సూర్యది బ్యాడ్ టైం అయితే, సంజూ శాంసన్‌ది అష్టదరిద్రం... బాగా ఆడి, ప్లేస్ కొట్టేస్తాడనుకున్న ప్రతీసారీ...

Published : Apr 13, 2023, 10:40 AM IST

టీమిండియా తరుపున అప్పుడెప్పుడో 2015లో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన సంజూ శాంసన్, ఇప్పటిదాకా ఆడింది 11 వన్డేలు, 16 టీ20 మ్యాచులు మాత్రమే. ఐపీఎల్‌ 2022 సీజన్‌లో బాగా ఆడి టీమిండియాలోకి వచ్చిన సంజూ శాంసన్, గత సీజన్‌లో వన్డేల్లో బాగానే రాణించాడు. అయితే చెప్పా పెట్టకుండా సంజూని సైడ్ చేసేసింది టీమిండియా...

PREV
18
సూర్యది బ్యాడ్ టైం అయితే, సంజూ శాంసన్‌ది అష్టదరిద్రం... బాగా ఆడి, ప్లేస్ కొట్టేస్తాడనుకున్న ప్రతీసారీ...
Shreyas Iyer

శ్రేయాస్ అయ్యర్ వెన్ను గాయంతో బాధపడుతూ క్రికెట్‌కి దూరంగా ఉండడంతో పాటు రిషబ్ పంత్ కారు ప్రమాదానికి గురి కావడంతో ఇప్పుడు టీమిండియాలో ప్లేస్ ఖాళీగా ఉంది. రిషబ్ పంత్ ప్లేస్‌లో వన్డేల్లో కెఎల్ రాహుల్ వికెట్ కీపింగ్ బ్యాటర్‌గా రాణిస్తున్నా, టీ20, టెస్టుల్లో సరైన వికెట్ కీపర్ అవసరం ఉంది..

28
Sanju Samson Bowled

ఇషాన్ కిషన్ నిలకడలేమితో ఒక్క మ్యాచ్ బాగా ఆడితే నాలుగైదు మ్యాచుల్లో ఫెయిల్ అవుతూ ఉన్నాడు. దీంతో సంజూ శాంసన్‌ని ఆడిస్తే బాగుంటుందనే ఆలోచన చాలామందికి వచ్చింది. అందులోనే గత రెండు నెలలుగా సూర్యకుమార్ యాదవ్ టైం ఏమీ బాగోలేదు...

38

ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో మూడు మ్యాచుల్లో గోల్డెన్ డకౌట్ అయ్యాడు సూర్యకుమార్ యాదవ్. అంతకుముందు జరిగిన వన్డే సిరీసుల్లో కూడా సూర్య నుంచి ఆశించిన స్థాయి పర్ఫామెన్స్ రాలేదు. ఐపీఎల్ 2023 సీజన్‌లో కూడా సూర్య ఫెయిల్యూర్ కొనసాగుతూ వస్తోంది..

48

ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్‌లో రెండు క్యాచ్‌లను డ్రాప్ చేసిన సూర్యకుమార్ యాదవ్, గాయం కూడా చేసుకున్నాడు. ఈ గాయం ఎంత తీవ్రమైనదనేది ఇంకా క్లారిటీ రాలేదు. గాయంతోనే క్రీజులోకి వచ్చిన సూర్య, మొదటి బంతికే డకౌట్ అయ్యాడు.. మొత్తానికి సూర్యకి బ్యాడ్ టైం నడుస్తుందని అర్థమైపోయింది..

58
(PTI Photo)(PTI04_05_2023_000334B)

సాధారణంగా మనకు పోటీగా ఉన్న వారికి బ్యాడ్ టైం నడిస్తే అది మనకు ప్లస్ అవ్వాలి. కానీ సంజూ శాంసన్ విషయంలో సీన్ రివర్స్. సూర్యకి గత నెలన్నర, రెండు నెలలుగా బ్యాడ్ టైం నడుస్తుంటే, సంజూ శాంసన్‌ని అష్టదరిద్రం పట్టిపీడుస్తున్నట్టు ఉంది.. ఎందుకంటే అతను ఆడుతున్న విధానం అలా ఉంది మరి..

68
(PTI Photo/R Senthil Kumar)(PTI04_12_2023_000216B)

ఐపీఎల్ 2022 సీజన్‌లో 458 పరుగులు చేసిన సంజూ శాంసన్, ఈ ఏడాది 4 మ్యాచుల్లో కలిపి చేసింది 97 పరుగులే. అందులో రెండు సార్లు డకౌట్ అయ్యాడు సంజూ శాంసన్. సంజూ బాగా ఆడితే వన్డేల్లో టూ డౌన్‌లో ఆడించే అవకాశం ఉంటుందనుకుంటే, కీలక సమయంలో ఫెయిల్ అవుతూ తనపై అభిమానులు పెట్టుకున్న ఆశలను తుడిచి పెట్టేస్తున్నాడు సంజూ శాంసన్..

78
(PTI Photo)(PTI04_08_2023_000185B)

సంజూ శాంసన్ బ్యాటుతో ఇస్తున్న ఈ ప్రదర్శనతో టీమిండియాలోకి తిరిగి రావాలంటే ఇప్పట్లో అయ్యే పని కాదు. టీమిండియా మాజీ సెలక్టర్ చేతన్ శర్మ అన్నట్టుగా సంజూ శాంసన్ కెరీర్ దాదాపు ముగింపు దశలో ఉంది. సంజూ లాంటి ప్లేయర్‌, అంతర్జాతీయ క్రికెట్‌లో సక్సెస్ కాలేకపోవడానికి సెలక్టర్లు సగం కారణమైతే మిగిలిన సగం మాత్రం అతనే... 

88
sanju samson

రిషబ్ పంత్‌కి ఇచ్చినన్ని కాకపోయినా సంజూ శాంసన్‌కి కూడా కొన్ని ఛాన్సులు ఇచ్చింది టీమిండియా. ఆ మ్యాచుల్లో అతను రాణించలేకపోయాడు. దీంతో అతన్ని పక్కనబెట్టేసి రిషబ్ పంత్‌నే ప్రోత్సహించింది. ఇప్పుడు ఆ ప్లేస్ తాత్కాలికంగా ఖాళీగా ఉన్నా, సంజూ పేలవ ఫామ్‌తో టీమ్‌లో చోటు దక్కించుకోలేకపోతున్నాడు.. 

click me!

Recommended Stories