ఐపీఎల్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్ రోహిత్ శర్మ. ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా 8 సీజన్ల గ్యాప్‌లో ఐదు సార్లు టైటిల్స్ గెలిచాడు రోహిత్ శర్మ. అయితే 2022 మెగా వేలం తర్వాత ముంబై టీమ్ పర్ఫామెన్స్ పూర్తిగా పడిపోయింది..
లసిత్ మలింగ, కిరన్ పోలార్డ్ రిటైర్ అవ్వడం, ట్రెంట్ బౌల్ట్, హార్ధిక్ పాండ్యా, క్వింటన్ డి కాక్ వంటి ప్లేయర్లు వేరే టీమ్స్‌కి వెళ్లిపోవడంతో ముంబై ఇండియన్స్ టీమ్, చాలా వీక్ అయిపోయింది. 2023 సీజన్‌లో అనామక బౌలర్లతో నెట్టుకురావాల్సిన పరిస్థితి..
27
Image credit: PTI
‘రోహిత్ శర్మ కెప్టెన్సీపైన ఎందుకింత హైప్ వచ్చిందో నాకైతే అర్థం కాదు. అతను మంచి కెప్టెనే కావచ్చు కానీ గొప్ప కెప్టెన్ మాత్రం కాదు. ఎందుకంటే అతనికి బెస్ట్ టీమ్ దొరికింది, టైటిల్స్ గెలిచాడు...
37
Image credit: PTI
గత సీజన్ నుంచి రోహిత్ శర్మకు ఏం అర్థం కావడం లేదు. కెప్టెన్‌గా అట్టర్ ఫ్లాప్ అవుతున్నాడు. ఐపీఎల్‌లోనే కాదు, ఆసియా కప్, టీ20 వరల్డ్ కప్ టోర్నీల్లోనూ కెప్టెన్‌గా ఫెయిల్ అయ్యాడు.
47
Image credit: PTI
ఈ సీజన్‌లో కూడా రోహిత్ కెప్టెన్సీ అలాగే ఉంది. ఇలాంటి పర్ఫామెన్స్‌తో ప్లేఆఫ్స్ చేరడం కష్టమే...’ అంటూ కామెంట్ చేశాడు న్యూజిలాండ్ మాజీ క్రికెటర్, కామెంటేటర్ సైమన్ ధుల్..
57
ఐపీఎల్ 2022 సీజన్‌లో 14 మ్యాచుల్లో 10 పరాజయాలు అందుకున్న ముంబై ఇండియన్స్, పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచింది. ఈసారి కూడా ముంబై ఇండియన్స్ 10 మ్యాచుల్లో 5 విజయాలే అందుకుంది...
67
ఐదు ఐపీఎల్ టైటిల్స్ గెలిచిన కెప్టెన్‌గా భారీ అంచనాలతో టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ తర్వాత టీమిండియా సారథ్య బాధ్యతలు అందుకున్నాడు రోహిత్ శర్మ. అయితే రోహిత్ కెప్టెన్సీలో ఆసియా కప్ 2022, టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలు ఆడిన టీమిండియా, టైటిల్ మాత్రం గెలవలేకపోయింది..
77
Image credit: Getty
స్వదేశంలో జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో రోహిత్ కెప్టెన్సీలో టీమిండియా హాట్ ఫెవరెట్‌గా బరిలో దిగుతోంది. 2023 వన్డే వరల్డ్ కప్ తర్వాత రోహిత్ శర్మ రిటైర్ అవుతాడని కూడా ప్రచారం జరుగుతోంది..