అక్తర్, డేల్ స్టెయిన్ కంటే ఎక్కువ ఓవర్లు వేసిన ‘మాస్టర్’... సచిన్ టెండూల్కర్ ఈ రికార్డు గురించి తెలిస్తే..

Published : Apr 22, 2023, 11:36 AM IST

క్రికెట్ ప్రపంచంలో సచిన్ టెండూల్కర్ ఓ తిరుగులేని బ్యాటింగ్ సూపర్ స్టార్. 1973, ఏప్రిల్ 24న జన్మించిన సచిన్ టెండూల్కర్, 50వ పుట్టినరోజు వేడుకల కోసం ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రెండు రోజుల ముందు నుంచి మాస్టర్ బర్త్ డే సెలబ్రేషన్స్ మొదలైపోయాయి. 463 అంతర్జాతీయ వన్డేల్లో 18,426 పరుగులు చేసిన టెండూల్కర్, 200 టెస్టుల్లో 15,921 పరుగులు చేసి... ‘క్రికెట్ గాడ్’గా కీర్తి ఘడించాడు.

PREV
16
అక్తర్, డేల్ స్టెయిన్ కంటే ఎక్కువ ఓవర్లు వేసిన ‘మాస్టర్’... సచిన్ టెండూల్కర్ ఈ రికార్డు గురించి తెలిస్తే..
Sachin Tendulkar

బ్యాటింగ్ దిగ్గజంగా పేరుగాంచిన సచిన్ టెండూల్కర్.. క్రికెట్ పుస్తకంలో సగం పేజీలను తన రికార్డులతోనే నింపేశాడు. అయితే బ్యాటుతోనే కాదు, బంతితోనూ చాలామంది బౌలింగ్ లెజెండ్స్‌కి దక్కని రికార్డులు సచిన్ టెండూల్కర్ క్రియేట్ చేశాడని చాలామందికి తెలీదు...

26
Sachin Tendulkar

వన్డేల్లో ఆస్ట్రేలియా, పాకిస్తాన్‌పై ఐదేసి వికెట్లు తీసిన సచిన్ టెండూల్కర్‌, వెస్టిండీస్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, సౌతాఫ్రికాలపై నాలుగేసి వికెట్లు తీశాడు.. ఓవరాల్‌గా 463 వన్డేల్లో 154 వికెట్లు తీశాడు సచిన్ టెండూల్కర్...

36
Sachin Tendulkar

సచిన్ టెండూల్కర్ తన వన్డే కెరీర్‌లో 1342 ఓవర్లు బౌలింగ్ చేస్తే... పాక్ దిగ్గజ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ 1294, సౌతాఫ్రికా లెజెండరీ ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్ 1042 ఓవర్లు, ఇంగ్లాండ్ సీనియర్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ 1019 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశారు...

46
Sachin Tendulkar

సచిన్ టెండూల్కర్ తన 24 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో వన్డేల్లో 8054 బంతులు బౌలింగ్ చేయగా... షోయబ్ అక్తర్ 7764, డేల్ స్టెయిన్ 6256 బంతులు మాత్రమే బౌలింగ్ చేశారు. స్టువర్ట్ బ్రాడ్ 121 వన్డేల్లో 6109 బంతులు మాత్రమే బౌలింగ్ చేశాడు... అక్తర్, డేల్ స్టెయిన్ ఇప్పటికే అంతర్జాతయ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యారు. 

56
Sachin Tendulkar

టెస్టుల్లో మాత్రం సచిన్ టెండూల్కర్ కంటే ఈ ముగ్గురూ రెట్టింపు సంఖ్యలో ఓవర్లు బౌలింగ్ చేయడం విశేషం. టెస్టుల్లో మాస్టర్ సచిన్ 4240 బంతులు మాత్రమే బౌలింగ్ చేసి 46 వికెట్లు పడగొట్టాడు...

66
Sachin Tendulkar

షోయబ్ అక్తర్ తన టెస్టు కెరీర్‌లో 8143 బంతులు బౌలింగ్ చేయగా డేల్ స్టెయిన్ 18608 బంతులు బౌలింగ్ చేశాడు. వన్డేల్లో చోటు కోల్పోయినా టెస్టుల్లో ఇంకా కొనసాగుతున్న స్టువర్ట్ బ్రాడ్ 32,404 బంతులు వేసి... అత్యధిక టెస్టులు ఆడిన పేసర్ల జాబితాలో ఉన్నాడు..

click me!

Recommended Stories