శ్రేయాస్ అయ్యర్ ప్లేస్‌లో జాసన్ రాయ్! జే రిచర్డ్‌సన్ ప్లేస్‌లో రిలే మెడరిత్... జోరుగా రిప్లేస్‌మెంట్స్...

Published : Apr 06, 2023, 08:37 PM IST

ఐపీఎల్ 2023 సీజన్ ప్రారంభమై వారం రోజులు కూడా గడవకముందే అరడజను మంది ప్లేయర్లు గాయపడ్డారు. కేన్ విలియంసన్, రిస్ తోప్లే వంటి ప్లేయర్లు, మ్యాచ్ ఆడుతూ గాయపడగా మరికొందరు సీజన్ ఆరంభానికి ముందే గాయంతో తప్పుకున్నారు.  వారి ప్లేస్‌లో కొత్త ప్లేయర్లను బరిలో దింపుతున్నాయి ఫ్రాంఛైజీలు.. 

PREV
17
శ్రేయాస్ అయ్యర్ ప్లేస్‌లో జాసన్ రాయ్! జే రిచర్డ్‌సన్ ప్లేస్‌లో రిలే మెడరిత్... జోరుగా రిప్లేస్‌మెంట్స్...

గాయం కారణంగా ఐపీఎల్ 2023 సీజన్‌కి దూరమైన కేకేఆర్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ప్లేస్‌లో ఇంగ్లాండ్ ఓపెనర్ జాసన్ రాయ్‌ని తీసుకుంది కోల్‌కత్తా నైట్‌రైడర్స్. ఐపీఎల్ 2022 మెగా వేలంలో గుజరాత్ టైటాన్స్ బేస్ ప్రైజ్ రూ.2 కోట్లకు జాసన్ రాయ్‌ని కొనుగోలు చేసింది..
 

27
Jason Roy

అయితే ఐపీఎల్ 2022 సీజన్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడని జాసన్ రాయ్, ఆ తర్వాత జరిగిన 2023 మినీ వేలంలో అమ్ముడుపోలేదు..  2017,2018 సీజన్లలో ఢిల్లీ క్యాపిటల్స్ తరుపున ఆడిన జాసన్ రాయ్, 2021 సీజన్‌లో జానీ బెయిర్‌స్టో ప్లేస్‌లో రీప్లేస్‌మెంట్‌గా సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి ఆడాడు..

37

జాసన్ రాయ్ బేస్ ప్రైజ్ రూ.1.5 కోట్లు అయినా అతనికి రూ.2.8 కోట్లు చెల్లించడానికి ఒప్పందం కుదుర్చుకుంది కోల్‌కత్తా నైట్‌రైడర్స్. ‘ఇంగ్లాండ్ ఓపెనర్ జాసన్ రాయ్‌ని టాటా ఐపీఎల్ 2023 సీజన్ కోసం రూ.2.8 కోట్లకు ఒప్పందం కుదుర్చుకున్నాం. అతని బేస్ ప్రైజ్ రూ. 1.5 కోట్లు’ అంటూ స్టేట్‌మెంట్‌లో తెలియచేసింది కేకేఆర్..

47

శ్రేయాస్ అయ్యర్‌తో పాటు బంగ్లా సీనియర్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ కూడా ఐపీఎల్ 2023 సీజన్ నుంచి తప్పుకున్నాడు. షకీబ్ అల్ హసన్ వ్యక్తిగత కారణాలతో ఐపీఎల్ నుంచి తప్పుకున్నాడని ప్రచారం జరిగినా, ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో పాల్గొనడానికి బంగ్లా క్రికెట్ బోర్డు అతనికి అనుమతి ఇవ్వలేదని కూడా వార్తలు వినిపిస్తున్నాయి...
 

57

లూకీ ఫర్గూసన్ కూడా గాయంతో బాధపడుతుండడంతో కోల్‌కత్తా నైట్‌రైడర్స్, ఐపీఎల్ 2023 సీజన్‌లో స్టార్లు లేకుండా బరిలో దిగుతోంది. జాసన్ రాయ్ అందుబాటులోకి వస్తే, అతనితో వికెట్ కీపింగ్ చేసే అవకాశం కూడా దొరుకుతుంది..
 

67

గాయంతో ఐపీఎల్ 2023 సీజన్2కి దూరమైన ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ జే రిచర్డ్‌సన్ ప్లేస్‌లో రిలే మెడరిత్‌ని తీసుకుంది ముంబై ఇండియన్స్..  ఐపీఎల్ 2021 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ రూ.8 కోట్లకు రిలే మెడరిత్‌ని కొనుగోలు చేసింది. అయితే 5 మ్యాచుల్లో 4 వికెట్లే తీసిన మెడరిత్ తీవ్రంగా నిరాశపరిచాడు...
 

77
Image credit: PTI

ఐపీఎల్ 2022 మెగా వేలంలో రిలే మెడరిత్‌ని బేస్ ప్రైజ్ రూ.1 కోటికి దక్కించుకుంది ముంబై ఇండియన్స్. 8 మ్యాచులు ఆడి 8 వికెట్లు తీసిన మెడరిత్‌ని 2023 వేలానికి వదిలేసింది ముంబై. 2023 సీజన్‌లో మెడరిత్‌ని ఏ జట్టూ కొనుగోలు చేయలేదు.. బేస్ ప్రైజ్ రూ.1.5 కోట్లకు ముంబై ఇండియన్స్ తరుపున ఆడబోతున్నాడు రిలే మెడరిత్..

click me!

Recommended Stories