నాదే తప్పు! నాతో పాటు వాళ్లది కూడా... అయినా పోయింది రెండు మ్యాచులేగా... ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ

Published : Apr 09, 2023, 02:30 PM IST

ఐపీఎల్ 2022 నుంచి ముంబై ఇండియన్స్ బ్యాడ్ టైం మొదలైంది. ఇప్పుడు అనామక ప్లేయర్లను కొనుగోలు చేసి, వారిని స్టార్ ప్లేయర్లుగా మార్చిన ముంబై టీమ్, ఇప్పుడు స్టార్ ప్లేయర్లను పెట్టుకుని కూడా విజయాలు అందుకోలేకపోతోంది...

PREV
17
నాదే తప్పు! నాతో పాటు వాళ్లది కూడా... అయినా పోయింది రెండు మ్యాచులేగా... ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ

ఐపీఎల్ 2022 సీజన్‌లో 14 మ్యాచుల్లో 10 పరాజయాలు అందుకున్న ముంబై ఇండియన్స్, ఆఖరి స్థానంలో నిలిచింది. ఈసారి కూడా మొదటి రెండు మ్యాచుల్లో విజయాలు అందుకోలేకపోయింది ముంబై. ఓడిన రెండు మ్యాచుల్లోనూ ముంబై ఆఖరి వరకూ పోరాడలేకపోయింది..
 

27

ఐపీఎల్ 2019, 2020 సీజన్లలో ఎప్పుడూ కూడా ముంబై ఇండియన్స్ వరుసగా రెండు మ్యాచుల్లో ఓడింది లేదు. హ్యాట్రిక్ విజయాలు అందుకుంటూ వరుసగా రెండు టైటిల్స్ గెలిచిన ముంబై ఇండియన్స్, 2021 నుంచి వరుసగా పరాజయాలు అందుకుంటోంది. గత సీజన్‌లో ఏకంగా 8 మ్యాచుల్లో ఓడింది ముంబై ఇండియన్స్.. 
 

37

‘మాకు మంచి ఆరంభం దక్కింది. అయితే దాన్ని సరిగ్గా వాడుకోలేకపోయాం. మిడిల్ ఓవర్లలో వికెట్లు కోల్పోవడంతో పరుగులు రాలేదు. ఇది మంచి బ్యాటింగ్ పిచ్. ఇంకో 30-40 పరుగులు చేసి ఉంటే పోరాడే అవకాశం ఉండేది. మిడిల్ ఓవర్లలో చేయాల్సినన్ని పరుగులు చేయలేకపోయాం...

47
Rohit Sharma

చెన్నై స్పిన్నర్లకు కూడా క్రెడిట్ దక్కాలి. వాళ్లు వెంటవెంటనే వికెట్లు తీసి, మమ్మల్ని ఒత్తిడిలోకి పడేశారు. ఏం జరుగుతుందో గ్రహించేలోపే వికెట్లు కోల్పోయాం. జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. నాతో సహా సీనియర్లు అందరూ దీనికి భాద్యత వహించాలి...

57
(PTI Photo/Shailendra Bhojak)(PTI04_02_2023_000200B)

నాకు మంచి ఆరంభం దక్కినా దాన్ని సరిగ్గా వాడుకోలేకపోయా. ఐపీఎల్‌లో ఎలా మొదలెట్టాం అనేది ముఖ్యం కాదు, ఎలా ముగించామనేదే చాలా ముఖ్యం. అయినా ఇప్పటిదాకా అయ్యింది రెండు మ్యాచులే. ఇకపైన చాలా మ్యాచులు జరగాల్సి ఉంది...

67
(PTI Photo/Shailendra Bhojak)(PTI04_02_2023_000422B)

టీమ్‌లో ఉన్న సీనియర్లు ఆడకపోతే విజయాలు అందుకోలేం. అది వాళ్లకు కూడా తెలుసు. ఆడకపోతే ఎవరి ప్లేస్‌కీ గ్యారెంటీ లేదు. అయినా ఒక్క మ్యాచ్ గెలిస్తే చాలు, ఆ విజయాలను ఎలా కొనసాగించాలో మాకు తెలుసు. ఆ ఒక్క విజయం త్వరలోనే వస్తుందని అనుకుంటున్నా...
 

77

డ్రెస్సింగ్ రూమ్‌లో చాలా విషయాలపై చర్చ జరగాలి. మిడిల్ ఓవర్లలో పరుగులు ఎందుకు రావడం లేదో, ఎక్కడ తప్పు జరుగుతుందో కనిపెట్టాలి. మధ్య ఓవర్లలో ఎవరైనా పరుగులు చేయగలరో వారికే అవకాశాలు ఇవ్వడానికి కూడా టీమ్ సిద్ధంగా ఉంటుంది...’ అంటూ కామెంట్ చేశాడు ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ..
 

Read more Photos on
click me!

Recommended Stories