గాయం తగ్గకపోయినా ధోనీ ఆడతాడు! వాళ్లిద్దరూ మాత్రం... సీఎస్‌కే సీఈవో కాశీ విశ్వనాథ్ కామెంట్...

First Published Apr 14, 2023, 6:27 PM IST

ఐపీఎల్ 2023 సీజన్‌లో సీఎస్‌కే, మొదటి నాలుగు మ్యాచుల్లో రెండు విజయాలు, రెండు పరాజయాలు అందుకుంది. చెన్నై పర్ఫామెన్స్ ఎలా ఉన్నా, ధోనీ సిక్సర్లు బాదుతూ ఫ్యాన్స్‌ని ఖుషీ చేస్తున్నాడు. అయితే రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోనీ మ్యాచ్ ఫినిష్ చేయలేకపోయాడు...
 

dhoni injury

చివరి 3 బంతుల్లో 7 పరుగులు చేస్తే గెలిచే మ్యాచ్‌లో ధోనీ, రవీంద్ర జడేజా క్రీజులో ఉన్నా... 3 పరుగుల తేడాతో పరాజయం పాలైంది చెన్నై సూపర్ కింగ్స్. ఈ మ్యాచ్ సమయంలో ధోనీ సింగిల్స్ తీయడంలో ఇబ్బంది పడడం స్పష్టంగా కనిపించింది. మ్యాచ్ తర్వాత కూడా ధోనీ కుంటుతూ నడవడం ఫ్యాన్స్‌ని ఆశ్చర్యానికి గురి చేసింది..

(PTI PhotoR Senthil Kumar)(PTI04_12_2023_000360B)

చెన్నై సూపర్ కింగ్స్ హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమ్మింగ్, ధోనీ మోకాలి గాయంతో బాధపడుతున్నట్టు తెలియచేశాడు. ఐపీఎల్ 2023 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌కి ముందే మాహీ మోకాలి గాయం గురించి వార్తలు వచ్చాయి. అయితే అలాంటిదేమీ లేదని అప్పుడు చెప్పిన ఫ్లెమ్మింగ్, టైటాన్స్‌తో మ్యాచ్‌లో గాయం గురించి వ్యాఖ్యానించడం హాట్ టాపిక్ అయ్యింది...
 

Latest Videos


(PTI PhotoR Senthil Kumar)(PTI04_12_2023_000216B)

తాజాగా సీఎస్‌కే సీఈవో కాశీ విశ్వనాథ్, ధోనీ గాయం గురించి కీలక అప్‌డేట్ ఇచ్చాడు. ‘గాయమైనా సరే ధోనీ ఆడాలని అనుకుంటున్నాడు. ఆడతాడు కూడా. అతని మోకాలికి గాయమైన వార్త నిజమే కానీ ఆ విషయాన్ని మాహీ ఎప్పుడూ మాతో చెప్పలేదు. ఎందుకంటే అతను అన్ని మ్యాచులు ఆడాలని ఫిక్స్ అయ్యాడు..

బెన్ స్టోక్స్ గాయం నుంచి వేగంగా కోలుకుంటున్నాడు. మా అంచనా ప్రకారం ఏప్రిల్ 30 మ్యాచ్ సమయానికి అతను టీమ్‌కి అందుబాటులో ఉంటాడు. లేదా అంతకుముందే రావచ్చు. ఫిజియో సూచనలతో అతనికి రెండు వారాల విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం...

బెన్ స్టోక్స్‌తో పోలిస్తే దీపక్ చాహార్ రావడానికి ఇంకాస్త ఎక్కువ సమయమే పడుతుంది. నా అంచనా ప్రకారం అతను మే మొదటి వారంలో తిరిగి ఆడతాడు. కీలక ప్లేయర్లు లేకపోయినా ఉన్న ప్లేయర్లతో మ్యాచులు ఎలా గెలవాలో ధోనీకి బాగా తెలుసు...’ అంటూ కామెంట్ చేశాడు చెన్నై సూపర్ కింగ్స్ సీఈవో కాశీ విశ్వనాథ్..

click me!