విరాట్ కోహ్లీ దేవుడిని అస్సలు నమ్మడు, కానీ ఇప్పుడేమో! ధోనీ మాత్రం... శిఖర్ ధావన్ కామెంట్...

Published : Apr 09, 2023, 11:38 AM IST

ఐపీఎల్ 2023 సీజన్‌లో కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న శిఖర్ ధావన్, మొదటి రెండు మ్యాచుల్లో పంజాబ్ కింగ్స్‌కి విజయాలు అందించాడు. కెప్టెన్‌గానే కాకుండా బ్యాటర్‌గా కూడా సూపర్ సక్సెస్ అవుతూ టీమ్‌ని ముందుండి నడిపిస్తున్నాడు...  

PREV
16
విరాట్ కోహ్లీ దేవుడిని అస్సలు నమ్మడు, కానీ ఇప్పుడేమో! ధోనీ మాత్రం... శిఖర్ ధావన్ కామెంట్...
Dhawan - Kohli

మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలో టీమిండియాలోకి వచ్చిన శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల కెప్టెన్సీలో ఆడాడు. తనకంటే జూనియర్ ప్లేయర్ అయిన కెఎల్ రాహుల్, రిషబ్ పంత్ కెప్టెన్సీలో కూడా ఆడిన శిఖర్ ధావన్.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌కి ముందు కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు..

26

‘విరాట్ కోహ్లీ, నేను ఆధ్యాత్మిక విషయాల గురించి చర్చించుకునేవాళ్లం. అయితే నిజానికి విరాట్ కోహ్లీ దేవుడిని అస్సలు నమ్మేవాడు కాదు. పక్కా నాస్తికుడిలా ఉండేవాడు. అయితే గత ఐదారేళ్ల నుంచి అతని ఆలోచనలో చాలా మార్పు వచ్చింది...

36
Shikhar dhawan-kohli-anuskha

అనుష్క శర్మతో పరిచయం, ప్రేమ, పెళ్లి తర్వాత పరమ భక్తుడిగా మారిపోయాడు. ఇప్పుడు అతని మాటలు వింటుంటే నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు.. నేటి తరానికి అతను పర్ఫెక్ట్ రోల్ మోడల్...

46
kohli dhawan

ధోనీ భాయ్ టీమ్‌లో ఓ ప్రశాంతమైన వాతావరణం ఉండేలా చూసుకునేవాడు. మ్యాచ్ రిజల్ట్ ఏదైనా సరే, డ్రెస్సింగ్ రూమ్‌లో ఆ ఎఫెక్ట్ కనిపించేది కాదు. చాలా ప్రశాంతంగా ఆడుతూ, పాడుతూ ఉండేవాడు.. ధోనీ చాలా పొదుపుగా మాట్లాడతారు...

56

ఏది అవసరమో అది మాత్రమే చెబుతాడు. చాలా సైలెంట్, అంతేకాకుండా తుంటరి పనులు చేయడానికి బాగా ఇష్టపడతాడు. ధోనీ చాలా సింపుల్. అందుకే అతనంటే టీమ్‌లో అతనికి గౌరవం. ధోనీ కొన్నిసార్లు కోప్పడినా, అది కూడా హద్దులు దాటకుండా చూసుకుంటాడు..

66
rohit dhoni dhawan

అతిగా కోప్పడితే టీమ్ వాతావరణం చెడిపోతుందని ధోనీకి బాగా తెలుసు. అందుకే తిట్టినా ఆ వెంటనే కూల్ చేస్తాడు. అదే అతని మెచ్యూరిటీ. మాహీ భాయ్‌కి సెల్ఫ్ కంట్రోల్ చాలా ఉంది.. అదే అతన్ని సక్సెస్‌ఫుల్ లీడర్‌గా చేసింది...’ అంటూ కామెంట్ చేశాడు శిఖర్ ధావన్.. 

Read more Photos on
click me!

Recommended Stories