ఫీల్డ్‌లో ఉండి ఆడితే తెలుస్తుంది.. బయట కూర్చుని మాట్లాడేవారికి ఏం తెలుసు..? విమర్శకులపై కోహ్లీ ఫైర్

Published : May 19, 2023, 04:52 PM IST

Virat Kohli Century: టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ  ఐపీఎల్ లో మరో సెంచరీ  చేసిన విషయం తెలిసిందే. సన్ రైజర్స్ హైదరాబాద్ తో మ్యాచ్ లో కోహ్లీ ఈ ఘనత అందుకున్నాడు. 

PREV
16
ఫీల్డ్‌లో ఉండి ఆడితే తెలుస్తుంది.. బయట కూర్చుని మాట్లాడేవారికి ఏం తెలుసు..? విమర్శకులపై కోహ్లీ ఫైర్

ఐపీఎల్ లో ఆరో సెంచరీ బాదిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు   స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. సన్ రైజర్స్ హైదరాబాద్ తో మ్యాచ్ లో  విశ్వరూపం చూపించాడు.  62 బంతులలోనే  12 బౌండరీలు,  నాలుగు భారీ సిక్సర్ల  సాయంతో  సెంచరీ సాధించాడు.   

26

ఈ సీజన్ లో కోహ్లీ   538 పరుగులు చేసి మళ్లీ మునపటి  జోరును చూపిస్తున్న విషయం తెలిసిందే.  అయితే ఇదే సీజన్ లో  కోహ్లీ స్ట్రైక్ రేట్ పై విమర్శలొచ్చాయి.  కోహ్లీ హాఫ్  సెంచరీల కోసం,  ఆరెంజ్ క్యాప్ అందుకునేందుకు  ఆడుతున్నాడని   క్రికెట్ విమర్శకులు విమర్శలు గుప్పించారు.  దీనిపై  కోహ్లీ తాజాగా విమర్శకులకు గట్టి కౌంటర్ ఇచ్చాడు. 

36

సన్ రైజర్స్ తో మ్యాచ్ ముగిశాక   పోస్ట్ మ్యాచ్ ప్రెజంటేషన్ లో భాగంగా కోహ్లీ మాట్లాడుతూ.. ‘నేనెప్పడూ నా గత మ్యాచ్ లలో ఎలా ఆడాలన్న విషయం గురించి  పట్టించుకోను. ప్రస్తుతానికి  నేనున్న పరిస్థితులు ఏంటి..? అందుకు అనుగుణంగా ఎలా ఆడాలన్నదే నా మైండ్ లో ఉంటుంది.   కొన్నిసార్లు   మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడినా నేను సంతృప్తి చెందను. 

46
Image credit: PTI

నా ఆట గురించి నాకు తెలుసు. అంతే తప్ప   బయటివారు ఎవరేం మాట్లాడుతున్నారనేది నేను పట్టించుకోను. అది వాళ్ల అభిప్రాయం.  ఫీల్డ్ లో పరిస్థితి ఎలా ఉంటుందో  వారికి తెలియదు. నేను ఎప్పుడూ  జట్టు గురించే ఆలోచిస్తా. పరిస్థితులకు అనుగుణంగా  ఆడటం నాకు అలవాటు.   అలా ఆడుతున్నందుక నాకు గర్వంగా ఉంది..’అని చెప్పాడు. 

56

ఇంకా కోహ్లీ మాట్లాడుతూ.. నాకు ఫ్యాన్సీ షాట్లు ఆడడం నచ్చదు. నేను ఎప్పుడూ అలా ఆడింది కూడా లేదు. ఏడాదికి 12 నెలల పాటు మ్యాచులు ఆడాలి. ఫ్యాన్సీ షాట్లు ఆడి వికెట్ పారేసుకోవడం కంటే, మ్యాచులు గెలిపించడం ముఖ్యం. అదీకాకుండా ఐపీఎల్ తర్వాత వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఆడబోతున్నాం. అప్పటిదాకా నా రిథమ్ కాపాడుకుంటూ టెక్నిక్‌ని మెరుగుదిద్దుకోవడం ముఖ్యం’అని వెల్లడించాడు. 

66

సన్ రైజర్స్ తో విజయం తర్వాత  ఆర్సీబీ పాయింట్ల పట్టికలో ముంబై ఇండియన్స్ ను వెనక్కినెట్టి నాలుగో స్థానానికి ఎగబాకింది.   ప్లేఆఫ్స్ రేసులో ఫోర్త్ ప్లేస్ ఈ రెండు జట్ల మధ్యే తీవ్రంగా  ఉండనుంది. 

Read more Photos on
click me!

Recommended Stories