ఫైనల్స్‌లో ముంబై ఇండియన్సా.. వామ్మో వద్దు.. వాళ్లొస్తే మా కథ కంచికే : డ్వేన్ బ్రావో

First Published May 26, 2023, 10:49 AM IST

IPL 2023 Playoffs: ఐపీఎల్ - 16  లో లాస్ట్ రెండు మ్యాచ్‌లే మిగిలున్నాయి.   నేడు  గుజరాత్  టైటాన్స్ - ముంబై ఇండియన్స్ మధ్య క్వాలిఫయర్ -2 జరుగనుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన విజేత మే 28న ఫైనల్ లో  చెన్నై సూపర్ కింగ్స్ తో తలపడుతుంది.

ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ - చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ లకు ఉండే  క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పన్లేదు.   ఫ్యాన్స్ ఈ రెండు  టీమ్స్ మధ్య జరిగే  మ్యాచ్‌లను ‘ఎల్ క్లాసికో’గా పిలుస్తారు. ఐపీఎల్ లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీమ్స్ అయిన  ఈ రెండు జట్లు గత సీజన్ లో 9, 10 వ స్థానాల్లో ఉండగా ఇప్పుడు ఏకంగా ప్లేఆఫ్స్ చేరి స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇచ్చాయి. 

ఫస్ట్ క్వాలిఫయర్ లో చెన్నై సూపర్ కింగ్స్.. గుజరాత్ ను ఓడించగా ఎలిమినేటర్ లో  ముంబై ఇండియన్స్.. లక్నో సూపర్ జెయింట్స్ ను ఓడించింది.   ఇక  నేడు ముంబై చేతిలో గుజరాత్ ఓడిపోతే  అప్పుడు ఐపీఎల్ ఫైనల్ లో మరో ఎల్ క్లాసికోను వీక్షించొచ్చని  ఇరు జట్ల అభిమానులు  ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

ఫ్యాన్స్ ఆసక్తి ఒకలా ఉంటే ఆ జట్టు  మాజీ పేసర్, ప్రస్తుతం  సీఎస్కేకు మెంటార్ గా వ్యవహరిస్తున్న డ్వేన్ బ్రావో మాత్రం తాను ఫైనల్ కు ముంబై ఇండియన్స్ తో ఆడొద్దని కోరుకుంటున్నానని చెప్పడం గమనార్హం.  ఇటీవలే  గుజరాత్ తో మ్యాచ్ ముగిసిన తర్వాత  బ్రావో ఈ వ్యాఖ్యలు చేశాడు. 

స్టార్ స్పోర్ట్స్ చర్చలో భాగంగా మాథ్యూ హెడెన్.. ‘ఫైనల్ ఎవరితోని ఆడాలని కోరుకుంటున్నారు..?’ అని అడిగిన ప్రశ్నకు బ్రావో  సమాధానమిస్తూ..‘ముంబై తోనైతే వద్దు.. ఆ జట్టును చూస్తేనే నాకు భయంగా ఉంది..’ అని చెప్పాడు. 

అప్పుడు హెడెన్ కల్పించుకుని ‘ఎందుకు..?’ అని అడగ్గా.. బ్రావో మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం ప్లేఆఫ్స్ కు చేరిన జట్లు  క్వాలిటీ టీమ్స్.  ఫైనల్స్ కు ఎవరు వచ్చినా నా వ్యక్తిగత అభిప్రాయం అయితే   ముంబై ఇండియన్స్ రావద్దు. ఈ విషయం నా ఫ్రెండ్ కీరన్ పొలార్డ్ కు కూడా తెలుసు.   చూద్దాం.. ఫైనల్స్ కు ఎవరొస్తారో..’అని చెప్పుకొచ్చాడు. 

ఐపీఎల్ ప్లేఆఫ్స్, ఫైనల్స్ స్టేజ్ లో ముంబై - చెన్నై మధ్య ఎన్నో క్లాసిక్ గేమ్స్ సాగాయి.  ఇప్పటివరకూ   ఈ ఇరు జట్ల మధ్య  ఐదు  ప్లేఆఫ్స్ గేమ్స్ జరిగాయి. ఇందులో రెండు ముంబై గెలవగా మూడు చెన్నై గెలిచింది.  నాలుగు సార్లు ఫైనల్స్ జరగ్గా  మూడుసార్లు ముంబై గెలిచింది. ఒక్కసారి  మాత్రమే  చెన్నై నెగ్గింది. 

click me!