వాళ్లిద్దరినీ నమ్ముకుని, ఎన్నాళ్లు ఇలా గోదారి ఈదుతారు... కేకేఆర్‌పై యూసఫ్ పఠాన్ కామెంట్స్..

Published : May 14, 2023, 06:13 PM IST

ఐపీఎల్‌లో రెండు సార్లు టైటిల్స్ గెలిచిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్... ప్లేయర్ల విషయంలోనూ చాలా పక్కగా ఉంటుంది. ఐపీఎల్ 2022 సీజన్‌లో సునీల్ నరైన్‌తో పాటు ఆండ్రే రస్సెల్‌ని అట్టి పెట్టుకున్న కేకేఆర్... వరుణ్ చక్రవర్తి, వెంకటేశ్ అయ్యర్‌లను రిటైన్ చేసుకుంది...

PREV
18
వాళ్లిద్దరినీ నమ్ముకుని, ఎన్నాళ్లు ఇలా గోదారి ఈదుతారు... కేకేఆర్‌పై యూసఫ్ పఠాన్ కామెంట్స్..
PTI Photo/Swapan Mahapatra)(PTI04_14_2023_000342B)

2022 సీజన్‌లో ఈ నలుగురు అట్టర్ ఫ్లాప్ కాగా 2023 సీజన్‌లో వరుణ్ చక్రవర్తి, వెంకటేశ్ అయ్యర్ బాగానే ఆడుతున్నారు. అయితే సీనియర్లు ఆండ్రే రస్సెల్, సునీల్ నరైన్ మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నారు...

28

ఆల్‌రౌండర్‌గా రిటైన్ చేసుకున్న సునీల్ నరైన్ ఈసారి బ్యాటుతో అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. ఒక్క మ్యాచ్‌లో కూడా డబుల్ డిజిట్ స్కోరు అందుకోలేకపోయాడు. 3.33 యావరేజ్‌తో అట్టర్ ఫ్లాప్ అయ్యాడు.
 

38
Image credit: PTI

బౌలింగ్‌లో కూడా అదరగొట్టే పర్ఫామెన్స్ ఇచ్చింది లేదు. 12 ఇన్నింగ్స్‌ల్లో కలిపి 7 వికెట్లే తీసిన సునీల్ నరైన్, 8.5 ఎకానమీతో పరుగులు సమర్పించాడు. ఆండ్రే రస్సెల్‌ది కూడా ఇదే కథ..

48

12 మ్యాచుల్లో కలిసి 218 పరుగులు చేసిన ఆండ్రే రస్సెల్, బౌలింగ్‌లో 7 వికెట్లు తీశాడు. అయితే గత కొన్ని మ్యాచులుగా రస్సెల్ కాస్త మెరుగ్గానే రాణిస్తున్నాడు...
 

58

‘కేకేఆర్ ఇకనైనా సునీల్ నరైన్, ఆండ్రే రస్సెల్‌లపై అతిగా ఆధారపడడం మానేయాలి. గత మూడు నాలుగు సీజన్లుగా వీరి నుంచి ఆశించిన పర్ఫామెన్స్ రావడం లేదు. బ్యాటుతో కానీ బాల్‌తో కానీ మ్యాచ్ విన్నింగ్ పర్ఫామెన్సులు ఇవ్వడం లేదు..

68

ఓ టీమ్‌గా భవిష్యత్ తరాన్ని తయారుచేయాల్సిన బాధ్యత మేనేజ్‌మెంట్‌పైన ఉంది. ఓ సీనియర్ ప్లేయర్‌గా వికెట్లు తీస్తూ, పరుగులు చేస్తూ టీమ్‌ని ముందుండి నడిపించాల్సిన బాధ్యత నరైన్, రస్సెల్‌పైన ఉంది...

78

అయితే వాళ్లు ఆ పని చేయలేకపోతున్నారు. సీనియర్లు ఫెయిల్ అయితే టీమ్ గెలవడం చాలా కష్టమైపోతుంది. ఎందుకంటే సీనియర్ ప్లేయర్లు ఫెయిల్ అయితే ఆ ప్రభావం జూనియర్లపై పడుతుంది.. 

88

రస్సెల్, నరైన్ వయసు మీద పడిందంటే నేను ఒప్పుకోను. వారి కంటే పెద్ద వయసున్న వాళ్లు ఐపీఎల్‌లో బాగా ఆడుతున్నారు, మ్యాచులు గెలిపిస్తున్నారు. వీళ్లిద్దరూ ఏడాది మొత్తం క్రికెట్ ఆడడం లేదు. అందుకే వీరి బాడీ షేప్ కరెక్టుగా ఉండడం లేదు...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ యూసఫ్ పఠాన్..  

click me!

Recommended Stories