ఐపీఎల్ ముగిసిన వెంటనే భారత జట్టు జూన్ 7 నుంచి ఇంగ్లాండ్ లోని ‘ది ఓవల్’ వేదికగా జరుగబోయే ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ లో పాల్గొననున్నాయి. ఈ మేరకు రెండు దిగ్గజ జట్లు ఇప్పటికే ఈ మెగా ట్రోఫీని దక్కించుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నాయి. భారత్ కు ఇది వరుసగా రెండో ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్ కాగా ఆసీస్ కు మాత్రం ఇదే మొదటిది.
27
Image credit: PTI
ఈ నేపథ్యంలో ఓవల్ లో విజయావకాశాలు ఎక్కువ ఎవరికి ఉన్నాయి..? ఇక్కడ ఆధిపత్యం ఎవరు చెలాయించే అవకాశం ఉంది..? ఈ మ్యాచ్ లో కీలక ఆటగాళ్లు ఎవరు..? వంటి విషయాలపై ఆస్ట్రేలియా మాజీ సారథి, ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ కు హెడ్ కోచ్ గా వ్యవహరిస్తున్న రికీ పాంటింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
37
Image credit: ICC/Facebook
ఢిల్లీలో స్టార్ స్పోర్ట్స్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాంటింగ్ మాట్లాడుతూ.. ‘ఇండియా - ఆస్ట్రేలియా మధ్య జరుగబోయే డబ్ల్యూటీసీ ఫైనల్ చాలా ఎగ్జయిటింగ్ కాంటెస్ట్. ఇదేమీ రెండు జట్ల మధ్య రెగ్యులర్ గా జరిగే టెస్టు మ్యాచ్ కాదు. గడిచిన రెండేండ్లుగా అత్యుత్తమ ప్రదర్శనలు చేసిన రెండు జట్లు ఫైనల్ కు చేరుకున్నాయి. అంతేగాక ఈ రెండు జట్లూ ప్రపంచంలోనే బెస్ట్ టీమ్స్ గా ఉన్నాయి.
47
Image credit: PTI
ఇండియా - ఆస్ట్రేలియా తటస్థ వేదికపై ఆడుతుండటం నన్ను మరింత ఎగ్జయిటింగ్ కు గురిచేస్తున్నది. ఈ సందర్భంగా నాకు ఓవల్ లో నేను ఆడిన రోజులు గుర్తుకొస్తున్నాయి. నా అభిప్రాయం ప్రకారం ఇక్కడి పరిస్థితులు కాస్త ఆస్ట్రేలియాకే అనుకూలంగా ఉంటాయి. ఆసీస్ లో కూడా దాదాపు ఇలాంటి వాతావరణమే ఉంటుంది.
57
ఒకవేళ ఈ ఫైనల్ భారత్ లో జరిగుంటే నేను కచ్చితంగా ఆస్ట్రేలియాకు కష్టమే అని చెప్పేవాడిని. అదే విధంగా ఆస్ట్రేలియాలో జరిగుంటే భారత్ కూ కష్టమయ్యేది. ఇది తటస్థ వేదిక అయినా ఆసీస్ కే కాస్త ఎడ్జ్ ఉంటుంది..’అని చెప్పాడు.
67
ఈ మ్యాచ్ లో స్టీవ్ స్మిత్, మార్నస్ లబూషేన్, విరాట్ కోహ్లీల ఆట చూడాలని వాళ్లే హాట్ ఫేవరేట్స్ అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. కానీ పాంటింగ్ మాత్రం ఈ టెస్టులో తాను ఉస్మాన్ ఖవాజా ఆట చూడాలని కోరుకుంటున్నట్టు చెప్పాడు. అతడు మంచి ఫామ్ లో ఉన్నాడని, అదే ఫామ్ ను కొనసాగిస్తే భారత్ కు కష్టాలు తప్పవని అన్నాడు.
77
ఇక డబ్ల్యూటీసీ ఫైనల్ లో టాస్ అంత కీలకమేమీ కాదని తానైతే దానిని నమ్మనని చెప్పాడు. న్యూజిలాండ్, సౌతాఫ్రికా వంటి చోట టాస్ కీలకమే గానీ ఇలాంటి (ఓవల్) పిచ్ పై టాస్ పెద్దగా ప్రభావం చూపకపోవచ్చని అన్నాడు. టాస్ గెలిచినంత మాత్రానా మ్యాచ్ గెలిచినట్టు కాదని పాంటింగ్ తెలిపాడు.