ఇది సర్ సందీప్ శర్మ అంటే! వేలంలో అమ్ముడుపోని ప్లేయర్‌గా నిలిచి, ఆఖరి ఓవర్‌లో యార్కర్లతో ధోనీకే...

First Published Apr 13, 2023, 10:13 AM IST

సందీప్ శర్మ, ఐపీఎల్‌లో మోస్ట్ అండర్‌రేటెడ్ బౌలర్. సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో చివరి 3 బంతుల్లో 7 పరుగులు ఇవ్వకుండా వరల్డ్ మోస్ట్ డేంజరస్ బ్యాటర్లు ధోనీ, జడేజాలను నిలవరించి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశాడు సందీప్ శర్మ... అయితే ఐపీఎల్ 2023 మినీ వేలంలో సందీప్ శర్మ అమ్ముడుపోని ప్లేయర్‌గా నిలవాల్సి వచ్చిందనే విషయం మీకు తెలుసా...

క్రీజులో మహేంద్ర సింగ్ ధోనీ రూపంలో మాంస్టర్ ఫినిషర్. ధోనీ లాంటి సీనియర్, మాజీ కెప్టెన్, ఫినిషర్, బ్యాటింగ్ లెజెండ్ క్రీజులో ఉంటే ఏ బౌలర్ అయినా భయపడతాడు. అదీకాకుండా మొదటి 3 బంతుల్లో రెండు సిక్సర్లు బాదేశాడు ధోనీ. చివరి 3 బంతుల్లో సీఎస్‌కే విజయానికి 7 పరుగులే కావాలి...

(PTI PhotoR Senthil Kumar)(PTI04_03_2023_000329B)

స్టేడియంలో ఉన్న చెన్నై ఫ్యాన్స్ అందరూ ఇక తమ టీమ్ గెలిచేసినట్టే అని ఫిక్స్ అయిపోయి సంబరాలు చేసుకోవడం మొదలెట్టారు. అయితే ఆ తర్వాత సందీప్ షో మొదలైంది. నాలుగో బంతికి సింగిల్ మాత్రమే వచ్చింది. జడ్డూ మామూలోడు కాదు, వరల్డ్ క్లాస్ హిట్టర్. అయితే అతను కూడా సందీప్ శర్మ యార్కర్‌కి సింగిల్ మాత్రమే తీయగలిగాడు..

Latest Videos


ఆఖరి బంతికి 4 కొడితే మ్యాచ్ టై అవుతుంది. 6 కొడితే చెన్నైదే విజయం. ఇలాంటి చాలా సందర్భాల్లో సిక్సర్లు బాదిన రికార్డు ధోనీది. అయితే సందీప్ శర్మ ఎలాంటి ఛాన్స్ ఇవ్వలేదు. మరో అద్భుతమైన యార్కర్‌తో బ్యాటుని పైకి లేపే ఛాన్స్ ఇవ్వలేదు. ఫలితం చివరి బంతికి కూడా సింగిల్ మాత్రమే వచ్చింది.. రాజస్థాన్ రాయల్స్ 3 పరుగుల తేడాతో విజయం అందుకుంది..

సందీప్ శర్మ ప్లేస్‌లో వేరే బౌలర్ ఉంటే గట్టిగా అరుస్తూ సెలబ్రేట్ చేసుకునేవాడే. తన వల్లే టీమ్ గెలిచిందని తన సెలబ్రేషన్స్‌తో మిగిలిన టీమ్ ప్లేయర్‌కి గుర్తు చేసేవాడు. అయితే సందీప్ శర్మ మాత్రం సింపుల్‌లా అలా చెయ్యి పైకెత్తి సెలబ్రేట్ చేసుకున్నాడు. డెత్ ఓవర్‌లో సూపర్ బౌలింగ్‌తోనే కాదు, సింపుల్ యాటిట్యూడ్‌తో సీఎస్‌కే ఫ్యాన్స్ మనసులు కూడా గెలుచుకున్నాడు.. 
 

సందీప్ శర్మ ప్లేస్‌లో వేరే బౌలర్ ఉంటే గట్టిగా అరుస్తూ సెలబ్రేట్ చేసుకునేవాడే. తన వల్లే టీమ్ గెలిచిందని తన సెలబ్రేషన్స్‌తో మిగిలిన టీమ్ ప్లేయర్‌కి గుర్తు చేసేవాడు. అయితే సందీప్ శర్మ మాత్రం సింపుల్‌లా అలా చెయ్యి పైకెత్తి సెలబ్రేట్ చేసుకున్నాడు. డెత్ ఓవర్‌లో సూపర్ బౌలింగ్‌తోనే కాదు, సింపుల్ యాటిట్యూడ్‌తో సీఎస్‌కే ఫ్యాన్స్ మనసు కూడా గెలుచుకున్నాడు.. 

virat kohli sandeep sharma

పవర్ ప్లేలో అత్యధిక వికెట్లు తీసిన ఐపీఎల్‌ బౌలర్‌గా రికార్డు క్రియేట్ చేసిన సందీప్ శర్మ, విరాట్ కోహ్లీని అత్యధిక సార్లు అవుట్ చేసిన బౌలర్ కూడా. అయినా సందీప్ శర్మకు రావాల్సినంత గుర్తింపు కానీ, అవకాశాలు కానీ రావడం లేదు...

ఐపీఎల్‌లో నాలుగు సీజన్ల పాటు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి ఆడిన సందీప్ శర్మను డేవిడ్ వార్నర్ అద్భుతంగా వాడుకున్నాడు. పవర్ ప్లేలో భువీతో కలిసి బౌలింగ్ చేసేవాడు సందీప్ శర్మ. ఐపీఎల్ కెరీర్‌లో సందీప్ శర్మ 92 ఇన్నింగ్స్‌ల్లో పవర్ ప్లేలో 53 వికెట్లు తీయగా... 99 ఇన్నింగ్స్‌ల్లో 52 వికెట్లు తీసిన జహీర్ ఖాన్ రెండో స్థానంలో ఉన్నాడు... 

అయితే డేవిడ్ వార్నర్‌ని బయటికి సాగనంపిన తర్వాత సందీప్ శర్మను కూడా వదిలేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్.  2018లో సందీప్ శర్మను రూ.3 కోట్లకు కొనుగోలు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్... 2022 మెగా వేలంలో బేస్ ప్రైజ్ రూ.50 లక్షలకే పంజాబ్ కింగ్స్‌లోకి వెళ్లాడు సందీప్...

2022లో కేవలం 5 మ్యాచులు మాత్రమే ఆడిన సందీప్ శర్మ, 2 వికెట్లు మాత్రమే తీశాడు. దీంతో అతన్ని వేలానికి వదిలేసింది పంజాబ్ కింగ్స్. 2023 మినీ వేలంలో అమ్ముడుపోని సందీప్ శర్మ, గాయపడిన ప్రసిద్ధ్ కృష్ణ ప్లేస్‌లో రీప్లేస్‌మెంట్‌గా రాజస్థాన్ రాయల్స్ టీమ్‌లో చేరాడు...

సందీప్ శర్మ కోసం ముంబై ఇండియన్స్ టీమ్ కూడా ప్రయత్నించింది. జస్ప్రిత్ బుమ్రా స్థానంలో సందీప్ శర్మను ఆడించాలని అనుకుంది. అయితే అప్పటికే రాజస్థాన్ రాయల్స్‌తో సందీప్ శర్మ ఒప్పందం కుదుర్చుకోవడంతో ముంబై ఇండియన్స్.. అతన్ని మిస్ చేసుకుంది.  

click me!