వాళ్ల దగ్గర లేనిది, నా దగ్గర ఉంది! అందుకే ఇలా.. ఫీల్డింగ్‌పై రవీంద్ర జడేజా కామెంట్...

First Published Apr 10, 2023, 3:02 PM IST

చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా 2022 సీజన్‌ని ప్రారంభించాడు రవీంద్ర జడేజా. అయితే వరుసగా 4 మ్యాచుల్లో ఓడడంతో 8 మ్యాచుల తర్వాత కెప్టెన్సీకి రిటైర్మెంట్ ఇచ్చాడు జడ్డూ.. కెప్టెన్‌గానే కాకుండా బౌలర్‌, బ్యాటర్, ఫీల్డర్‌గానూ మెప్పించలేకపోయాడు జడేజా...
 

(PTI PhotoKunal Patil)(PTI04_08_2023_000287B)

ఐపీఎల్ 2022 సీజన్‌‌లో రవీంద్ర జడేజాని రూ.16 కోట్లకు రిటైన్ చేసుకుంది చెన్నై సూపర్ కింగ్స్. కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి సెకండ్ రిటెన్షన్‌గా రూ.12 కోట్లు ఇచ్చిన సీఎస్‌కే, జడ్డూకి అంతకంటే ఎక్కువ మొత్తం ఇవ్వడం హాట్ టాపిక్ అయ్యింది..

ఐపీఎల్ 2022 సీజన్ ముగిసిన తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ మేనేజ్‌మెంట్, రవీంద్ర జడేజా మధ్య  విభేదాలు వచ్చాయి. సీఎస్‌కే ఇన్‌స్టాలో రవీంద్ర జడేజాని అన్‌ఫాలో చేస్తే, జడ్డూ, చెన్నై సూపర్ కింగ్స్ సంబంధించిన ఫోటోలు, పోస్టులు అన్నీ డిలీట్ చేశాడు. ఈసారి జడ్డూ, సీఎస్‌కే తరుపున ఆడడం జరగని పని అనుకున్నారంతా. 
 

Latest Videos


jadeja

అయితే మహేంద్ర సింగ్ ధోనీ జోక్యంతో మళ్లీ చెన్నై సూపర్ కింగ్స్ తరుపున ఆడేందుకు అంగీకరించాడు రవీంద్ర జడేజా. ఈసారి బ్యాటుతో ఇప్పటిదాకా మెరుపులు మెరిపించలేకపోయినా బౌలింగ్‌లో, ఫీల్డింగ్‌లో మంచి పర్ఫామెన్స్ ఇస్తున్నాడు..

ravindra jadeja

ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కామెరూన్ గ్రీన్ కొట్టిన స్ట్రైయిక్ షాట్‌ని మెరుపు వేగంతో అందుకున్నాడు రవీంద్ర జడేజా. జడ్డూ పట్టిన బ్లైండ్ క్యాచ్‌కి ఐపీఎల్ 2023 సీజన్‌లో క్యాస్ట్‌లీ ప్లేయర్లలో ఒకడైన గ్రీన్ 12 పరుగులకే పెవిలియన్ చేరాడు...

‘నేను ఫీల్డింగ్ చేసేటప్పుడు బౌలర్ వేసే లైన్ అండ్ లెంగ్త్‌ని బట్టి బంతి ఎటు పోతుందో అంచనా వేస్తాను. అంతేకాకుండా మిగిలిన ఫీల్డర్లతో పోలిస్తే నా దగ్గర 2 సెకన్ల సమయం ఎక్కువగా ఉంటుందని అనుకుంటాను...

నేను బౌలింగ్ చేస్తున్నప్పుడు బంతి బాగా టర్న్ అవుతుండడాన్ని గమనించాను. మంచి ఏరియాల్లో బౌలింగ్ చేస్తే వికెట్లు తీయడం పెద్ద కష్టమేమీ కాదని అర్థమైంది. ముంబై ఇండియన్స్‌లో చాలా మంది పవర్ హిట్టర్లు ఉన్నారు...

ఈ పిచ్ ఎప్పుడు ఎలా స్పందిస్తుందో ఊహించడం కష్టం. అందుకే లైన్ అండ్ లెంగ్త్‌ సరిగ్గా చూసుకోవాలని అనుకున్నాం. అయితే కామెరూన్ గ్రీన్ క్యాచ్ విషయంలో వికెట్ కీపర్ ఇషాన్ కిషన్‌కి కూడా క్రెడిట్ ఇవ్వాలి. అతను వికెట్ తీశాక నాలో భరోసా పెరిగింది. అందుకే నేను చేతులు పైకెత్తి క్యాచ్ కోసం ట్రై చేశా...’ అంటూ కామెంట్ చేశాడు రవీంద్ర జడేజా.. 

click me!