శ్రేయాస్ అయ్యర్‌కి నిజంగా గాయమైందా? హోటల్‌ రూమ్‌లో ఆ గెంతులు, డ్యాన్సులు...

Published : Apr 10, 2023, 03:28 PM IST

ఐపీఎల్ 2023 సీజన్‌కి దూరమైన స్టార్ ప్లేయర్లలో శ్రేయాస్ అయ్యర్ ఒకడు. గత సీజన్‌లో రూ.12 కోట్ల 25 లక్షలకు శ్రేయాస్ అయ్యర్‌ని కొనుగోలు చేసి, కెప్టెన్సీ అప్పజెప్పింది కోల్‌కత్తా నైట్‌రైడర్స్. గాయం కారణంగా ఈ సీజన్‌కి దూరమయ్యాడు అయ్యర్...

PREV
17
శ్రేయాస్ అయ్యర్‌కి నిజంగా గాయమైందా? హోటల్‌ రూమ్‌లో ఆ గెంతులు, డ్యాన్సులు...
Image credit: PTI

గాయం కారణంగా న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో ఆడని శ్రేయాస్ అయ్యర్, నాగ్‌పూర్‌ వేదికగా జరిగిన ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మొదటి టెస్టు కూడా ఆడలేదు. అహ్మదాబాద్‌లో జరిగిన ఆఖరి టెస్టు రెండో రోజు ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో కాస్త ఇబ్బందికి లోను కావడంతో పెవిలియన్ చేరిన శ్రేయాస్ అయ్యర్, మళ్లీ తిరిగి రాలేదు...

27
Shreyas Iyer

శ్రేయాస్ అయ్యర్ వెన్ను గాయంతో బాధపడుతున్నాడని అతన్ని స్కానింగ్‌కి తరలించిన బీసీసీఐ మెడికల్ టీమ్, అతను ఇప్పట్లో టీమ్‌కి అందుబాటులో ఉండే అవకాశం లేదని బాంబ్ పేల్చింది. ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌కి దూరమైన శ్రేయాస్ అయ్యర్, ఐపీఎల్ 2023 సీజన్‌లో కూడా ఆడడం లేదు..

37

అయితే శ్రేయాస్ అయ్యర్, బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)లో చికిత్స తీసుకుంటున్నాడేమోనని భావించిన అభిమానులకు కొన్ని రోజుల కిందట షాక్ తగిలింది. యజ్వేంద్ర చాహాల్ భార్య ధనశ్రీ వర్మతో కలిసి ఓ ఇఫ్తార్ పార్టీకి హాజరయ్యాడు శ్రేయాస్ అయ్యర్.. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యేక్షం కావడంతో టీమిండియా ఫ్యాన్స్ షాక్ అయ్యారు.. 

47
Shreyas Iyer Rinku Singh

తాజాగా గుజరాత్ టైటాన్స్, కోల్‌కత్తా నైట్‌రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌ని ఓ హోటల్ రూమ్ నుంచి వీక్షించాడు శ్రేయాస్ అయ్యర్. ఆఖరి బంతికి రింకూ సింగ్ సిక్సర్ కొట్టిన తర్వాత అరుస్తూ, పైకి లేచి సెలబ్రేట్ చేసుకున్న శ్రేయాస్ అయ్యర్, గాయపడి కోలుకుంటున్న ప్లేయర్‌లా అస్సలు కనిపించలేదు..

57

అసలు నిజంగా శ్రేయాస్ అయ్యర్‌కి గాయమైందా? లేక పర్సనల్‌ లైఫ్‌లో కొన్ని మూమెంట్స్ ఎంజాయ్ చేయడానికే ఇలా గాయం డ్రామా ఆడుతున్నాడా? అంటూ చాలామంది నెటిజన్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.. ఈ వీడియో తీసింది ఎవరు? ధనశ్రీ వర్మ కాదు కదా.. అంటూ ఇంకో వర్గం అనుమానాలు వ్యక్తం చేస్తోంది..

67
(PTI Photo)(PTI11_17_2022_000006B)

మ్యాచ్ అనంతరం వీడియో కాల్‌లో నితీశ్ రాణా, రింకూ సింగ్‌లతో మాట్లాడిన శ్రేయాస్ అయ్యర్, తన గాయం గురించి ఎలాంటి అప్‌డేట్ ఇవ్వలేదు. 2021 సీజన్‌లో అయ్యర్ గాయంతో తప్పుకోవడంతో తాత్కాలిక కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న రిషబ్ పంత్, ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ మేనేజ్‌మెంట్‌ని ఇంప్రెస్ చేసి పూర్తి స్థాయి సారథిగా మారిపోయాడు...

77
Shreyas Iyer

ఇప్పుడు మరోసారి శ్రేయాస్ అయ్యర్ లేకుండా కోల్‌కత్తా నైట్‌రైడర్స్ గత సీజన్ కంటే మెరుగైన ప్రదర్శన ఇస్తోంది. దీంతో అయ్యర్ వచ్చినా నితీశ్ రాణా కెప్టెన్సీయే బాగుందని కేకేఆర్ అనుకుంటే, మనోడికి మరో షాక్ తగలడం మాత్రం ఖాయం.. 

click me!

Recommended Stories