాటు సోనీ పిక్చర్స్‌ యానిమేషన్, కొలంబియా పిక్చర్స్ నిర్మిస్తున్న ‘స్పైడర్ మ్యాన్: అక్రాస్ ద స్పైడర్ వర్స్’ సినిమా 2023, జూన్ 2న విడుదల కాబోతోంది. 

Read more Photos on
click me!

Recommended Stories