మాటిస్తున్నా హిట్‌మ్యాన్.. నీ మీద మాట పడనివ్వను.. ఆ రికార్డు నాదే.. సున్నాల రికార్డు సమం చేసిన దినేశ్ కార్తీక్

Published : May 14, 2023, 05:56 PM IST

Most Ducks in IPL: ఐపీఎల్ -16 లో  దినేశ్ కార్తీక్  పేలవ ప్రదర్శన  కొనసాగుతోంది.  రాజస్తాన్ రాయల్స్ తో ఆర్సీబీ ఆడుతున్న మ్యాచ్ లో  దినేశ్ కార్తీక్ డకౌట్ అయ్యాడు.

PREV
17
మాటిస్తున్నా హిట్‌మ్యాన్.. నీ మీద మాట పడనివ్వను.. ఆ రికార్డు నాదే.. సున్నాల రికార్డు సమం చేసిన దినేశ్ కార్తీక్

ఐపీఎల్ -16 లో  ముంబై ఇండియన్స్   సారథి  రోహిత్ శర్మ   ఇటీవలే చెన్నై సూపర్ కింగ్స్ తో  జరిగిన మ్యాచ్ లో  డకౌట్ అయి ఈ లీగ్ లో  అత్యధిక సార్లు డకౌట్ అయిన ఆటగాడిగా  చెత్త రికార్డు నమోదు చేసిన విషయం తెలిసిందే.  

27

చెన్నై మ్యాచ్ లో  డకౌట్ అవడం  రోహిత్‌కు ఇది   16వ సారి. తద్వారా గతంలో  ఈ రికార్డు కలిగిన దినేశ్ కార్తీక్, మన్‌దీప్ సింగ్, సునీల్  నరైన్  ల  15 డకౌట్ ల రికార్డును అధిగమించాడు.  

37
Image credit: Getty

కానీ ఎవరొచ్చినా ఈ రికార్డు తన పేరిటే ఉండాలని   ఆర్సీబీ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ ఫిక్స్ అయినట్టున్నాడు.   తాజాగా  రాజస్తాన్ రాయల్స్ తో  జైపూర్ వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో కార్తీక్..    మరోసారి డకౌట్ అయి  రోహిత్ రికార్డును సమం చేశాడు.  

47

ఈ మ్యాచ్ లో  16వ ఓవర్లో బ్యాటింగ్ కు వచ్చిన  కార్తీక్.. ఆడమ్  జంపా వేసిన   ఆ ఓవర్లో  మూడో బాల్ కు   ఎల్బీడబ్ల్యూ అయి  డకౌట్ అయ్యాడు. తద్వారా   రోహిత్ అత్యధిక   డకౌట్ల రికార్డు (16) ను సమం చేశాడు.  

57

గత సీజన్ లో   దినేశ్ కార్తీక్ ఎలా ఆడాడో అందరికీ తెలిసిందే. ఆ సీజన్ లో  16 మ్యాచ్ లు ఆడిన   కార్తీక్..  10 ఇన్నింగ్స్ లలోనే 330 పరుగులు చేశాడు.   ఫినిషర్  రోల్ కు అసలైన న్యాయం చేసిన   కార్తీక్.. ఆర్సీబీ విజయాలలో కీలక పాత్ర  పోషించాడు. 

67

ఈ ప్రదర్శనలతో  బీసీసీఐ.. కార్తీక్ కు   గతేడాది ఆసియా కప్ తో పాటు  టీ20 ప్రపంచకప్ లలో ఆడించింది. రిషభ్ పంత్, సంజూ శాంసన్ లను  పక్కనెట్టి మరీ  కార్తీక్ తో ఆడించింది.  కానీ అతడు మాత్రం  స్థాయికి తగ్గ  ప్రదర్శనలు చేయక విఫలమయ్యాడు.   

77
Dinesh Karthik

ఈ ఐపీఎల్ సీజన్ లో  కార్తీక్   చెత్త ప్రదర్శనలతో  దారుణమైన ట్రోలింగ్ ఎదుర్కుంటున్నాడు.   11 ఇన్నింగ్స్ లలో బ్యాటింగ్ కు వచ్చిన  అతడు..  14 సగటుతో  140 పరుగులు మాత్రమబే చేశాడు.   హయ్యస్ట్ స్కోరు  30 కాగా..  రెండుసార్లు డకౌట్ అయ్యాడు.   

click me!

Recommended Stories