న్యూమరాలజీ ప్రకారం ఐపీఎల్ 2023 సీజన్‌లో ప్లేఆఫ్స్ చేరే జట్లు ఇవే... ఆ టాప్ టీమ్స్‌కి షాక్...

Published : Apr 10, 2023, 01:31 PM IST

పేరులో ఓ అక్షరం చేరిస్తే జీవితం మారిపోతుందని అనుకుంటారు చాలామంది. భారీ మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ పేరులో ఓ K ఎక్కువగా ఉంటుంది. సచిన్ టెండూల్కర్ 33, 10 జెర్సీ నెంబర్లకు, ధోనీ 7 నెంబర్ జెర్సీ వెనక చాలా పెద్ద సెంటిమెంట్స్ ఉన్నాయి... క్రికెటర్లు కూడా సంఖ్యా శాస్త్రం (న్యూమరాలజీ)ని బాగా నమ్ముతారు...

PREV
18
న్యూమరాలజీ ప్రకారం ఐపీఎల్ 2023 సీజన్‌లో ప్లేఆఫ్స్ చేరే జట్లు ఇవే... ఆ టాప్ టీమ్స్‌కి షాక్...
Rishabh Pant Jersey

రోహిత్ శర్మ, హార్ధిక్ పాండ్యా వంటి ప్లేయర్లు కూడా న్యూమరాలజిస్టులు చెప్పినట్టుగానే జెర్సీ నెంబర్లను ఎంచుకున్నారు. వ్యక్తిగత జీవితంలో చేసే చాలా పనుల విషయంలో కూడా వీరి జోక్యం ఉంటుంది. ఫలానా నెంబర్‌‌తో కార్లను కొనడం, ఇంటి నెంబర్‌, పెళ్లిళ్లు, పూజలు, శుభకార్యాలు.. ఇలా వాటిల్లో న్యూమరాలజీ ఎక్స్‌పర్ట్స్‌ జోక్యం ఉంటుంది. 

28
Image credit: PTI

మరి న్యూమరాలజీ ప్రకారం ఐపీఎల్ 2023 సీజన్‌లో ప్లేఆఫ్స్ చేరే జట్లు ఏవో తెలుసా. ప్రముఖ న్యూమరాలజిస్ట్ గౌతమ్ ఆజాద్ అంచనా ప్రకారం ఈ సారి ప్లేఆఫ్స్‌కి, ఫైనల్స్‌కి చేరబోయే జట్లు ఇవే...
 

38

ముంబై ఇండియన్స్: 2023 ఏడాదిలోని అంకెలన్నీ కలిపితే వచ్చేది 7. సంఖ్యా శాస్త్రంలో 7 అంకె, నీలం రంగును సూచిస్తుంది. కాబట్టి బ్లూ జెర్సీని ధరించే ముంబై ఇండియన్స్, ప్లేఆఫ్స్‌కి, ఫైనల్‌కి చేరే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అంటున్నారు న్యూమరాలజీ ఎక్స్‌పర్ట్స్... అయితే మొదటి 2 మ్యాచుల్లో చిత్తుగా ఓడిన ముంబై, తొలి విజయం కోసం ఎదురుచూస్తోంది.

48
Image credit: PTI

లక్నో సూపర్ జెయింట్స్: ముంబై ఇండియన్స్ మాదిరిగానే లక్నో సూపర్ జెయింట్స్ కూడా ఈసారి బ్లూ కలర్ జెర్సీలో బరిలో దిగుతోంది. కాబట్టి లక్నో టైటిల్ గెలిచే ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు న్యూమరాలజిస్టులు.

58
(PTI Photo/Vijay Verma)(PTI04_01_2023_000300B)

ఢిల్లీ క్యాపిటల్స్: రిషబ్ పంత్ లేకపోవడం, మిచెల్ మార్ష్ పెళ్లి కోసం స్వదేశానికి వెళ్లిపోవడం, కీలక బ్యాటర్లు ఫెయిల్ అవుతుండడంతో మొదటి మూడు మ్యాచుల్లో ఓడింది ఢిల్లీ క్యాపిటల్స్. అయితే న్యూమరాలజీ ఎక్స్‌పర్ట్స్‌ మాత్రం ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సారి ప్లేఆఫ్స్ కచ్ఛితంగా చేరుతుందని అంటున్నారు.. 

68
(PTI Photo/Shailendra Bhojak)(PTI04_02_2023_000388B)

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: మొదటి మ్యాచ్‌లో ఘన విజయం అందుకున్నా, రెండో మ్యాచ్‌లో చిత్తుగా ఓడింది ఆర్‌సీబీ. గత రెండు సీజన్లలో ప్లేఆఫ్స్ చేరిన ఆర్‌సీబీ, ఈసారి కూడా ప్లేఆఫ్స్ చేరే అవకాశాలు చాలా ఎక్కువగానే ఉన్నాయని అంటున్నారు సంఖ్యా శాస్త్ర నిపుణులు.. 

78

ఐపీఎల్ 2023 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్, కోల్‌కత్తా నైట్‌రైడర్స్, గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్.. మొదటి 3 మ్యాచుల్లో 2 విజయాలు అందుకుని పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉన్నాయి. అయితే న్యూమరాలజీ ప్రకారం వీటిలో ఏ టీమ్ కూడా ప్లేఆఫ్స్ చేరదట..

88
Image credit: PTI

ఇందులో ఇంకో విశేషం ఏంటంటే న్యూమరాలజీ ఎక్స్‌పర్ట్, ఈసారి పక్కా ప్లేఆఫ్స్ చేరతాయని అంచనా వేసిన ఢిల్లీ క్యాపిటల్స్, పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో ఉంటే, ముంబై ఇండియన్స్ ఆఖరి నుంచి రెండో స్థానంలో ఉంది. ఆర్‌సీబీ ఆఖరి నుంచి నాలుగో స్థానంలో ఉంటే, లక్నో సూపర్ జెయింట్స్ ఒక్కటే టాప్ 3లో ఉంది.. 

click me!

Recommended Stories