మోహిత్ శర్మ కెరీర్‌కి ఇది టర్నింగ్ పాయింట్ అవుతుందా... ఒకప్పుడు పర్పుల్ క్యాప్ విన్నర్, ఇప్పుడేమో...

First Published Apr 14, 2023, 6:13 PM IST

ఐపీఎల్ 2023 సీజన్‌ని ‘కమ్‌బ్యాక్’ ఇయర్‌గా గుర్తింపు ఇచ్చేయొచ్చు. ఎందుకంటే పేలవ ప్రదర్శనతో టీమ్‌కి దూరమైన అజింకా రహానే, విజయ్ శంకర్, వెంకటేశ్ అయ్యర్, శార్దూల్ ఠాకూర్.. ఇలాంటి సీనియర్లు అందరూ ఫస్ట్ క్వార్టర్‌లో ఇరగదీశారు. ఈ లిస్టులో మోహిత్ శర్మ కూడా చేరిపోయాడు..

ధోనీ కెప్టెన్సీలో టీమిండియాకి ఆడిన బౌలర్లలో మోహిత్ శర్మ ఒకడు. 2013 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ద్వారా ఐపీఎల్ ఎంట్రీ ఇచ్చిన మోహిత్ శర్మ, ఆ సీజన్‌లో 15 మ్యాచుల్లో 20 వికెట్లు తీశాడు. ఆ తర్వాతి సీజన్‌లో 16 మ్యాచులు ఆడి 23 వికెట్లు పడగొట్టాడు...

2014 సీజన్‌లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 14 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టిన మోహిత్ శర్మ, ఆ సీజన్‌లో ‘పర్పుల్ క్యాప్’ గెలిచాడు. పర్పుల్ క్యాప్ గెలిచాకే అతని కెరీర్ యూ టర్న్ తీసుకోవడం మొదలైంది. 2015 సీజన్‌లో 16 మ్యాచులు ఆడిన మోహిత్, 14 వికెట్లు మాత్రమే తీయగలిగాడు...

Latest Videos


పర్పుల్ క్యాప్ గెలిచిన మోహిత్ శర్మను, వేలానికి వదిలేసింది చెన్నై సూపర్ కింగ్స్. సీఎస్‌కే నుంచి పంజాబ్ కింగ్స్‌కి వెళ్లిన మోహిత్ శర్మ, 2016లో 14 మ్యాచుల్లో 13 వికెట్లు తీశాడు. అయితే ఎకానమీ గతి తప్పడంతో వరుస అవకాశాలు దక్కించుకోలేకపోయాడు. 

2018 ఐపీఎల్ సీజన్‌లో మోహిత్ శర్మ 9 మ్యాచుల్లో 7 వికెట్లు మాత్రమే తీసిన మోహిత్ శర్మ, పరుగులు భారీగా సమర్పిస్తుండడంతో పంజాబ్ కింగ్స్ కూడా అతన్ని వేలానికి విడుదల చేసింది.. పాత బౌలర్‌ని తిరిగి టీమ్‌లోకి తీసుకున్న సీఎస్‌కే, 20219, 2020 సీజన్లలో ఒక్కో మ్యాచ్ మాత్రమే ఆడించింది.

2021 వేలంలో అమ్ముడుపోని మోహిత్ శర్మ, 2022 ఐపీఎల్ సమంలో గుజరాత్ టైటాన్స్‌ టీమ్‌లో నెట్ బౌలర్‌గా చేరాడు. అతని పర్ఫామెన్స్ నచ్చడంతో టీమ్‌లోకి తీసుకున్న గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో అతన్ని తుది జట్టులో ఆడించింది...
 

ఈ మ్యాచ్‌లో జితేశ్ శర్మ, సామ్కుర్రాన్ వికెట్లు తీసిన మోహిత్ శర్మ, 4 ఓవర్లలో 18 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు గెలిచాడు. ఈ పర్ఫామెన్స్‌తో అతనికి మరికొన్ని మ్యాచుల్లో ఛాన్స్ రావచ్చు. ఆ ఛాన్సులను సరిగ్గా వాడుకుంటే కెరీర్ ఎండింగ్ స్టేజీలో ఉన్న మోహిత్‌కి మరో అవకాశం దక్కుతుంది...

2015 వన్డే వరల్డ్ కప్ ఆడిన మోహిత్ శర్మ, 8 మ్యాచుల్లో 13 వికెట్లు తీసి టాప్ పర్ఫామెన్స్ ఇచ్చాడు. వన్డే ఆరంగ్రేటం మ్యాచ్‌లోనే ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ గెలిచిన మోహిత్ శర్మ, చివరిగా 2015లో అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. మరి మోహిత్ ఈ ‘సెకండ్’ ఛాన్స్‌ని ఎలా వాడుకుంటాడో చూడాలి.. 

click me!