అదేదో ఫ్లోలో వచ్చేసింది! రింకూ సింగ్ మళ్లీ అలాంటి ఇన్నింగ్స్ ఆడలేడు.. వీరేంద్ర సెహ్వాగ్ కామెంట్..

Published : Apr 15, 2023, 11:37 AM IST

ఐపీఎల్ 2023 సీజన్‌లో అందరి అటెన్షన్ దక్కించుకున్న ప్లేయర్ రింకూ సింగ్. గత ఏడాది రెండు మూడు మ్యాచుల్లో మెరుపులు మెరిపించిన రింకూ, గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చివరి ఓవర్‌లో 5 సిక్సర్లు బాది సెన్సేషన్ క్రియేట్ చేశాడు...

PREV
18
అదేదో ఫ్లోలో వచ్చేసింది! రింకూ సింగ్ మళ్లీ అలాంటి ఇన్నింగ్స్ ఆడలేడు.. వీరేంద్ర సెహ్వాగ్ కామెంట్..
(PTI Photo/Swapan Mahapatra) (PTI04_06_2023_000300B)

యష్ దయాల్ బౌలింగ్‌లో వరుసగా ఐదు సిక్సర్లు బాది, కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌కి అద్భుత విజయం అందించిన రింకూ సింగ్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా హాఫ్ సెంచరీతో మెరిశాడు...

28

హారీ బ్రూక్ సెంచరీ కారణంగా 229 పరుగుల భారీ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌ని ఆఖరి ఓవర్‌ వరకూ టెన్షన్ పెట్టింది కోల్‌కత్తా నైట్ రైడర్స్. ఓ వైపు కెప్టెన్ నితీశ్ రాణా, మరోవైపు రింకూ సింగ్ కలిసి మ్యాచ్‌ని చివరి ఓవర్ వరకూ తీసుకెళ్లారు.
 

38
(PTI Photo/Swapan Mahapatra) (PTI04_06_2023_000334B)

31 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 58 పరుగులు చేసిన రింకూ సింగ్, 19వ ఓవర్ ఆఖరి రెండు బంతుల్లో బౌండరీలు బాదడంతో మ్యాచ్‌లో ఉత్కంఠ రేగింది. చివరి ఓవర్‌లో కేకేఆర్ విజయానికి 32 పరుగులు కావాల్సి వచ్చాయి.  అయితే 8 పరుగులే ఇచ్చిన ఉమ్రాన్ మాలిక్, సన్‌రైజర్స్ విజయాన్ని ఖాయం చేశాడు..
 

48
(PTI Photo/Swapan Mahapatra)(PTI04_03_2023_000213B)

‘రింకూ సింగ్ క్రీజులో ఉన్నంతవరకూ విజయంపై ధీమాగా ఉంటోంది కేకేఆర్. ఇంతకుముందు ధోనీ క్రీజులో ఉంటే మ్యాచ్ ఫినిష్ చేస్తాడని ఆఖరి వరకూ నమ్మేవాళ్లు. అలాగే సచిన్ టెండూల్కర్ క్రీజులో ఉంటే మ్యాచ్ మనదేనని అభిమానులు విశ్వసించేవాళ్లు..

58
(PTI Photo)(PTI04_09_2023_000322B)

ఇప్పుడు కేకేఆర్ టీమ్‌, అభిమానులు కూడా రింకూ సింగ్‌ని అలాగే నమ్ముతున్నారు. ఇంతకు ముందు ఆండ్రే రస్సెల్ ఇలాంటి నమ్మకం ఇచ్చాడు. ఐపీఎల్ చరిత్రలో ఎప్పుడూ అలాంటి విధ్వంసం చూడలేదు. అయితే మళ్లీ ఇలాంటి ఫీట్‌ని రింకూ కూడా రీక్రియేట్ చేయలేడు..

68

రింకూ సింగ్ తన రికార్డును బ్రేక్ చేయాలంటే ఓవర్‌లో ఆరుకి ఆరు సిక్సర్లు బాదాల్సిందే. ఎలాంటి అంచనాలు లేకుండా సునామీ సృష్టించిన రింకూ, ఇప్పుడున్న అంచనాలతో ఆ ఫీట్ అందుకోవడం అసాధ్యం. అది ఫ్లోలో వచ్చింది. తన కెరీర్‌ని మార్చేసింది..
 

78

ఇలాంటి ఇన్నింగ్స్ ఆడాలంటే కాస్త అదృష్టం కూడా కలిసి రావాలి. ఒకవేళ ఆఖరి ఓవర్‌లో అల్జెరీ జోసఫ్ బౌలింగ్ చేసి ఉంటే రింకూ సింగ్ ఇలాంటి ఇన్నింగ్స్ ఆడేవాడు కాదు. యష్ దయాళ్‌ని రింకూ సింగ్ నెట్స్‌లో ఎదుర్కొన్నాడు. 

88
Image credit: PTI

అతను ఎలా బౌలింగ్ చేస్తాడో, తన మైండ్‌సెట్ ఏంటో రింకూ సింగ్‌కి బాగా తెలుసు. అందుకే మొదటి సిక్సర్ తర్వాత యష్ దయాల్ ఎక్కడ బౌలింగ్ చేస్తాడో కూడా రింకూ ముందుగానే పసిగట్టాడు. అందుకే ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్‌లో మళ్లీ ఆ ఫీట్ సాధించలేకపోయాడు...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్.. 

click me!

Recommended Stories