ఆ మూడు అట్టర్ ఫ్లాప్ ఐపీఎల్ టీమ్స్‌కి విరాట్ కోహ్లీకి ఉన్న రిలేషన్ ఏంటి? బ్యాడ్ లక్ మరీ ఇలా ఉంటే...

First Published May 22, 2023, 1:54 PM IST

ఐపీఎల్‌లో 16 సీజన్లుగా టైటిల్ గెలవకపోయినా టీమ్స్‌ ఆర్‌సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్. మిగిలిన టీమ్స్‌లో నిన్నగాక మొన్న వచ్చిన గుజరాత్ టైటాన్స్‌, మొదటి సీజన్‌లోనే టైటిల్ గెలిస్తే, లక్నో సూపర్ ఎంట్రీతో రెండు సీజన్లలోనూ ప్లేఆఫ్స్ చేరింది...

చెన్నై సూపర్ కింగ్స్‌ నాలుగు సార్లు టైటిల్ గెలిస్తే... మొదటి 5 సీజన్లలో టైటిల్ గెలవలేకపోయిన ముంబై ఇండియన్స్, ఆ తర్వాత 8 సీజన్ల గ్యాప్‌లో 5 టైటిల్స్ గెలిచేసింది. కోల్‌కత్తా నైట్‌రైడర్స్ కూడా రెండు సార్లు టైటిల్ గెలిచింది...

మొదటి సీజన్‌లో టైటిల్ కొట్టిన రాజస్థాన్ రాయల్స్, గత సీజన్‌లో ఫైనల్ చేరింది. హైదరాబాద్‌ పేరుతో వచ్చిన డెక్కన్ ఛార్జర్స్ 2009లో కప్పు కొడితే, సన్‌రైజర్స్ 2016లో టైటిల్ నెగ్గింది. ఇక మిగిలింది పంజాబ్, ఢిల్లీ, బెంగళూరు...

(PTI PhotoShahbaz Khan)(PTI05_17_2023_000244B)

16 సీజన్లుగా ఐపీఎల్ ఆడుతూ టైటిల్ నెగ్గని ఈ మూడు టీమ్స్‌కి విరాట్ కోహ్లీకి సంబంధం ఉండడం కొసమెరుపు. విరాట్ కోహ్లీ పంజాబీ కుటుంబానికి చెందినవాడు. ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్, 16 సీజన్లలో రెండే సార్లు ప్లేఆఫ్స్‌కి వెళ్లింది, అందులో ఒక్కసారి ఫైనల్ ఆడింది.

PTI PhotoRavi Choudhary)(PTI05_13_2023_000485B)

 16 సీజన్లలో 14 సార్లు గ్రూప్ స్టేజీకే పరిమితమైన పంజాబ్ కింగ్స్, ఐపీఎల్‌లో అట్టర్ ఫ్లాప్ టీమ్స్‌లో ఒకటిగా నిలిచింది.. ఈ సీజన్‌లో 8వ స్థానానికి పరిమితమైంది పంజాబ్ టీమ్.. 

పంజాబ్ నుంచి వలసవెళ్లి ఢిల్లీలో సెటిలైంది విరాట్ కోహ్లీ కుటుంబం. కోహ్లీ కూడా ఢిల్లీలోనే పుట్టి పెరిగాడు. ఢిల్లీ తరుపునే దేశవాళీ టోర్నీలు ఆడి టీమిండియాలోకి వచ్చాడు.

ఐపీఎల్‌లో నాలుగు సార్లు ఆఖరి పొజిషన్‌లో నిలిచిన ఢిల్లీ క్యాపిటల్స్, 2020లో మొట్టమొదటిసారి ఫైనల్ ఆడినా టైటిల్ మాత్రం గెలవలేకపోయింది...

(PTI PhotoShailendra Bhojak)(PTI05_21_2023_000407B)

ఐపీఎల్‌లో అత్యధిక పరాజయాలు అందుకున్న టీమ్‌గా, అత్యధిక సార్లు ఆఖరి స్థానంలో నిలిచిన టీమ్‌గా ఢిల్లీ క్యాపిటల్స్‌కి చెత్త రికార్డు ఉంది. 2019 నుంచి ఢిల్లీ పర్ఫామెన్స్ కాస్త మెరుగైనట్టు కనిపించినా, ఈ సీజన్‌లో వరుస పరాజయాలతో ప్లేఆఫ్స్ నుంచి తప్పుకున్న మొదటి టీమ్‌గా నిలిచి, పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో సెటిల్ అయ్యింది..
 

(PTI PhotoShailendra Bhojak)(PTI05_22_2023_000010B)

ఐపీఎల్ 2008లో ఆర్‌సీబీలోకి వచ్చిన విరాట్ కోహ్లీ, 16 సీజన్లుగా ఒకే టీమ్ తరుపున ఆడుతున్న ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. యాదృచ్ఛికమో లేక విరాట్ కోహ్లీ బ్యాడ్ లక్ మహిమో కానీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా 16 సీజన్లలో టైటిల్ గెలవలేకపోయింది..

(PTI PhotoRavi Choudhary) (PTI05_06_2023_000496B)

ప్రతీ సీజన్‌ ఆరంభంలో ‘ఈ సాలా కప్ నమ్‌దే’ అంటూ వింత వింత లెక్కలు, సెంటిమెంట్లతో దూసుకొచ్చే ఆర్‌సీబీ, సీజన్ మొదలయ్యాక వరుస పరాజయాలతో పాత చింతకాయ పచ్చడిలా అరిగిపోయిన సీడీని మళ్లీ మళ్లీ అదే డొక్కు డీవీడీ ప్లేయర్‌లో వేసి చూపిస్తోంది...

Virat Kohli

కోహ్లీకి ఏ మాత్రం సంబంధం లేని మిగిలిన టీమ్స్ అన్నీ ఐపీఎల్ టైటిల్స్ నెగ్గడం, ఏదో ఓ రకంగా సంబంధం ఉన్న ఈ మూడు టీమ్స్ మాత్రం ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలవలేకపోవడంతో విరాట్‌ని ట్రోల్ చేస్తూ సోషల్ మీడియాలో మీమ్స్ వైరల్ అవుతున్నాయి. 

click me!