ఐపీఎల్ 2022 సీజన్‌లో ఫైనల్‌కి దూసుకెళ్లిన రాజస్థాన్ రాయల్స్, 2023 సీజన్ ఫస్టాఫ్‌లో టేబుల్ టాపర్‌గా నిలిచింది. మొదటి 5 మ్యాచుల్లో 4 విజయాలు అందుకున్న రాయల్స్, ఆ తర్వాత 9 మ్యాచుల్లో 3 విజయాలే అందుకుంది...
ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై 4 వికెట్ల తేడాతో విజయం అందుకుంది. అయితే రాయల్స్ ప్లేఆఫ్స్ చేరడానికి ఈ విజయం సరిపోదు...
26
14 మ్యాచుల్లో 7 విజయాలు అందుకున్న రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ విధించిన లక్ష్యాన్ని 18.3 ఓవర్లలో ఛేదించి ఉంటే, ఆర్‌సీబీ కంటే మెరుగైన నెట్ రన్ రేట్ సాధించి... టాప్ 4లోకి వచ్చి ఉండేది.
36
అప్పుడు ఆర్‌సీబీ, ముంబై ఇండియన్స్ ఆఖరి మ్యాచుల్లో ఓడిపోతే రాజస్థాన్ రాయల్స్‌కి కచ్చితంగా ప్లేఆఫ్స్ చేరే ఛాన్స్ ఉండేది. అయితే ఆఖరి 2 ఓవర్లలో 41 పరుగులు సమర్పించిన రాజస్థాన్ రాయల్స్, 188 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు 19.4 ఓవర్లు తీసుకుంది..
46
‘సిమ్రాన్ హెట్మయర్ కొడుతున్న తీరు చూస్తే 18.5 ఓవర్లలో మ్యాచ్ ఫినిష్ అయిపోతుందని అనుకున్నాం. అయితే సరిగ్గా అక్కడే అతను అవుట్ అయ్యాడు...
56
మా టీమ్‌లో క్వాలిటీ ప్లేయర్లు ఉన్నారు. అయినా మేం టేబుల్‌లో టాప్ 4లో లేకపోవడం షాకింగ్‌గా ఉంది. జైస్వాల్ చాలా మెచ్యూర్‌గా ఆడుతున్నాడు. ఇప్పటికే 100 మ్యాచుల ఆడిన అనుభవం ఉన్న ప్లేయర్‌లా కనిపిస్తున్నాడు..
66
వీలైనంత త్వరగా మ్యాచ్‌ని ముగించాలని ప్రయత్నించాం. అయితే పంజాబ్ కింగ్స్ బౌలర్లు మాకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు. నేను కూడా సరిగ్గా ఆడలేకపోయాను... ’ అంటూ కామెంట్ చేశాడు రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్..