ఐపీఎల్ 2023 సీజన్‌లో కొత్తగా తీసుకొచ్చిన రూల్ ఇంపాక్ట్ ప్లేయర్. మొదటి మ్యాచ్‌లో సీఎస్‌కే ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన తుషార్ దేశ్‌పాండే, అందరి అటెన్షన్ దక్కించుకున్నాడు. అయితే లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో ఇంపాక్ట్ ప్లేయర్‌ని మరో లెవెల్‌కి తీసుకెళ్లారు..
లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్‌లో అప్పటికే 4 ఓవర్లు పూర్తి చేసిన ఖలీల్ అహ్మద్ ప్లేస్‌లో ఆమన్ ఖాన్‌ని ఇంపాక్ట్ ప్లేయర్‌గా తీసుకొచ్చింది ఢిల్లీ క్యాపిటల్స్. చివరి ఓవర్‌కి ముందు ఆమన్ ఖాన్‌ని ఇంపాక్ట్ ప్లేయర్‌గా దింపాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో ఎవ్వరికీ అర్థం కాలేదు...
25
ఢిల్లీ ఇంపాక్ట్ ప్లేయర్‌ని సరిగా వాడుకోలేకపోయింది అయితే లక్నో సూపర్ జెయింట్స్ మాత్రం ఈ రూల్‌ని భలేగా వాడుకుంది. ఆఖరి ఓవర్ ఐదో బంతికి అవుటైన ఆయుష్ బదోనీ స్థానంలో ఇంపాక్ట్ ప్లేయర్‌గా కృష్ణప్ప గౌతమ్‌ని తీసుకుని, అతన్ని బ్యాటింగ్‌కి పంపింది...
35
Image: PTI
ఆయుష్ బదోనీ ప్లేస్‌లో కృష్ణప్ప గౌతమ్ టీమ్‌లోకి వచ్చాడు. అయితే అప్పటికే ఆయుష్ అవుట్ అయ్యాడు కదా... అయినా కృష్ణప్ప గౌతమ్ బ్యాటింగ్‌కి వచ్చి సిక్సర్ బాదాడు. ఈ లాజిక్ ఏంటో చాలామందికి అర్థం కాలేదు. దీనిపై ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ కూడా ఇదే విధంగా స్పందించాడు..
45
‘ఈ రూల్ చాలా కంఫ్యూజింగ్‌గా ఉంది. అస్సలు అర్థం కావడం లేదు. ఈ టోర్నీకి ఇలాంటి అదనపు హంగులు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తాయి. అవుటైన ప్లేయర్ ప్లేస్‌లో ఇంపాక్ట్ ప్లేయర్‌ని వాడి బ్యాటింగ్‌కి పంపడం ఏంటో నాకైతే చాలా గందరగోళంగా ఉంది...’ అంటూ కామెంట్ చేశాడు ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్..
55
Source: PTI
‘ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ఇప్పుడిప్పుడే వచ్చింది. దాన్ని వాడే కొద్దీ అందరికీ అర్థమవుతుంది. ఇంపాక్ట్ ప్లేయర్‌ని ఎలా వాడాలో టీమ్ మేనేజ్‌మెంట్‌కి చాలా క్లారిటీ ఉంది. ఫన్నీగా అనిపించింది. దీన్ని మున్ముందు రకరకాల వాడాలని అనుకుంటున్నాం..’ అంటూ కామెంట్ చేశాడు లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కెఎల్ రాహుల్...