ఐపీఎల్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీమ్ ముంబై ఇండియన్స్. రోహిత్ శర్మ కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్నాక 8 సీజన్ల గ్యాప్‌లో ఐదు సార్లు టైటిల్ ఛాంపియన్‌గా నిలిచింది ముంబై ఇండియన్స్. అయితే 2022 నుంచి ముంబై ఇండియన్స్ ఆటతీరు మరీ దారుణంగా తయారైంది...
చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ అంటే ఆఖరి ఓవర్ ఆఖరి బంతి వరకూ హోరాహోరీ ఫైట్ ఉంటుందని, అసలు సిసలు ఐపీఎల్ మజా ఇస్తాయని ఆశిస్తారు అభిమానులు. అయితే ఐపీఎల్ 2023 సీజన్‌లో ఈ రెండు జట్ల మధ్య జరిగిన మొదటి మ్యాచ్ చప్పగా సాగింది...
27
ఐపీఎల్ El Clasico అని ఎంతో హైప్ పెంచేసిన ముంబై వర్సెస్ చెన్నై మ్యాచ్‌లో సీఎస్‌కే పూర్తి డామినేషన్ చూపించింది. ఆర్‌సీబీతో మొదటి మ్యాచ్‌లో తిలక్ వర్మ వీరోచిత పోరాటం వల్ల బ్యాటింగ్‌లో మంచి స్కోరు చేసింది ముంబై ఇండియన్స్. అయితే సీఎస్‌కేతో మ్యాచ్‌లో అయితే అది కూడా చూసే అవకాశం దొరకలేదు...
అటు బ్యాటింగ్‌లోనూ, ఇటు బౌలింగ్‌లోనూ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. లోకల్ భాయ్ అజింకా రహానే సూపర్ షో కారణంగా ముంబై ఇండియన్స్ ఓడిందని సరిపెట్టుకున్నా, ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఆడుతుందనే ఫీలింగ్ కూడా కలగలేదు...
47
ఒకప్పుడు క్వింటన్ డి కాక్, ట్రెంట్ బౌల్ట్, కిరన్ పోలార్డ్, హార్ధిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, లసిత్ మలింగ వంటి మ్యాచ్ విన్నర్లతో అత్యంత పటిష్టంగా ఉండేది ముంబై ఇండియన్స్. క్రిస్ లీగ్, సౌరబ్ తివారి, నాథన్ కౌంటర్‌నైల్, జేమ్స్ నీశమ్, ఆడమ్ మిల్నే, మార్కో జాన్సెన్ వంటి ప్లేయర్లు, ముంబై రిజర్వు బెంచ్‌లో కూర్చునేవాళ్లు...
57
కానీ ఐపీఎల్ 2022 మెగా వేలం ముంబై ఇండియన్స్ టీమ్‌ని విచ్ఛిన్నం చేసేసింది. ముంబై టీమ్‌లో స్టార్లుగా వెలిగిన పాండ్యా బ్రదర్స్‌తో పాటు క్వింటన్ డి కాక్, ట్రెంట్ బౌల్ట్.. వేరే టీమ్స్‌కి వెళ్లిపోయారు. కిరన్ పోలార్డ్, గత సీజన్‌లో రిటైర్మెంట్ తీసుకున్నాడు...
67
రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రిత్ బుమ్రా వంటి కోర్ టీమ్ ప్లేయర్లు మాత్రమే ముంబైలో మిగిలారు. అయితే వీళ్లు ముంబైకి విజయాలు అందించలేకపోతున్నారు. కేవలం రెండు మ్యాచుల్లో ఓడినంత మాత్రాన ముంబై టీమ్ వీక్ అయిపోయిందని చెప్పడం కరెక్ట్ కాదు..
77
Rohit Sharma
అయితే గత రెండు సీజన్లుగా ముంబై ఇండియన్స్ మ్యాచులను చూస్తున్న, గమనిస్తున్న వారందరికీ.. రోహిత్ శర్మ టీమ్ మునుపటిలా లేదని మాత్రం ఓ అవగాహన వచ్చేసింది. ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్ చేరాలంటే అద్భుతం జరగాల్సిందే... మళ్లీ టైటిల్ గెలవాలంటే అంతకుమించిన మ్యాజిక్ ఏదో జరగాలి...