రసెల్ కథ ముగిసింది.. ఇక కేకేఆర్‌కు అతడే దిక్కు: హర్భజన్ సింగ్

Published : May 20, 2023, 06:02 PM IST

IPL 2023: ఐపీఎల్ ‌లో సుమారు పదేండ్లుగా   కోల్కతా నైట్ రైడర్స్ తరఫున  ఆడుతున్న   ఆండ్రీ రసెల్ ఈ   సీజన్ లో అనుకున్న  స్థాయిలో రాణించలేకపోతున్నాడు. 

PREV
17
రసెల్ కథ ముగిసింది.. ఇక కేకేఆర్‌కు అతడే దిక్కు:   హర్భజన్ సింగ్
Image credit: PTI

ఐపీఎల్ ‌లో  గ్రేటెస్ట్ ఆల్ రౌండర్లలో ఒకడైన  ఆండ్రీ రసెల్ గత పది సీజన్ల నుంచి   కోల్కతా నైట్ రైడర్స్ లో కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు.    బ్యాటింగ్, బౌలింగ్ లలో ఆ జట్టుకు  విశేష సేవలందించిన  రసెల్.. ఈ సీజన్ లో మాత్రం బ్యాట్ తో గానీ  బాల్ తో గానీ  ఆకట్టుకోలేదు.  

27

అయితే ఐపీఎల్ లో రసెల్ కథ ఇక ముగిసిందని.. కేకేఆర్ కు ఎక్స్ ఫ్యాక్టర్ ఇకనుంచి  రింకూ సింగ్  మాత్రమేనని   తేల్చి చెప్పాడు.   ఈ సీజన్ నుంచే కేకేఆర్ లో రింకూ యుగం మొదలైందని, వచ్చే ఏడాది నుంచి అది మరింత  పీక్స్ కు వెళ్తుందని అంచనా వేశాడు. 

37
Image credit: Getty

స్టార్ స్పోర్ట్స్ లో జరిగిన ఓ చర్చా కార్యక్రమంలో వార్నర్ మాట్లాడుతూ.. ‘ఇప్పుడు కేకేఆర్ కు రింకూ సింగే ఎక్స్ ఫ్యాక్టర్.  రసెల్ కాదు. రసెల్ యుగం ముగిసింది.   ఇప్పుడు రింకూ  టైమ్. రింకూను    ఫినిషర్ గానే కాక   బ్యాటింగ్ ఆర్డర్ లో ముందుకు పంపినా అతడు ఆ రోల్  కు న్యాయం చేస్తాడు.  రింకూ టాలెంట్ వేరే లెవల్ అంతే.  త్వరలోనే అతడు భారత జట్టు తరఫున ఆడతాడన్న నమ్మకం నాకుంది..’ అని  చెప్పాడు. 

47

కాగా ఈ సీజన్ లో రింకూ.. 13 మ్యాచ్ లలో  407 పరుగులు చేసి   కేకేఆర్ విజయాలలో కీలక పాత్ర పోషించాడు.  గుజరాత్, పంజాబ్, చెన్నైలపై ఆ జట్టు విజయాల్లో  రసెల్ పాత్ర ఎంతో ఉంది.  కానీ రసెల్ మాత్రం   ఈ సీజన్ లో 220 రన్స్  మాత్రమే చేశాడు.  

57

 శనివారం రాత్రి  7.30 గంటలకు కోల్కతా.. ఈడెన్ గార్డెన్ వేదికగా  లక్నో సూపర్ జెయింట్స్ తో కీలక పోరులో తలపడనుంది. ఈ మ్యాచ్ లో గెలిచినా ఓడినా  కేకేఆర్ కు ప్లేఆఫ్స్ ఆశలు లేకున్నా    పాయింట్ల పట్టికలో తమ స్థానాన్ని మెరుగుపరుచుకునే అవకాశం ఉంటుంది.   

 

67

ఇక భజ్జీతో పాటు ఇదే కార్యక్రమంలో పాల్గొన్న టీమిండియా మాజీ పేసర్ శ్రీశాంత్ మాట్లాడుతూ..  పంజాబ్ తో మ్యాచ్ లో పృథ్వీ షా తిరిగి ఫామ్ లోకి రావడం  చాలా హ్యాపీగా ఉందని అన్నాడు.  పంజాబ్ తో మ్యాచ్ లో అతడు షార్ట్ పిచ్ డెలివరీలను  బాగా ఆడాడని కొనియాడాడు. 

77
Image credit: PTI

పృథ్వీ షాతో పాటు చెన్నై యువ సంచలనం  మతీశ పతిరాన  కూడా ఈ సీజన్ లో ఆకట్టుకుంటున్నాడని శ్రీశాంత్ తెలిపాడు.  రాబోయే రోజుల్లో అతడి బౌలింగ్  మరింత ప్రమాదకరంగా మారే అవకాశం లేకపోలేదని  చెప్పుకొచ్చాడు. సీఎస్కే సారథి మహేంద్ర సింగ్ ధోని కూడా అతడిని   బాగా వాడుకుంటున్నాడని హర్భజన్ సింగ్ చెప్పాడు. 

click me!

Recommended Stories