ఐపీఎల్ 2023 సీజన్‌లో టీమిండియాలో చోటు కోల్పోయిన సీనియర్లు మంచి పర్ఫామెన్స్ ఇస్తున్నారు. ఇషాంత్ శర్మ, అజింకా రహానే, విజయ్ శంకర్‌తో పాటు వృద్ధిమాన్ సాహా కూడా ఆకట్టుకుంటున్నాడు. లక్నోతో జరిగిన మ్యాచ్‌లో 20 బంతుల్లో హాఫ్ సెంచరీ బాదాడు సాహా...
43 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్లతో 81 పరుగులు చేసిన వృద్ధిమాన్ సాహా, శుబ్‌మన్ గిల్‌తో కలిసి తొలి వికెట్‌కి 142 పరుగుల భాగస్వామ్యం జోడించాడు. అయితే సెకండ్ ఇన్నింగ్స్‌లో వృద్ధిమాన్ సాహా, ప్యాంటు తిరగేసుకుని వికెట్ కీపింగ్ చేయడం కెమెరాల్లో స్పష్టంగా కనిపించింది...
26
saha pants
ముందుకు ఉండాల్సిన బ్రాండ్ ప్రమోషన్ పేర్లు, ప్యాంటు తిరగేసుకోవడంతో వెనకాల కనిపించాయి. దీన్ని గమనించిన గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యాతో పాటు మహ్మద్ షమీ, క్వింటన్ డి కాక్ కూడా నవ్వు ఆపుకోలేకపోయారు. ఈ సంఘటనపై మ్యాచ్ అనంతరం వివరణ ఇచ్చాడు వృద్ధిమాన్ సాహా..
36
PTI Photo/Kunal Patil)(PTI03_31_2023_000264B)
‘మ్యాచ్ ముగిసిన తర్వాత ఫిజియో వచ్చి, నీకు రెండో ఇన్నింగ్స్‌లో రెస్ట్ ఇస్తామని చెప్పాడు. దాంతో నేను తాపీగా ప్లేట్‌లో డిన్నర్ పెట్టుకుని తింటున్నా. సెడన్‌గా వచ్చి, అంపైర్లు ఒప్పుకోలేదు, వికెట్ కీపింగ్ చేయాలని చెప్పారు. దాంతో టైమ్ అయిపోయిందనే తొందరలో ప్యాంటు తిరగేసుకున్నా...
46
Wriddhiman Saha
రెండు ఓవర్ల తర్వాత బ్రేక్ టైమ్‌లో వెళ్లి మళ్లీ మార్చుకుని వచ్చా. ఆ టైమ్‌లో శ్రీకర్ భరత్ అద్భుతంగా కీపింగ్ చేశాడు...’ అంటూ చెప్పుకొచ్చాడు వృద్ధిమాన్ సాహా...
56
తొలి ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత వృద్ధిమాన్ సాహా ప్లేస్‌లో శ్రీకర్ భరత్‌ని సబ్‌స్టిట్యూట్ వికెట్ కీపర్‌గా పెట్టాలని భావించింది గుజరాత్ టైటాన్స్. అయితే అందుకు అంపైర్లు అంగీకరించలేదు. దీంతో హడావుడిగా క్రీజులోకి వచ్చిన సాహా, రెండు ఓవర్ల తర్వాత మళ్లీ వెళ్లి ప్యాంటు మార్చుకుని వచ్చాడు..
66
ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి ఎంపిక చేసిన జట్టులో వృద్ధిమాన్ సాహాకి చోటు దక్కలేదు. ఫైనల్‌కి వికెట్ కీపర్‌గా ఎంపికైన శ్రీకర్ భరత్, ఐపీఎల్ 2023 సీజన్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. దీంతో గాయపడిన కెఎల్ రాహుల్ ప్లేస్‌లో సాహాకి ఇంకొక్క ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్నారు అభిమానులు..