ఐపీఎల్ 2023 సీజన్‌లో 11 మ్యాచుల్లో 469 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ రేసులో టాప్ 3లో ఉన్నాడు గుజరాత్ టైటాన్స్ ప్లేయర్ శుబ్‌మన్ గిల్. ఐపీఎల్ 2023 సీజన్‌లో నాలుగు హాఫ్ సెంచరీలు చేసిన శుబ్‌మన్ గిల్, లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 94 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు...
51 బంతుల్లో 2 ఫోర్లు, 7 సిక్సర్లతో 94 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్, ఒక్క సిక్సర్ బాది ఉంటే సెంచరీ మార్కుని అందుకునేవాడే. ఈ ఏడాది ఇప్పటికే వన్డే, టెస్టు, టీ20 ఫార్మాట్లలో సెంచరీలు చేసిన శుబ్‌మన్ గిల్, ఐపీఎల్‌లో కూడా శతకం మోగిస్తే... అరుదైన జాబితాలో చేరేవాడు...
27
యష్ ఠాకూర్ వేసిన ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్‌లో ఓ సిక్సర్ బాదిన శుబ్‌మన్ గిల్, ఆ తర్వాత మరో 3 బంతులు ఆడి 3 పరుగులే చేయగలిగాడు. ఆరంభంలో నెమ్మదిగా ఇన్నింగ్స్ ఆరంభించిన శుబ్‌మన్ గిల్, తొలి 12 బంతుల్లో 16 పరుగులే చేశాడు. ఆ తర్వాత కూడా వృద్ధిమాన్ సాహా బౌండరీల మోత మోగించడంతో గిల్, ఎక్కువగా అతనికి స్ట్రైయిక్ ఇవ్వడానికే ప్రాధాన్యం ఇచ్చాడు..
37
Image credit: PTI
‘నేను శుబ్‌మన్ గిల్ ప్లేస్‌లో ఉండి ఉంటే, ఐపీఎల్ 2023 సీజన్‌లో ఇప్పటిదాకా చేసిన పరుగులు నాకు సంతృప్తిని ఇచ్చేవి కావు. నేను మంచి ఫామ్‌లో ఉన్నా, 375 పరుగులు చేసినా ఇంప్రూవ్‌మెంట్ మాత్రం కావాల్సినంత లేదు. నెంబర్లు కొద్దిగానే మెరుగయ్యాయి...
శుబ్‌మన్ గిల్ అన్ని రకాల షాట్స్ ఆడగల ప్లేయర్. క్రీజులోకి వచ్చిన ప్రతీసారీ బోలెడు పాజిటివ్ ఇంటెంట్‌తో వస్తాడు. అయినా అతను బ్యాటు నుంచి రావాల్సినన్ని మెరుపులు అయితే రావడం లేదు. గత నాలుగు మ్యాచుల్లో అతని బ్యాటింగ్ చాలా క్లాస్‌గా ఉంది...
57
టీమిండియాకి ఆడేటప్పుడు ఎలాగైతే ఆడతాడో అలాగే ఐపీఎల్ ఆడుతున్నాడు. అయితే అతని నుంచి నేను సెంచరీలు ఆశిస్తున్నా. అతను టీమిండియాకి మూడు ఫార్మాట్లు ఆడాడు. ఈ ఏడాదిలో భారీగా పరుగులు చేశాడు...
67
తన సూపర్ ఫామ్‌ని శుబ్‌మన్ గిల్ సరిగ్గా వాడుకుంటే ఈ సీజన్‌లో ఈజీగా 600-700 పరుగులు చేయగలడు. ఇంకొంచెం ప్రయత్నిస్తే 800+ పరుగులు కూడా వస్తాయి.
77
Image credit: PTI
కానీ శుబ్‌మన్ గిల్ అలాంటి ప్రయత్నం చేయడం లేదు.. అదే నన్ను నిరుత్సాహపరుస్తోంది..’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్..