టీమిండియాకి అండర్-19 వరల్డ్ కప్ అందించిన కెప్టెన్లలో ఉన్ముక్త్ చంద్ ఒకడు. 2008లో విరాట్ కోహ్లీ, అండర్19 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత 2012లో భారత యువ జట్టుకి ప్రపంచ కప్ అందించాడు ఉన్ముక్త్ చంద్. ఆ తర్వాత ఆరేళ్లకు ఈ ఫీట్ సాధించాడు పృథ్వీ షా...
2000వ సంవత్సరంలో మహ్మద్ కైఫ్ కెప్టెన్సీలో మొట్టమొదటి అండర్19 వరల్డ్ కప్ గెలిచింది భారత జట్టు. మహ్మద్ కైఫ్, సౌరవ్ గంగూలీ కెప్టెన్సీలో టీమిండియాకి కీ ప్లేయర్‌గా కొనసాగాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ, వరల్డ్ కప్ గెలిచి టీమిండియాలోకి వచ్చి కెప్టెన్ అయ్యాడు, స్టార్ ప్లేయర్‌గా కొనసాగుతున్నాడు..
29
విరాట్ కోహ్లీ తర్వాత అండర్19 విన్నింగ్ కెప్టెన్లు ఎవ్వరూ అలాంటి ఫీట్‌ని కొనసాగించలేకపోయారు. 2012 అండర్ 19 వరల్డ్ కప్ విజయం తర్వాత బీభత్సమైన క్రేజ్, పాపులారిటీ తెచ్చుకున్న ఉన్ముక్త్ చంద్, దాన్ని సక్రమమైన రీతిలో వాడుకోవడంలో విఫలమయ్యాడు.
39
భారీ అంచనాలతో ఐపీఎల్‌లో అడుగుపెట్టి, అక్కడ విఫలమై, దేశవాళీ టోర్నీలో వివాదాల్లో ఇరుక్కుని... 9 ఏళ్ల పాటు అవకాశాల కోసం ఎదురుచూస్తూ గడిపేసిన ఉన్ముక్త్ చంద్, 2021లో భారత క్రికెట్‌కి రాజీనామా చేసి యూఎస్‌కి మకాం మార్చాడు... ఇప్పుడు పృథ్వీ షా కెరీర్ గ్రాఫ్ కూడా ఇదే విధంగా సాగుతోంది..
49
(PTI Photo/Vijay Verma)(PTI04_01_2023_000337B)
పృథ్వీ షా బ్యాటింగ్ సత్తా గురించి ఎవ్వరికీ ఎలాంటి అనుమానాలు లేవు. టీమిండియా తరుపున ఆరంగ్రేటం టెస్టులోనే సెంచరీ బాదిన పృథ్వీ షా, ఆడిలైడ్ టెస్టు తర్వాత టీమ్‌లో చోటు కోల్పోయాడు. దేశవాళీ టోర్నీల్లో మంచి ప్రదర్శన ఇస్తూనే ఉన్నాడు, కానీ సెలక్టర్లు మాత్రం అతన్ని పట్టించుకోవడం లేదు..
59
Image credit: PTI
పృథ్వీ షాని సెలక్టర్లు ఎందుకు పట్టించుకోవడం లేదో, ఐపీఎల్ 2023 సీజన్‌లో అతని బ్యాటింగ్ చూసిన వారందరికీ క్లియర్‌గా అర్థమైపోయి ఉంటుంది. పృథ్వీ షాని అవుట్ చేయడానికి బౌలర్లు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్లకి కష్టం లేకుండా పృథ్వీ షానే వారికి వికెట్ ఇచ్చేస్తున్నాడు..
69
రిషబ్ పంత్ గైర్హజరీతో ఢిల్లీ క్యాపిటల్స్‌కి పృథ్వీ షా కీ ప్లేయర్ అవుతాడని ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు ఆ టీమ్ కోచ్ రికీ పాంటింగ్. అయితే పృథ్వీ షా మాత్రం తన నిర్లక్ష్యమైన ఆటతీరుతో అట్టర్ ఫ్లాప్ అవుతున్నాడు.. మొదటి మ్యాచ్‌లో 12 పరుగులు చేసి మార్క్ వుడ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు పృథ్వీ షా..
79
గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 పరుగులు చేసి అవుటైన పృథ్వీ షా, రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో డకౌట్ అయ్యాడు. ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా 3 మ్యాచుల్లో ఓడింది. వార్నర్ ఒక్కడూ ఒంటరి పోరాటం చేస్తున్నా, అతనికి సరైన సహకారం దక్కడం లేదు..
89
రిషబ్ పంత్ గైర్హజరీతో తనకి ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్సీ దక్కుతుందని పృథ్వీ షా ఆశించాడని, డేవిడ్ వార్నర్‌కి కెప్టెన్సీ అప్పగించడంతో నిరాశకు గురయ్యాడని అంటున్నారు నెటిజన్లు. ఈ కారణంగానే పృథ్వీ షా కావాలని ఫెయిల్ అవుతున్నాడని అంటున్నారు మరికొందరు. అయితే ఇదే నిజమైతే పృథ్వీ షా కెరీర్ పెను ప్రమాదంలో పడుతుంది..
99
ఇప్పటికే రుతురాజ్ గైక్వాడ్, ఐపీఎల్‌లో అదరగొడుతున్నాడు. శుబ్‌మన్ గిల్ సెన్సేషనల్ ఫామ్‌లో ఉన్నాడు. అండర్19 వరల్డ్ కప్ 2020 హీరో యశస్వి జైస్వాల్ స్టార్ బౌలర్ల బౌలింగ్‌లో చెలరేగిపోతున్నాడు. వీరిని దాటి టీమ్‌లోకి రావాలంటే పృథ్వీ షా... నిలకడగా రాణించాల్సిందే. ఆ విషయం అతనికి కూడా తెలిసి ఉంటుంది..