నా పని అయిపోయిందనుకున్నారా? ఊర మాస్ ఇన్నింగ్స్‌తో కమ్‌బ్యాక్ ఇచ్చిన రహానే...

Published : Apr 09, 2023, 11:09 AM IST

అజింకా రహానే.. టీమిండియాలో ఒడిసిన ముచ్ఛట. టెస్టుల్లో వైస్ కెప్టెన్‌గా ఉండి, 2020-21 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని అందించిన సారథి. అయితే టెస్టుల్లో పేలవ ఫామ్‌లో టీమ్‌లో చోటు కోల్పోయిన అజింకా రహానే, ఇక రిటైర్మెంట్ తీసుకోవాల్సిందే అనుకున్నారంతా.. కానీ ఐపీఎల్ 2023లో మెంటల్ మాస్ కమ్‌బ్యాక్ ఇచ్చాడు రహానే.

PREV
17
నా పని అయిపోయిందనుకున్నారా? ఊర మాస్ ఇన్నింగ్స్‌తో కమ్‌బ్యాక్ ఇచ్చిన రహానే...
Ajinkya Rahane

ఐపీఎల్ 2023 మెగా వేలంలో అజింకా రహానేని బేస్ ప్రైజ్‌కి దక్కించుకుంది చెన్నై సూపర్ కింగ్స్. తొలి రెండు మ్యాచుల్లో ఆడని అజింకా రహానే, బెన్ స్టోక్స్, మొయిన్ ఆలీ గాయపడడంతో మూడో మ్యాచ్‌లో తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు.. 

27
Ajinkya Rahane

ఎప్పటిలాగే అజింకా రహానేపై ఎవ్వరికీ ఎలాంటి అంచనాలు లేవు. ముంబై ఇండియన్స్ కూడా ఫుల్లు ఫామ్‌లో ఉన్న రుతురాజ్ గైక్వాడ్, ధోనీ, జడేజా వంటి హిట్టర్ల కోసం ప్లాన్స్ రచించుకుని వచ్చింది... అయితే నాన్ సిలబస్ క్వశ్చన్‌లా లోకల్ గ్రౌండ్‌లో ముంబై బౌలర్లపై విరుచుకుపడ్డాడు అజింకా రహానే.. 

37

వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కి వచ్చిన అజింకా రహానే, అర్షద్ ఖాన్ వేసిన ఇన్నింగ్స్ 4వ ఓవర్‌లో 6, 4, 4, 4, 4 బాది 23 పరుగులు రాబట్టాడు. అప్పుడెప్పుడో 2012లో శ్రీనాథ్ అరవింద్ ఓవర్‌లో వరుసగా 6 ఫోర్లు బాదిన రహానే, మళ్లీ అలాంటి ఇన్నింగ్స్‌తో తన కథ ఇంకా ముగిసిపోలేదని సిగ్నల్ ఇచ్చేశాడు..

47

19 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న అజింకా రహానే, 2023 సీజన్‌లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఇంతకుముందు కేకేఆర్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ 20 బంతుల్లో హాఫ్ సెంచరీ బాదాడు. సీఎస్‌కే తరుపున 2014లో సురేశ్ రైనా 16 బంతుల్లో హాఫ్ సెంచరీ బాదితే, ఆ తర్వాత ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ అజింకా రహానేదే. 

57

ముంబై ఇండియన్స్‌పై మూడో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ ఇది. ఇంతకుముందు 2022లో కేకేఆర్ ఆల్‌రౌండర్ ప్యాట్ కమ్మిన్స్ 14 బంతుల్లో, 2019లో రిషబ్ పంత్ 18 బంతుల్లో ముంబైపై హాఫ్ సెంచరీలు చేశారు... 

67

 27 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 61 పరుగులు చేసిన అజింకా రహానే, పియూష్ చావ్లా బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి అవుట్ అయ్యాడు. అయితే అప్పటికే 8 ఓవర్లలోనే సగానికి పైగా టార్గెట్‌ని ఊదేసింది సీఎస్‌కే..

77

ఈ ఇన్నింగ్స్ అజింకా రహానేని ధోనీ మరో 6-8 మ్యాచుల్లో ఆడించడం గ్యారెంటీ. ఎలాగో ఇంపాక్ట్ ప్లేయర్ సదుపాయం కూడా ఉండడంతో రహానే, ఓ సురేష్ రైనా, 2021లో రాబిన్ ఊతప్పలా ఉపయోగపడతాడని భారీ ఆశలు పెంచుకుంటున్నారు సీఎస్‌కే ఫ్యాన్స్.. 

click me!

Recommended Stories