జడ్డూ నాకు ఫినిషింగ్ ఛాన్స్ ఇచ్చాడు! కానీ నా వల్ల కాలేదు అయినా హ్యాపీయే... మహేంద్ర సింగ్ ధోనీ కామెంట్...

First Published Apr 13, 2023, 9:33 AM IST

ఐపీఎల్ 2023 సీజన్‌లో మొదటి మ్యాచ్‌లో ఓడినా ఆ తర్వాత వరుసగా రెండింట్లో విజయాలు అందుకుంది చెన్నై సూపర్ కింగ్స్. అయితే రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నైకి షాక్ తగిలింది. ఆఖరి ఓవర్‌ ఆఖరి బంతి వరకూ పోరాడిన సీఎస్‌కే, 3 పరుగుల తేడాతో ఓడింది...

ఆఖరి ఓవర్‌లో చెన్నై సూపర్ కింగ్స్ విజయానికి 21 పరుగులు కావాల్సి వచ్చాయి. మొదటి 3 బంతుల్లో 2 వైడ్లు, 2 సిక్సర్లు కొట్డంతో 13 పరుగులు వచ్చేశాయి. క్రీజులో క్రికెట్‌లో బెస్ట్ ఫినిషర్‌గా పేరొందిన మహేంద్ర సింగ్ ధోనీ, రవీంద్ర జడేజా ఉన్నారు... ధోనీ ఆఖరి ఓవర్‌లో మొదటి 3 బంతుల్లో వరుసగా రెండు సిక్సర్లు బాదాడు...
 

PTI PhotoR Senthil Kumar)(PTI04_12_2023_000216B)

చివరి 3 బంతుల్లో ఒక్క సిక్సర్ బాదితే చాలు, మ్యాచ్ టై అయిపోయింది. మిగిలిన 2 బంతుల్లో ఒక్క సింగిల్ తీసినా సీఎస్‌కేదే విజయం. ఎప్పటిలాగే మహేంద్ర సింగ్ ధోనీ మ్యాచ్‌ని ముగించేస్తాడని అనుకున్నారంతా. కానీ సందీప్ శర్మ చివరి 3 బంతుల్లో మ్యాజిక్ చేశాడు...

Latest Videos


3 బంతుల్లో 3 సింగిల్స్ మాత్రమే వచ్చాయి. ఈ మ్యాచ్‌పై మహేంద్ర సింగ్ ధోనీ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘మిడిల్ ఓవర్లలో కావాల్సినన్ని పరుగులు రాలేదు. పిచ్ చాలా బాగుంది. అయితే వాళ్ల టీమ్‌లో అశ్విన్, యజ్వేంద్ర చాహాల్ వంటి సీనియర్ స్పిన్నర్లు ఉన్నారు.. 
 

(PTI PhotoR Senthil Kumar)(PTI04_03_2023_000329B)

ఆఖరి ఓవర్‌లో మ్యాచ్‌ని ఫినిష్ చేయగలమనే అనుకున్నాం. నేను జడేజా సిక్సర్‌తో ఫినిష్ చేస్తాడని అనుకున్నా. అతనేమో నాకే ఫినిషింగ్ ఛాన్స్ ఇచ్చాడు. సందీప్ శర్మ బాగా బౌలింగ్ చేశాడు. నేను స్ట్రైయిట్ సిక్సర్ కొడదామని అనుకున్నా కానీ అతను నాకు ఆ అవకాశం ఇవ్వలేదు..

Image credit: PTI

ఈ మ్యాచ్‌లో ఓడినా ఆఖరి ఓవర్ వరకూ పోరాడాం. 3 పరుగుల తేడాతో ఓడినా మాకు నెట్ రన్ రేట్ కలిసి వస్తుంది. చివరి వరకూ 100 శాతం ప్రయత్నించాం. అది మాకు సంతృప్తిని ఇచ్చింది..’ అంటూ కామెంట్ చేశాడు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. 

click me!