గత నెల 31న అహ్మదాబాద్ వేదికగా ఘనంగా మొదలైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో మూడు వారాలు పూర్తి చేసుకుని నాలుగో వారంలోకి అడుగిడింది. ఇప్పటికే అన్ని జట్లు ఐదు మ్యాచ్ లు పూర్తి చేసుకున్నాయి. ఫస్ట్ వీక్ అంతా సో సో గా వన్ సైడ్ వార్ లా జరిగిన మ్యాచ్ లు తర్వాత ఊపందుకున్నాయి. లాస్ట్ ఓవర్ థ్రిల్లర్ లు, ఆఖరి బంతికి పలితాలు మ్యాచ్ లను మరింత రసవత్తరంగా మారుస్తున్నాయి.
25
ఇప్పటికే విడుదల చేసిన షెడ్యూల్ మేరకు లీగ్ మ్యాచ్ లు మే 23 వరకు జరుగుతాయి. కాగా ఇవి ముగిసిన వెంటనే ఐపీఎల్ లో ప్లేఆఫ్స్, ఫైనల్స్ జరుగుతాయి. తాజాగా బీసీసీఐ.. ప్లేఆఫ్స్, ఫైనల్స్ షెడ్యూల్ ను ప్రకటించింది. ప్లేఆఫ్స్ 23 నుంచి 26 వరకు జరుగుతుండగా మే 28న తుది పోరు జరుగనుంది.
35
ప్లేఆఫ్స్ లో భాగంగా మే 23న తొలి క్వాలిఫయర్ జరగాల్సి ఉంది. చెన్నై వేదికగా ఫస్ట్ క్వాలిఫయర్ జరుగుతుంది. ఐపీఎల్ -16లో లీగ్ మ్యాచ్ లు ముగిసేనాటికి టేబుల్ టాపర్స్ గా ఉన్న 1, 2 వ జట్లు ఫస్ట్ క్వాలిఫయర్ ఆడతాయి. ఇక మే 24న ఎలిమినేటర్ జరుగనుంది. టీమ్ 3, టీమ్ 4 జట్లు ఈ పోరులో తలపడతాయి. ఈ మ్యాచ్ కూడా చెన్నై వేదికగా జరగాల్సి ఉంది.
45
IPL Trophy
మే 26న క్వాలిఫయర్ 2 జరుగుతుంది. ఎలిమినేటర్ మ్యాచ్ లో గెలిచిన జట్టుతో క్వాలిఫయర్ -1లో ఓడిన జట్టు ఈ మ్యాచ్ లో తలపడతాయి. అహ్మదాబాద్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.
55
ఇక మే 28న క్వాలిఫయర్ - 1, క్వాలిఫయర్ -2 మధ్య ఫైనల్ జరుగుతుంది. ఫైనల్ కూడా అహ్మదాబాద్ వేదికగానే నిర్వహించేందుకు బీసీసీఐ సిద్ధమైంది. గతేడాది కూడా అహ్మదాబాద్ వేదికగానే ఫైనల్ ఆడిన విషయం తెలిసిందే.