ఫేడ్ అవుట్ అయిన ప్లేయర్లతో సెన్సేషన్... చెన్నై సూపర్ కింగ్స్‌లో మెరిసిన సీనియర్లు వీరే...

First Published Apr 9, 2023, 12:44 PM IST

ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ని సీనియర్ సిటిజన్స్ టీమ్ అని పిలుస్తారు. 30-35 ఏళ్లు దాటిన ప్లేయర్లను ఏరి కోరి కొనుగోలు చేస్తుంటుంది సీఎస్‌కే. మిగిలిన టీమ్స్‌లో అట్టర్ ఫ్లాప్ అయిపోయి దాదాపు కెరీర్ ఎండింగ్ స్టేజీలో చెన్నై సూపర్ కింగ్స్‌లోకి వెళ్లి సూపర్ హిట్ అయ్యారు కొందరు ప్లేయర్లు...

అజింకా రహానే: ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్, రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కత్తా నైట్‌రైడర్స్ తరుపున ఆడిన అజింకా రహానే, రాజస్థాన్ రాయల్స్‌ టీమ్‌కి కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు. అయితే కొన్ని సీజన్లుగా అజింకా రహానేకి తుది జట్టులో చోటు దక్కడం లేదు...
 

2021 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరుపున 2 మ్యాచులు ఆడిన అజింకా రహానే, 2022 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరుపున 7 మ్యాచులు ఆడాడు. 2021 సీజన్‌లో ఢిల్లీకి కెప్టెన్‌గా వ్యవహరించిన రిషబ్ పంత్, టాస్ సమయంలో అజింకా రహానే పేరు కూడా మరిచిపోయి, ‘అతను సరిగా ఆడడం లేదని ఇంకో ప్లేయర్‌ని ఆడిస్తున్నాం.. అతని పేరు మరిచిపోయా’ అంటూ వ్యాఖ్యానించాడు..

Latest Videos


అలాంటి అవమానాలు ఎదుర్కొని, టెస్టు టీమ్‌లో వైస్ కెప్టెన్సీతో పాటు ప్లేస్ కూడా కోల్పోయిన అజింకా రహానే, ఇక రిటైర్మెంట్ తీసుకోవాల్సిందే అనుకుంటున్న టైమ్‌లో ఐపీఎల్ 2023 సీజన్‌ మినీ వేలంలో బేస్ ప్రైజ్ రూ.50 లక్షలకు అతన్ని కొనుగోలు చేసింది చెన్నై సూపర్ కింగ్స్. ముంబైతో మ్యాచ్‌లో 225.93 స్ట్రైయిక్ రేటుతో 61 పరుగులు చేసిన రహానే, ఎవ్వరూ ఊహించని పర్ఫామెన్స్ ఇచ్చాడు..

రాబిన్ ఊతప్ప: రహానేది, ఊతప్పది దాదాపు ఒకే కథ. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పూణే వారియర్స్, కోల్‌కత్తా నైట్‌రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ తరుపున ఆడిన రాబిన్ ఊతప్ప, కేకేఆర్ తరుపున ఆరెంజ్ క్యాప్ కూడా గెలిచాడు...

ఊతప్ప కెరీర్ ముగిసిపోయిందనుకుంటున్న సమయంలో 2021 ట్రేడ్ ద్వారా ఊతప్పని దక్కించుకున్న సీఎస్‌కే, ప్లేఆఫ్స్‌లో అతన్ని ఆడించింది. 4 మ్యాచుల్లో 115 పరుగులు చేసిన ఊతప్ప, సీఎస్‌కే టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు..

షేన్ వాట్సన్: ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాెలంజర్స్ బెంగళూరు తరుపున ఆడిన షేన్ వాట్సన్, 2016 ఫైనల్‌లో ఆర్‌సీబీ ఓటమికి ఓ కారణంగా నిలిచాడు. అయితే సీఎస్‌కేలోకి వచ్చిన షేన్ వాట్సన్, 2018లో టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. 2019 ఫైనల్ మ్యాచ్‌లో ఒంటరిపోరాటం చేసి అందరి మనసులు గెలుచుకున్నాడు..

(PTI PhotoR Senthil Kumar)(PTI04_03_2023_000364B)

మొయిన్ ఆలీ: ఆర్‌సీబీలో ఫెయిల్ అయిన మొయిన్ ఆలీని, 2021 మినీ వేలంలో కొనుగోలు చేసింది చెన్నై సూపర్ కింగ్స్. చెన్నై నాలుగో టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన మొయిన్ ఆలీ, 2022 సీఎస్‌కే రిటెన్షన్ దక్కించుకున్నాడు.. 2023 సీజన్‌లోనూ మంచి పర్ఫామెన్స్ ఇస్తున్నాడు. 

click me!