రోహిత్ భాయ్, బౌలర్లతో ఒకే మాట చెప్పాడు! మా సక్సెస్ సీక్రెట్ అదే... ఇషాన్ కిషన్ కామెంట్స్...

First Published May 26, 2023, 3:51 PM IST

ఐపీఎల్ 2022 సీజన్‌లో 14 మ్యాచుల్లో నాలుగే విజయాలు అందుకున్న ముంబై ఇండియన్స్, పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచింది. 2023 సీజన్ ఫస్టాఫ్‌లో కూడా ముంబై అట్టర్ ఫ్లాప్ అయ్యింది.. సెకండాఫ్‌లో అదిరిపోయే కమ్‌బ్యాక్‌తో ప్లేఆఫ్స్‌లోకి దూసుకొచ్చింది...

గ్రూప్ స్టేజీలో 8 విజయాలతో నాలుగో స్థానంలో ప్లేఆఫ్స్‌కి వచ్చిన ముంబై ఇండియన్స్... ఎలిమినేటర్ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింగ్స్‌ని ఓడించి రెండో క్వాలిఫైయర్ ఆడనుంది...

గత సీజన్‌లో ముంబై ఇండియన్స్ బౌలింగ్ భారాన్ని మోసిన జస్ప్రిత్ బుమ్రాతో పాటు కిరన్ పోలార్డ్ కూడా ఈ సారి జట్టులో లేడు. రోహిత్ శర్మ ఫామ్‌లో కూడా లేడు. అయినా ముంబై ఇండియన్స్ వరుస విజయాలు అందుకుంది...
 

ఆకాశ్ మద్వాల్, హృతీక్ షోకీన్, కుమార్ కార్తీకేయ వంటి బేస్ ప్రైజ్ కుర్రాళ్లనే నమ్ముకున్న ముంబై ఇండియన్స్, భారీ ఆశలు పెట్టుకున్న జోఫ్రా ఆర్చర్ హ్యాండ్ ఇచ్చినా... అద్వితీయ ప్రదర్శనతో ఆకట్టుకుంటోంది...

(PTI PhotoR Senthil Kumar) (PTI05_24_2023_000321B)

‘ముంబై ఇండియన్స్ సక్సెస్‌కి రోహిత్ భాయ్ కెప్టెన్సీయే కారణం. ఎందుకంటే రోహిత్ భాయ్, యంగ్‌స్టర్స్‌లో నమ్మకాన్ని నింపి, వారి నుంచి బెస్ట్ రిజల్ట్ రాబట్టడం కళ్లారా చూశా. ఆయన ఎప్పుడూ నీపైన మాకు నమ్మకం ఉందని చెబుతూ ఉంటాడు..

ishan kishan

బౌలర్లు ఎక్కువ పరుగులు ఇచ్చినా కూడా రోహిత్ భాయ్ కోపం తెచ్చుకోరు. ప్రెషర్ తీసుకోకండి, కేవలం ఎంజాయ్ చేస్తూ బౌలింగ్ చేయండి. మేం మీకోసం మరిన్ని పరుగులు చేస్తామంటూ భరోసా నింపుతాడు...

Image credit: PTI

టీ20ల్లో యావరేజ్, స్ట్రైయిక్ రేట్ రెండూ చాలా ఓవర్‌ రేటెడ్. భారీ స్కోరు ఛేదించేటప్పుడు రిస్క్ తీసుకోవాల్సి ఉంటుంది. పిచ్ నుంచి సహకారం అందనప్పుడు 250+ స్ట్రైయిక్ రేటుతో పరుగులు చేయడం అయ్యే పని కాదు...’ అంటూ కామెంట్ చేశాడు ముంబై ఇండియన్స్ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్.. 

click me!