ధోనీ కంటే రోహిత్ శర్మ గొప్ప కెప్టెన్ కానీ క్రెడిట్ కోరుకోడు! మోస్ట్ అండర్‌రేటెడ్... - సునీల్ గవాస్కర్

First Published May 26, 2023, 5:17 PM IST

ఐపీఎల్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ. ధోనీ కెప్టెన్సీలో 12 సార్లు ప్లేఆఫ్స్ చేరిన చెన్నై సూపర్ కింగ్స్, 10వ సారి ఫైనల్ ఆడనుంది. అయితే ఇంతకుముందు 9 ఫైనల్స్ ఆడిన చెన్నై, నాలుగు టైటిల్స్ గెలిచింది...

2013 సీజన్ మధ్యలో ముంబై ఇండియన్స్‌కి కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న రోహిత్ శర్మ, అప్పటిదాకా 5 సీజన్లుగా అట్టర్ ఫ్లాప్ అవుతున్న అంబానీ టీమ్ రాత మార్చాడు. తొలి సీజన్‌లోనే కెప్టెన్‌గా టైటిల్ గెలిచాడు...

8 సీజన్ల గ్యాప్‌లో 5 టైటిల్స్ గెలిచిన ముంబై ఇండియన్స్, 2023 సీజన్‌లో ప్లేఆఫ్స్‌కి చేరింది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో ప్లేఆఫ్స్ చేరిన ప్రతీసారీ ముంబై ఇండియన్స్ టైటిల్ గెలిచింది. దీంతో ఈసారి రోహిత్ సేనపై భారీ అంచనాలు ఉన్నాయి..
 

‘అవును, రోహిత్ శర్మ మోస్ట్ అండర్‌రేటెడ్ ఐపీఎల్ కెప్టెన్. అతను ముంబై ఇండియన్స్‌కి ఐదు టైటిల్స్ అందించాడు. అయితే క్రెడిట్ కోరుకోకపోవడం వల్ల రావాల్సినంత గుర్తింపు రావడం లేదు...

ఉదాహరణకు ఆకాశ్ మద్వాల్, ఆయుష్ బదోనీని అవుట్ చేశాడు. ఆ తర్వాత నికోలస్ పూరన్ వికెట్ తీశాడు. బదోనీ వికెట్ తీసిన తర్వాత ఆకాశ్ మద్వాల్ బౌలింగ్ పూర్తిగా మారిపోయింది...
 

(PTI PhotoR Senthil Kumar)(PTI05_24_2023_000315B)

ఓవర్ ద వికెట్‌తో బదోనీ వికెట్ తీసి, అరౌండ్ ద వికెట్‌తో పూరన్ వికెట్ తీశాడు. రోహిత్ ప్లేస్‌లో మహేంద్ర సింగ్ ధోనీ ఉండి ఉంటే, అతనికి ఈ రెండు వికెట్ల క్రెడిట్ దక్కి ఉండేది. మాహీ మ్యాజిక్ వల్లే ఈ యంగ్ బౌలర్‌కి రెండు వికెట్లు దక్కాయని అనేవాళ్లు...

Mumbai Indians

చెన్నై సూపర్ కింగ్స్‌లో ధోనీ కెప్టెన్‌గా ఉండడం వల్ల అక్కడ ప్రతీ యంగ్ బౌలర్ సక్సెస్‌ క్రెడిట్ మాహీకి దక్కుతుంది. అయితే ముంబై ఇండియన్స్‌లో అలా జరగడం లేదు...
 

(PTI PhotoR Senthil Kumar)(PTI05_24_2023_000281B)

ఐపీఎల్‌లో మాహీ కంటే రోహిత్ గొప్ప కెప్టెన్, సక్సెస్‌ఫుల్ కెప్టెన్ అయినా ఎందుకంటే సీఎస్‌కేలో హైప్ ఎక్కువగా ఉంటుంది. అది చాలా సార్లు వర్కవుట్ అవుతుంది కూడా..

(PTI PhotoR Senthil Kumar)(PTI05_24_2023_000317B)

కెప్టెన్‌కి పరిస్థితుల గురించి పూర్తి అవగాహన ఉండాలి. మొదట బ్యాటింగ్ చేస్తుంటే నేహాల్ వదేరాని ఇంపాక్ట్ ప్లేయర్‌గా వాడుతున్నాడు. సాధారణంగా ఏ టీమ్‌ కూడా ఇలా ఓ బ్యాటర్‌ కోసం ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వాడడం చూడం. అదే రోహిత్ స్పెషాలిటీ. అతనికి కచ్చితంగా క్రెడిట్ దక్కాలి...’ అంటూ కామెంట్ చేశాడు కామెంటేటర్ సునీల్ గవాస్కర్... 

click me!